Trinayani Today Episode: తిలోత్తమ నయని దగ్గరకు వచ్చి విశాల్‌ ప్రాణాలు కావాలి అంటుంది. దీంతో నయని సీరియస్ అవుతుంది. కుట్రలు కుతంత్రాలులతో ఎన్నెళ్లు బతుకుతారు అని తిలోత్తమకు క్లాస్ తీసుకుంటుంది. గాయత్రీ అమ్మగారు పునర్జన్మ ఎత్తినా ఇంకా ఇక్కడికి రానందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు అని అంటుంది.


తిలోత్తమ: అమ్మవారిలా ఉన్న నడిపి కోడలి దర్శనం అవుతుంది కానీ, పునర్జన్మలో ఉన్న తోడికోడలు దర్శనమే కావడం లేదు.  
నయని: అమ్మగారు నీ తోడికోడలా అలా అనడానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలి. 
తిలోత్తమ: పోనీ సవతి అనుకో..
నయని: ఆ తల్లి ప్రాణాలు పొట్టన పెట్టుకొని ఆ తల్లి స్థానంలోకి వచ్చి సవతి అనే నీచ బుద్ధి ఉన్న అవతివి నువ్వు.
తిలోత్తమ: ఎక్కువ కోప్పడితే అలంకరణ పోతుంది నయని. తొందరగా రెడీ అయి హాల్‌లోకి వచ్చి నాట్య ప్రదర్శన ఇవ్వు. పరమేశ్వరుడి క్రుప కటాక్షాలు పొందుదువు గాని.. సరేనా..
నయని: ఏం రాసుకున్నావ్ చేతికి.. అని నయని వాసన చూసి కళ్లు తిరిగి పడిపోతుంది.
తిలోత్తమ: శత్రువుకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే ఇదే నయని.. నీ భర్తకు గండం వచ్చినా తెలుసుకోలేవు..


విశాల్‌ ఇంట్లో పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి అందరూ పూజకు వస్తారు. నయని ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటారు. అమ్మవారి వేషధారణలో రెడీ అయ్యేందుకు టైం పడుతుంది అని అందుకే ఇంకా రాలేదు అని అనుకుంటారు. 


తిలోత్తమ: మనసులో.. మూర్ఛపోయింది నయని. తను వచ్చేలోపు నీటిలో నేను కలిపిన విషం శివలింగం మీద పడి విశాల్ పని అయిపోతుంది.
గురువుగారు: స్వామివారిని శృతించండి..
డమ్మక్క: గట్టిగా పలకండి అప్పుడు స్వామి వారికే కాదు ఆ తల్లికి కూడా వినిపించి వస్తుంది.
అమ్మవారు: అచ్చం నయనిలా ప్రత్యక్షమై.. నయని పడుకొని ఉంటే.. నాకు పూజ చేసి జాగరణ చేయాలి అనకున్న నువ్వు చంచలమైన బుద్ధి కలవారు చేసిన పనికి నువ్వు పడుకున్నావు. పర్వాలేదు అలుపు వచ్చిందనుకో హాయిగా విశ్రాంతి తీసుకో. నీ బదులుగా నీలా నేను వెళ్లి వస్తా.. అని నయనిలా అమ్మవారు వస్తే.. విక్రాంత్ అమ్మవారు వచ్చారు అంటాడు. అందరూ చేతులు జోడించి దండం పెడతారు.
హాసిని: చెల్లి ఎంత ముద్దుగా ఉన్నావో.. 
గురువుగారు: అమ్మా దాక్షాయాణి నీ దర్శన భాగ్యం కలగడం మా పూర్వ జన్మ సుకృతం. 
అమ్మవారు: గురువుగారు, డమ్మక్క.. మీరు నయని అంటేనే బాగుంటుంది. లేదంటే కొంతమందికి బాధగా ఉంటుంది. 
డమ్మక్క: అర్థమైంద నయని..
గురువుగారు: త్రినయనివి నువ్వు అలాగే పిలుస్తాం అమ్మా.
వల్లభ: ఏంటి మమ్మీ బిత్తరపోయి చూస్తున్నావ్. 
తిలోత్తమ: రేయ్ మూర్చ పోయింది అప్పుడే ఎలా వస్తుందిరా.. తను ఆపదను గ్రహించే వచ్చింది అంటావా. 
విశాల్: నయని నిజంగా దిష్టి తీయాలి అనేంతలా ఉన్నావు తెలుసా..
నయని: శేఖరుడికి హారతి ఇస్తే చాలు బాబుగారు నాకు దిష్టి పోతుంది.
సుమన: నిన్ను అందరూ కళ్లార్పకుండా చూస్తున్నారు అక్క జ్వరం వస్తే ఏ ఒక్కరిని తిట్టుకోకు చెప్తున్నా. 
నయని: గంగాధరుడి దగ్గర ఉంటే జలుబు చేస్తుందే తప్ప జ్వరం రాదు సుమన.
సుమన: శివుడి దగ్గర ఉండే గంగ నీకు స్నానం చేయిస్తున్నట్లు చెప్తున్నావ్ ఏంటి అక్క.
వల్లభ: గెటప్ వేయగానే అలా అయిపోయింది మీ అక్క. తర్వాత నయని శివరాత్రి విశిష్టత చెప్తుంది. 
సుమన: శిరోధార పాత్రని శివలింగం మీద కట్టారు కానీ అందులో నుంచి నీటిని శివలింగం మీద పడకుండా పువ్వుని అడ్డుపెట్టారు. 
పావనా: పూజ మొదలైనప్పుడు ఆ పువ్వు తీసేస్తా సరిపోతుందిలే అమ్మా.
తిలోత్తమ: శిరోధార పాత్రలో ఉన్న నీరు శివుడి మీద పడాలి అని ప్రయత్నిస్తే పువ్వు నిలబడగలదా.. 
నయని: నిజమే భక్తితో శివలింగం మీద చెంబుడి నీరు పోసినా మహాయాగం చేసినట్లే అని శంఖరుడు అంటాడు. 


తర్వాత నయని రూపంలో ఉన్న విశాలాక్షి అమ్మవారు నృత్యం చేస్తుంది. ఇంతలో శిరోధార పాత్రమీద ఉన్న పువ్వు రాలిపోతుంది. అయితే దాని నుంచి నీరు కిందకి రావు.. అది చూసి తిలోత్తమ, వల్లభ షాక్ అవుతారు. అయితే ఆ శిరోధార పాత్రలో పాము ఉంటుంది. ఇక వల్లభ మీదకు వెళ్లి మమ్మీ మమ్మీ అంటూ కంగారుగా పిలిచి పైన కట్టిన శిరోధార పాత్రలో పాము ఉందిని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సుహాస్: రెమ్యునరేషన్ పై నోరు విప్పిన సుహాస్ - ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటున్నాడంటే?