Trinayani Today Episode: సుమనను నిలదీసిన నయని మీదకు సుమన రివర్స్ అవుతుంది. అసలు గాయమే నీ వల్ల అయిందని తన అక్కని అంటుంది. కత్తి పట్టుకొని వచ్చి పెద్దత్తయ్యకు గాయం చేసిందే కాక నన్ను కత్తితో బెదిరించావని అంటుంది. దీంతో నయని తన వల్ల పొరపాటు జరిగింది అని తాను పెద్దమ్మగారికి ఎందుకు హాని చేస్తాను అని అంటుంది. 


సుమన: నువ్వే పొరపాటు అంటే సోఫా కింది పళ్ల కోసే కత్తికానీ నెక్లస్ బాక్స్ కానీ దొరికిందేమో.
విక్రాంత్: బాగా తెలివి మీరిపోయావే. విషపూరితమైన బుద్ధి గల నువ్వు బాగా మాట్లాడి తప్పించుకుంటున్నావ్.
సుమన: మీకు అంత అనుమానంగా ఉంటే పోయి పోలీస్ కేసు పెట్టండి పట్టుకెళ్లేది మా అక్కనే. 
విక్రాంత్: పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు ఎవరు ఎలాంటి వారో తెలీదా..
నయని: వదిలేయండి విక్రాంత్ బాబు. 
సుమన: చూశావా అక్క నింద నీ మీదకు రావడంతో వదిలేయమని ఈజీగా చెప్తున్నావ్.
నయని: పెద్దమ్మ గారికి ఎవరూ హాని తలపెట్టకపోతే  అంత కన్నా ఆనందం ఉండదు. నువ్వు కూడా నీ మనసులో మాట చెప్పేశావు కదా మంచిది. 
సుమన: తరగబడకపోతే బతకిచ్చేలా లేరు. రేపు తెల్లారి తెలుస్తుంది ఎవరు నమ్మకస్తులో. 


వల్లభ: మమ్మీ అందరూ గాయత్రీ పాప నామకరణంలో బిజీగా ఉన్నారు. త్వరగా మా మూలికను బయట పెట్టు. 
తిలోత్తమ: అఖండ స్వామి దీన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పారురా..


ఫ్లాష్ బ్యాక్‌లో..
అఖండ: ఈ మూలికను.. పాముకి పెట్టాలి. 
తిలోత్తమ: స్వామి ఇది ఏ పాముకి పెట్టాలి.  
అఖండ: లలితా దేవి రక్తం ఉన్న బట్టను గాయత్రీ దేవి మీద పడేలా చేసే మిమల్ని నాగయ్య పాము కాటేయడానికి రావొచ్చు. చిన్న పిల్ల మీద అలాంటి పని చేసేటప్పుడు ధర్మాన్ని చేసే నాగయ్య ఊరుకోడు.
తిలోత్తమ: అలా అని మా ప్రయత్నాన్ని మానుకోలేము కదా స్వామి. 
అఖండ: అందుకే ఈ మూలిక మీకిస్తున్నాను. నన్నే కాటేసిన నాగయ్య పాము మిమల్ని వదిలేస్తాడు అనుకోకండి.  
వల్లభ: స్వామి ఈ మూలికను తింటుందా..
అఖండ: తనదు..  ఇంటికి తీసుకెళ్లాక కొద్ది సేపటికి దీని వాసనను పాము పసిగడుతుంది. దగ్గరకు వచ్చిన పాము స్ఫృహ కోల్పోతుంది. ఈలోపే మీరు మీ పని పూర్తి చేసుకోవాలి. వీటిని ఎక్కువ వాడితే మీకే నష్టం. మూర్ఛపోయిన నాగయ్య జోలికి వెళ్లకండి దూరంగా ఉండండి. దగ్గరకు వెళ్తే వెంటనే కాటేస్తుంది. 


ప్రస్తుతం..


