Naga Panchami Telugu Serial Today Episode: మోక్ష బతికే ఉన్నాడు అని అతన్ని కాపాడటానికి శివుడికి ఓ యాగం చేయాలి అని నాగసాధువు అందరికీ చెప్తారు. ఆయన యాగం చేసే వరకు ఎవరూ కదలకుండా శివయ్యను ధ్యానం చేయమని చెప్తారు. మరోవైపు ఫణేంద్ర, నాగ కన్యలు అక్కడికి వస్తారు. 


ఫణేంద్ర: ఇక్కడికి దగ్గరలో ఒక దేవాలయం ఉంది. అక్కడే మోక్ష వివాహం జరుగుతుంటుంది. దూరం నుంచి గమనిస్తూ అదును చూసి మన యువరాణిని తీసుకెళ్దాం. ఇది పల్లెటూరు మనల్ని ఇలా చూస్తే ఎవరు ఏంటి అని విచారిస్తారు. మనం పాముల రూపంలో వెళ్దాం. 


మరోవైపు మోక్ష తల్లిదండ్రులు, మిగతా వాళ్లు పెద్ద ఎత్తున ఓం నమః శివాయ అని అంటుంటారు. ఇక పంచమి శివయ్యకు పూలతో పూజ చేస్తుంది. ఇక నాగేశ్వరి అక్కడికి చేరుకుంటుంది. నాగేశ్వరి మహరాణి ఆత్మని ఆహ్వానిస్తుంది. 


నాగేశ్వరి: మహారాణి మీ కూతురు పంచమి తన భర్త మోక్షని కాపాడుకోవడానికి యాగం చేయిస్తుంది. ఏ గుడిలో మీ బిడ్డకు జన్మనిచ్చారో అదే గుడిలో ఆ శివయ్య కళ్ల ముందే మీరు మీ బిడ్డకు బిడ్డగా పుట్టే అవకాశం కలగబోతుంది. అంతా శివయ్య మహిమ. 
మహారాణి: నా కోరిక తీరింది అంటే నా కన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు నాగేశ్వరి.
నాగేశ్వరి: మీ ఈ కోరిక ఆ శివయ్యే తీరుస్తాడు. నేను మీ ఆత్మను ప్రేరేపిస్తాను.  ఆ శక్తితో గుడి లోపలకి వెళ్లి మీ ఆశను నెరవేర్చమని ఆ శివయ్యను వేడుకోండి. ఆ స్వామి మీకు పంచమి గర్భంలో ప్రవేశించే అదృష్టం కల్పిస్తాడు.
మహారాణి: అలాగే నాగేశ్వరి ఈ అవకాశం కల్పించిన నీకు నేను చాలా రుణపడి ఉంటాను. 
నాగేశ్వరి: మీ కోరిక తీర్చడం నా బాధ్యతగా భావిస్తాను మహారాణి. నేను ధ్యానం చేస్తాను మీరు గుడిలో ప్రవేశించాలి అని కోరుకోండి.


ఫణేంద్ర: గుడి దగ్గరకు చేరుకొని.. ఇక్కడ పెళ్లి అనుకుంటే యాగం చేస్తున్నారు నాకు ఏం అర్థం కావడం లేదు. పెళ్లి కూతురు కనిపించడం లేదు. పెళ్లి కొడుకులా ఉండాల్సిన మోక్ష ప్రాణాలు లేనట్లు పడిపోయి ఉన్నాడు. 


నాగేశ్వరి: పంచమిని చూస్తూ.. చాలా కాలం తర్వాత నాకు మా యువరాణిని దర్శించుకొనే అవకాశం కల్పించాడు ఆ దేవుడు. యువరాణిని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటాను. 


ఫణేంద్ర: నేను అనుకున్నది అంతా తారుమారు అయింది. ఏదో కారణం వల్ల పెళ్లి ఆగిపోయినట్లుంది. మోక్ష ప్రాణాలతో ఉన్నట్లు కనిపించడం లేదు. నేను అనుకున్నదే నిజం అయితే మన యువరాణి నాగలోకాన్ని మోసం చేసింది అని భావించాలి. మనం ముందు వెళ్లి యాగాన్ని ఆపాలి. అందరం కలిసి ఒక్కసారి మీద పడి అందర్ని పారిపోయేలా చేయాలి. పదండి. అంటూ  పాములుగా మారి యాగం దగ్గరకు బయల్దేరుతారు. అయితే నాగేశ్వరి పాము మిగతా పాములను బెదిరించి పారిపోయేలా చేస్తుంది. 


ఫణేంద్ర: మన ఇష్ట రూప జాతి పాము మన మీద దాడి చేసింది చాలా శక్తి వంతంగా పోరాడింది. నాకు తెలీకుండా యువరాణికి రక్షణగా మరోపాము ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నా. మీరు నాగలోకం వెళ్లిపోండి. ఇక్కడ జరిగిన విషయాలు నాగదేవతకు చెప్పకండి. నేను అన్ని విషయాలు తెలుసుకొని మీకు కబురు పెడతాను. అప్పుడు యువరాణిని తీసుకెళ్దాం. 


మరోవైపు చిత్ర సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. ఇక జ్వాల స్వీట్స్ పట్టుకొని వచ్చి చిత్రకు తినిపిస్తుంది. అయితే చిత్ర జ్వాల ఏమైనా కలిపి ఉంటుంది అనుకొని తినకుండా తప్పించుకుంటుంది. ఇక జ్వాల నమ్మకం  లేదా అని తినిపిస్తుంది. ఇద్దరూ తోటికోడళ్లు కలిసి ఆస్తి మొత్తం తమదే అని  సంతోషంతో గెంతులేస్తారు. 


ఇక కరాళి తన దివ్య దృష్టితో యాగం అవ్వడం చూసి శక్తిని పంపించి యాగం ఆపేయమని చెప్తుంది. కరాళి పంపించిన ఆ శక్తి సమీపంలో ఉన్న తేనెటీగ పట్టును కదిపి తేనెటీగలు యాగం జరిగే చోటుకు వెళ్లేలా చేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. 


పంచమి: శివయ్య ఈ యాగం ఆగకుండా చూడు స్వామి. నా భర్తను మీరే కాపాడాలి. మరోవైపు తేనె టీగలు అందర్ని పొడిచేస్తుంటాయి. ఆడవాళ్లు చీరలు కప్పుకుంటారు. పంచమి.. సుబ్రహ్మణ్యేశ్వర కాపాడు స్వామి. అని పంచమి వేడుకోగానే తేనెటీగలు అన్ని ఒక్కసారి మాయమైపోతాయి. నా భర్తను కాపాడు స్వామి అని పంచమి వేడుకుంటుంది. ఇక కరాళి అది చూసి షాక్ అవుతుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: పూనమ్ కౌర్ : 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్లేజ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్ - పవన్‌ను పక్కన పెట్టి అతనిపై పొగడ్తలు!