Trinayani Today Episode సుమన తన అక్క నయని, విశాల్‌తో గొడవ పెట్టుకుంటుంది. గానవి పాపని అయినా లేదంటే తన కూతురు ఉలూచిని అయినా ఆస్తికి వారసురాలిని చేయాలి అని అంతే కాని అనాథ అయిన గాయత్రీ పాపకి పట్టం కడితాను అంటే ఒప్పుకోం అని అంటుంది. 


నయని: ఇదే మాటని పెద్దమ్మ గారి ముందు చెప్తావా.. 
సుమన: పిన్ని అడిగిన మాటని నేను అడిగితే తప్పా.
దురంధర: నా సంగతి వదిలేవే తల్లి నన్ను ఈ గొడవలోకి లాగకు..  
సుమన: భయపడతారు ఎందుకు పిన్ని నా మాటకు వస్తాసు పలకండి చాలు.
హాసిని: ఎవరూ పలకరు. 
తిలోత్తమ: సుమనకు సపోర్ట్‌గా మేం ఉంటాం. 
విక్రాంత్: ఉండి ఏం చేస్తారు. 
హాసిని: గాయత్రీ పాపే ఈ యావత్ ఆస్తికి వారసురాలు ఇది ఫిక్స్. 
సుమన: ఎందుకు అలా తనేమైనా పైనుంచి దిగొచ్చిందా..
హాసిని: రాలేదు.. గాయత్రీ అత్తయ్య గానే వచ్చింది. 
తిలోత్తమ: పేరు ఉన్నంత మాత్రాన సరిపోదు.
హాసిని: అర్హత ఉంది.
సుమన: హక్కు ఉండాలి.
హాసిని: గాయత్రీ పాపే గాయత్రీ అత్తయ్య ఇంకే ఉండాలి.  అందరూ షాక్ అయిపోతారు.
విశాల్: కోపంగా.. వదినా... 
తిలోత్తమ: ఈ పిల్ల గాయత్రీ అక్కయ్యా..
హాసిని: అని లలితా అత్తయ్యే డిసైడ్ చేశాక దాన్ని మనం తూచా పాటించాలి. గాయత్రీ పాప పేరు చివరన దేవి అనే పేరు చేరితే ఆ క్షణం నుంచి ఈ పాపే గాయత్రీ అత్తయ్య ఇదే ఫైనల్.. ఫిక్స్. 
దురంధర: రేపు ఎప్పుడైనా పునర్జన్మ ఎత్తిన గాయత్రీ అత్తయ్య ఇంటికి వస్తే.
హాసిని: రాదు. 
నయని: అదేంటి అక్క అలా అంటావ్.
సుమన: నాకు అర్థమైంది ఈ పిల్లతోనే సర్దుకుపోతే చాలా వరకు కలిసి వస్తుందని మీ ఆలోచన.
విశాల్: అలా కాదు సుమన జనాలకు తెలిసేలా మా అమ్మ రాదు అని వదిన అభిప్రాయం. 
వల్లభ: చాలా నాటకాలు ఉన్నాయిరా ముగ్గురు ఒకటే మమల్ని బకరాలను చేయాలి అని అనుకుంటున్నారు. కదా..
డమ్మక్క: చాలా బాగుంది ఈ నామకరణం రణరంగం అయ్యేలా ఉంది.
నయని: రక్తపాతం అవ్వకుండా చూడాలి. మళ్లీ అందరూ షాక్ అవుతారు. 
విక్రాంత్: ఒకర్ని ఒకరు చంపుకుంటారా ఏంటి వదిన వీళ్ల మాటల్ని తేలికగా తీసుకోండి. 
నయని: మనసులో.. జరిగేది వేరు విక్రాంత్ బాబు పెద్దమ్మ గారి చేతులు రక్తపాతం అవ్వబోతున్నాయి. 


ఇక విక్రాంత్ తన గదికి వచ్చి సుమనను చేతగాని దానివి అంటాడు. కోపంతో సుమన మీరే చేతకాని వాడివి అంటుంది. నాకు ఏం చేతకాదో చెప్పు అని అంటాడు. దీంతో సుమన తనని చేతనైతే నన్ను తల్లిని చేయు అని అంటుంది. 