తిలోత్తమ: ఇప్పుడే నాకు ఓ ఐడియా వచ్చింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ఆల్రెడీ మనం గాయత్రీ పాప మీద లలిత అక్క రక్తం మరకలు ఉన్న గుడ్డ పడిలా ఉంచాం. ఇప్పుడు ఈ మూలికను ఈ పల్లెంలో పెడతాను.
వల్లభ: మమ్మీ పాము ఎక్కడ ఉందో జాగ్రత్తగా చూద్దాం. 


ఇంతలో పాము అక్కడికి వస్తుంది. మూలిక వాసన చూసి ఆ పల్లెంలోనే చుట్టుకొని పాము మూర్ఛపోతుంది. దీంతో ఆ పల్లెంలోని పాము మీద తిలోత్తమ బియ్యం వేసేస్తుంది.


తిలోత్తమ: రేయ్ నా ప్లాన్ ఏంటి అంటే ఈ బియ్యం పల్లెన్ని నామకరణం దగ్గరకు తీసుకెళ్దాం. లలిత అక్క చేతనే గాయత్రీ దేవి అన్న చెల్లెలి పేరును బియ్యంలో తన వేలు పెట్టిస్తాం. అప్పుడు పాము లేచి బియ్యంలో వేలు పెట్టగానే పాము కాటేస్తుంది. గాయత్రీ అక్క పేరును అనాథ పిల్లకు పెట్టబోయి ప్రాణాలు పోగొట్టుకుంది అని కాసేపు ఏడుస్తానురా.. సరే పద ఏం తెలీనట్లు వాళ్లలో కలిసిపోదాం. 


నామకరణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇక సుమన వచ్చి అనాథ పిల్ల తన తాతకు సొంత ఇళ్లు కూడా లేదని అలాంటి ఈ పాప పట్టపురాణి చేస్తున్నారు అని తన అక్కసు చూపిస్తుంది.


సుమన: ఇది వరకు పేరు పెట్టిన పిల్లకు మళ్లీ పేరు పెట్టడానికి ఎలాంటి పద్ధతి వాడాలో తెలుసా అక్క.
విశాల్: నీకు తెలిస్తే చెప్పు సుమన.
హాసిని: తెలీదు కానీ తెలుసుకోవాలి అని ఉంది అనుకుంటా.
లలితాదేవి: పద్యం చెప్పి శంకర శాస్త్రి మనవరాలివి కాబట్టి నీకు అర్థమై ఉండాలి. 
వల్లభ: నాకు అర్థం కాలేదు.
విశాల్: వ్యవహార హేతువు అయిన కీర్తి ప్రధానమైన నామకరణ మహోత్సవాన్ని మనసుద్ధితో ఆచరిస్తే చాలు అని అర్థం. 
లలితాదేవి: హాసిని లాయర్‌గారితో రెడీ చేయించిన పేపర్లు తీసుకురా.


లలితాదేవి బొటను వేలికి గాయం కావడం వల్ల ఆస్తి పత్రాల మీద సంతకం చేయలేదు అని పాపం అని సంతకం చేయకపోతే ఆస్తి పంపకం పూర్తి కాదు అని వల్లభ వాళ్లు అంటారు. ఇక హాసిని బియ్యం, పత్రాలు తీసుకొస్తుంది. ఇక నయని పాపను కుర్చీలో కూర్చొపెడుతుంది. లలితాదేవి గాయత్రీ పాప తల మీద కిరీటం పెట్టి పట్టాభిషేకం చేద్దామంటుంది. ఇక సుమమ వెటకారంగా నవ్వుతుంది. ఎందుకు నవ్వావు అని అడిగితే.. ఈ పిల్ల గుడి దగ్గర ఉండుంటే రోజు వాళ్ల తాత చేత శతగోపురం పెట్టించు కొనేదని ఇప్పుడు కిరీటం పెట్టించుకుంటుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: నాగచైతన్య, సమంత: ఒకే ఈవెంట్‌లో మెరిసిన నాగచైతన్య, సమంత - విడాకుల తర్వాత ఇదే ఫస్ట్‌టైం, ఫుల్‌ ఖుష్‌లో ఫ్యాన్స్‌