Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన అనామిక ఫ్రెండ్స్‌ కు ఇంట్లో వాళ్లను పరిచయం చేస్తుంది. అపర్ణ ఈ ఇంటికి పెద్ద కోడలు అని ఈ ఇంటి యజమానురాలు అని కావ్య చెప్తుంది. అయితే కావ్యను నువ్వెవరు అని అడగడంతో అప్పుడే అక్కడకు వచ్చిన రుద్రాణి. ఇన్ని రోజులు మేము ఈమె (అపర్ణను చూపిస్తూ) చెప్తే వినేవాళ్లం. ఇప్పుడు ఈమె   (కావ్యను చూపిస్తుంది) చెప్తే వింటున్నాం అని వెటకారంగా చెప్తుంది. దీంతో ఇంత వెటకారంగా మాట్లాడుతున్నారంటే మీరు ఈ ఇంటి ఆడపడుచు కదా అంటారు ఫ్రెండ్స్‌.


కావ్య: కరెక్టుగా చెప్పారు.


అనామిక: ఆంటీ ఈ కావ్య నా పరువు తీసేలా ఉంది. ఏదైనా ఒకటి చేయండి.


ధాన్యలక్ష్మీ: ఇలానే మాట్లాడుతూ ఉంటావా? వచ్చిన వాళ్లకి కాఫీ టీలు ఏమైనా ఇచ్చేది ఉందా?


అనగానే కావ్య కాఫీ తీసుకొస్తుంది. అందరూ కాఫీ తాగుతుంటే ఇంతలో కళ్యాణ్‌ అక్కడికి వస్తాడు. దీంతో ఫ్రెండ్స్‌ అందరూ మీరు చాలా గొప్పవారు ఆఫీసు చూస్తూనే వైఫ్‌కు ఇంత టైమ్‌ ఇచ్చారంటే మీరు చాలా గ్రేట్‌ అంటారు. దీంతో నేను ఏ ఆఫీసు చూసుకోవడం లేదని కళ్యాణ్ నిజం చెప్పడంతో అనామిక షాక్‌ అవుతుంది. ఫ్రెండ్స్‌ చూస్తుండిపోతారు. తర్వాత ఫ్రెండ్స్ ‌అనామికను లేనిపోని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అంటూ కళ్యాణ్‌ లాంటి గొప్ప వ్యక్తి దొరకడం నీ అదృష్టం అంటూ అనామికకు బ్రెయిన్‌ వాష్‌ చేసి వెళ్లిపోతారు. తర్వాత కళ్యాణ్‌ దగ్గరకు వచ్చిన అనామిక, ధాన్యలక్ష్మీ కోప్పడి.. తిట్టి వెళ్లిపోతారు. మరోవైపు అందరూ హాల్ ల కూర్చుని ఉండగా రాజ్‌ వస్తాడు. దీంతో ఇందిరాదేవి రాజ్‌ కావ్యల పెళ్లిరోజు రేపే అని గుర్తు చేస్తుంది. సుభాష్‌, ఇందిరాదేవి పార్టీ చేద్దామంటారు.


రాజ్: మీరుందరూ నచ్చనట్టు ఏర్పాట్లు చేసుకోండి నేను ఏం అభ్యంతరం చెప్పను. కానీ నేను కూడా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.


ఇందిరాదేవి: ఎంట్రా  అది


రాజ్‌: నా జీవితానికి సంబంధించిన విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. అదేంటనేది మీ అందరి సమక్షంలోనే బయట పెడదామనుకుంటున్నాను.


రుద్రాణి: అందరికీ తెలియని విషయం ఏముంటుందిరా? కొత్తగా చెప్పడానికి ఏముంది ఇక.


రాజ్‌: అది నా జీవితానికి సంబంధించిన విషయంలో నేను తీసుకోబోయే ముఖ్యమైన విషయం. అంతకుమించి ఇప్పుడేం చెప్పలేను. ఎవరు ఆమోదించిన ఆమోదించకపోయినా నా నిర్ణయం మాత్రం మారదు.


రుద్రాణి: అది రేపే ఎందుకు చెప్పాలి. రేపు ఇదే జనం. ఇవాళ ఇదే జనం


రాజ్‌: నేను చెప్పబోయే విషయం అందరికీ ఒకేసారి తెలియాలి. అందుకే కావ్య తల్లిదండ్రులు కూడా రేపు పార్టీలో తప్పకుండా ఉండాలి.


అని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. అందరూ ఆలోచనలో పడిపోతారు. ముఖ్యమైన విషయం అంటే విడాకుల విషయమేనా అందుకేనా మా అమ్మానాన్నలు ఉండాలంటున్నాడా? అని కావ్య మనసులో అనుకుంటుంది. పైకి వెళ్లిన కావ్య నిద్రపోతున్న రాజ్‌ ను చూసి నిజంగానే పడుకున్నాడా? లేక నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడా? తెలుసుకుందాం అని నెమలిపించంతో రాజ్‌ను నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది కావ్య.  


రాజ్‌: ఏం కావాలి?


కావ్య: నిద్రపోతున్నారా? లేదా తెలుసుకుందామని..


అనగానే రాజ్‌ కోపంగా కావ్యను తిడుతూ పడుకో అనగానే కావ్య చిరాగ్గా పడుకుంటుంది. ఇంతలో రాజ్ ఆత్మ వస్తుంది. అసలు కళావతి విషయంలో నువ్వు ఏం అనుకుంటున్నావో చెప్పు అనగానే అందరితో పాటే నువ్వు కూడా రేపే తెలుసుకో అంటూ గుడ్ నైట్‌ చెప్పి పడుకుంటాడు రాజ్‌. ఆత్మ వెళ్లిపోతుంది. మరుసటి రోజు కావ్య కిచెన్‌లో ఉండగా ఇందిరాదేవి వచ్చి మ్యారేజ్‌ డే విషెష్‌ చెపి తర్వాత తిడుతుంది. తర్వాత కావ్య, రాజ్‌తో మాంగళ్య వ్రతం చేయించాలని నిర్ణయించుకున్నట్లు ఇందిరాదేవి చెప్తుంది. దీంతో అందరి మధ్య గొడవ మొదలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: అతిపెద్ద అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది - ‘సిటాడెల్’పై అప్డేట్ ఇచ్చిన వరుణ్ ధావన్