సుమన: మీరు అన్నట్లు నేను అనొచ్చా చేతకాని వాడిలా అలా చూస్తున్నారు.
విక్రాంత్: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. 
సుమన: మీరే అన్నారు కదా చేతనైన పని అయితే చేస్తాను అని. నేను అమ్మా అని పిలుపించుకునే పని మీరు చేయగలరో లేదో చెప్పండి. అది కూడా మీకు చేతనైతే.. దీంతో విక్రాంత్ సమన గొంతు పట్టుకుంటాడు. గొంతు కాదు భార్యని ఎక్కడ ఎలా పట్టుకోవాలో నేర్చుకోండి. 
విక్రాంత్: ఛీ.. నువ్వు అసలు ఆడదానివి కాదే..
సుమన: దయచేసి మీలా నన్ను మాట్లాడేలా చేయకండి. మీ పరువే పోతుంది.
విక్రాంత్: అనుకోవే నీతో కాపురం చేయను నాకు చేతకాదు అనుకో ఏం పర్లేదు.
సుమన: ఇలా చేతులు ఎత్తేస్తారు లేదంటే చేయి చేసుకుంటారు. అంతే కదా మీకు వచ్చింది.
విక్రాంత్: ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటో చెప్పు.
సుమన: హాల్‌లో అన్నారు కదా వీలైతే నువ్వు కూడా ఇంకో బిడ్డను కని ఆస్తిలో వాటా పంచుకో అని వీలు ఉంది కానీ మా ఆయనకే దమ్ములేదు. ఇంట్లో వాళ్ల దగ్గర నేను అంటే ఇష్టం లేదు అని చెప్తారు కానీ బయట వాళ్ల దగ్గర ఏ ఒక్కరి దగ్గర అయినా మా ఆవిడ గదిలో నేను బాల్కానీలో పడుకుంటాను అని చెప్తారా.. చెప్పలేరు చెప్పరు. ఎందుకు అంటే పరువు పోతుంది. ఇంకా చెప్పాలి అంటే మీ ఆవిడ నెంబరు ఇవ్వు ఓదార్చుతాం అంటారు అనా..
విక్రాంత్: చెవులు మూసుకొని అబ్బా.. ప్లీజ్ నువ్వు మాట్లాడితే కంపరంగా ఉంది సుమన వెళ్లిపో.. మనిషి మాటలతోనే చనిపోతాడు అని తెలుస్తుందే నీ మాటలు వింటుంటే..
సుమన: ఇంకా పచ్చిగా చెప్పొచ్చు వినడానికే ఇబ్బంది పడుతున్న మీరు అర్థం చేసుకుంటే ఏమైపోతారా అని ఆగిపోతున్నా. నాకు ఎలాగూ మొగుడు లేడు అని చెప్పను కానీ సుఖం అయితే లేదు. జీవితాంతం లేకపోయినా పర్లేదు కానీ ఒక్కసారి బిడ్డను కంటే చచ్చేదాకా కోటీశ్వరురాలిగా బతకొచ్చు అనేది నా ఆశ.  
విక్రాంత్: నువ్వు ఇన్ని చెప్పావు కదా నేను ఒకటి చెప్తా విను. నీ కోరిక తీర్చడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే భార్యగా నీకు హక్కు ఉండొచ్చు కానీ ఇంటి పరువు తీసే నీ లాంటి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. 


ఉదయం తిలోత్తమ, సుమన, వల్లభలు హాల్‌లో మాట్లాడుకుంటారు. తిలోత్తమ చాకు తీసుకొని వచ్చి సోఫా కింద పడేసి దీంతో లలిత అక్కయ్య బొటను వేలు కోయాలి అని అంటుంది. సుమన షాక్ అవుతుంది. ఇక సుమనను కాకాపట్టడానికి పూజల దండ ఇస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు చేస్తే డైమండ్ నక్లెస్ ఇస్తాను అని తిలోత్తమ సుమనకు చెప్తుంది. ఇక వల్లభ ఆ గొలుసును కొస్తాడు. 


తిలోత్తమ: ఆపిల్ కోసుకురావడానికి కత్తి తీసుకొని రమ్మని తింగరి హాసినిని కిచెన్‌కు పంపిస్తాను. అది కత్తి తెస్తున్నప్పుడు నీ మెడలో ఉండే పూజల దండ తెగడం. ఆ పూజల మీద లలిత అక్క కాలు వేసి జారి పడటం పడతున్నప్పుడు హాసిని చేతిలోని కత్తితో లలితా అక్క వేలు తెగేలా మేం చేస్తాం. 
సుమన: దీని వల్ల ఎవరికి ఉపయోగం. 
తిలోత్తమ: దీని వల్ల నీకే ఎక్కువ లాభం. అనాథ పిల్ల గాయత్రీ పేరు మీద అన్ని కోట్ల ఆస్తిని రాసివ్వకుండా ప్రోగ్రాం వాయిదా పడితే ఉలూచికి సగం అయినా ఇవ్వండి అని డిమాండ్ చేయొచ్చు కదా..
సుమన: అర్థమైంది నేను రెడీ.. 


లలితాదేవి: నయని వాళ్లతో కలిసి వస్తూ.. గాయత్రీ పాపకు గాయత్రీ దేవి అని నామకరణం చేయడం వల్ల మనకే లాభం విక్రాంత్.
విక్రాంత్: అదెలాగో చెప్తారా పెద్దమ్మ.
లలితాదేవి: మా చెల్లి పునర్జన్మ ఎత్తి మా కళ్లు ముందే ఉందని జోరుగా ప్రాచారం చేస్తాం. షేర్ హోల్డర్స్ అందరిలో కొత్త ఉత్సాహం వచ్చి కంపెనీ వ్యాల్యూ రెండింతలు అవుతుంది. 
నయని: అదే జరిగితే కేవలం గాయత్రీ అమ్మగారి ఇమేజ్‌తోనే వందల కోట్లు కలిసి వచ్చినట్లు. 
లలితాదేవి: నా చెల్లిలి బ్రాండ్ ఇమేజ్‌ను నీ చెల్లి సుమన పెంచింది అనుకుంటాం.
సుమన: మీరు ఇలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లేదంటే అందరూ నన్ను తలో మాట అనేవారు. 


ఇక హాసినికి తిలోత్తమ లలితాదేవి కోసం ఆపిల్ తెమ్మంటుంది. హాసిని వెళ్తుంటే నయని ఆపి నేను తెస్తా అంటుంది. ఇక లలితాదేవి ఇప్పుడు ఏం వద్దు అంటుంది. అయితే విశాల్ తీసుకురమ్మని అంటాడు. హాసిని వెళ్తుంటే నయని ఆపి తానే వెళ్తుంది. నయని చాకు పట్టుకొని తనకు కనిపించి కలను చూసి భయపడి చాకు తీసుకెళ్లాలా వద్దా అని అనుకుంటుంది. తన చేతిలోనే ఆ కత్తి ఉండాలి అని ఎవరికీ ఇవ్వకూడదు అని అనుకొని వెళ్తుంది. 


ఇక పథకం ప్రకారం సుమన తన మెడలోని పూజల దండ తెగేలా చేస్తుంది. ఇంతలో అనుకోకుండా లలితాదేవి జారి పడుతుంది. నయని చేతిలోని చాకును లలితాదేవి పట్టేయడంతో బొటను వేలు తెగుతుంది. ఇక వల్లభ తన రుమాలతో లలితాదేవి చేతిని చుడతాడు. అఖండ స్వామి రక్తపు మరకలతో గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటా అని చెప్పడంతో వల్లభ ఇలా చేస్తాడు. ఇక నయని లలితాదేవికి క్షమాపణలు చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: నాగ చైతన్య : మార్చి 19న సూపర్ న్యూస్- నాగ చైతన్య సర్ ప్రైజ్ దాని గురించేనా?