Trinayani Today Episode : ఇంట్లో ఉన్నది ఉలూచి కాదు అని సుమన తెలుసుకొని నిలదీయడంతో అమావాస్యకు ఉలూచిని తీసుకొచ్చే బాధ్యత నాది అని గురువుగారు అంటారు. ఇక అందరూ తిలోత్తమ గురించి అడుగుతారు. గురువుగారు మౌనంగా ఉంటారు. హాసిని అయితే అత్తయ్య అనంత వాయువుల్లో కలిసిపోయిందా అని అంటుంది.


గురువుగారు: లేదు తిలోత్తమ బతికే ఉంది.


సుమన: మరి ఈ విషయం చెప్పడానికి ఎందుకు అంత ఆలోచించారు స్వామి.


గురువుగారు: ఎందుకంటే విశాలాక్షి చెప్పిన మాట నిజం అవుతుంది కాబట్టి. తన రూపం మారిపోయి ఉంటుంది. 


విక్రాంత్: అమ్మని గుర్తుపట్టలేం అంటారా..


గురువుగారు: అది మీకు పరీక్ష. ఇంట్లో అడుగుపెట్టిన తిలోత్తమను మీరు అహ్వానిస్తే సరే.. అనుమానిస్తే ప్రమాదం. 


నయని: అత్తయ్య ఇంటికి రావాలి.


గురువుగారు: వస్తుంది. 


పెద్దబొట్టమ్మ: సర్ప దీవికి వెళ్లిన వారు తిరిగి వచ్చారు అంటే విచిత్రం అవుతుంది గురువుగారు.


విక్రాంత్: గాయత్రీ ఎలా వెళ్లిందో అలాగే వచ్చింది. ఉలూచి కూడా మారదు అంటున్నారు.


వల్లభ: మరి మా అమ్మ ఎందుకు మారుతుంది గురువుగారు.


గురువుగారు: మార్చబడుతుంది. అందుకు కారకులు ఎవరో తెలుసుకుంటే తప్ప కారణం తెలీదు వల్లభ. 


నయని: పెద్ద బొట్టమ్మ గుర్తు పట్టగలదా..


పెద్దబొట్టమ్మ: సర్ప జాతిని అయితే గుర్తు పట్టగలను.


విశాల్: స్వామి మరి అమ్మని గుర్తుపట్టేది ఎవరు.


గురువుగారు: గాయత్రీ దేవి.. అమావాస్య రోజు ఉలూచి రావడం తిలోత్తమ మళ్లీ కనిపించడం ఊహించని పరిణామాలు జరగడం.. గాయత్రీ దేవి పునర్జన్మ ఉనికి మీకు తెలీడం.. ఎన్నో విషయాలు ఆ రోజు బట్ట బయలు అవుతాయి. పసిబిడ్డను తల్లి దగ్గరకు చేర్చుతాను. నయని  ఆ పాపని తీసుకొని రా. 
 
హాసిని బాధ పడుతుంటే.. నిన్ను ఎవరు ఏమన్నా నేను ఒప్పుకోను వదినా అని విశాల్ అంటాడు. ఇక నయని వచ్చి నువ్వు అంటే బాబుగారికి అంత అభిమానం అక్క అని అంటుంది. మరోవైపు గురువుగారు ధ్యానం చేస్తుంటారు. అక్కడికి పెద్దబొట్టమ్మ వెళ్తుంది. తిలోత్తమ రాకూడదు స్వామి అని తనో దుష్టశక్తి అని తన గుండె దడ పుడుతుందని అంటుంది.  


గురువుగారు: నాగులమ్మ నీ అనుమానం నిజమే. సర్పదీవికి వెళ్లిన తిలోత్తమ అపారమైన శక్తులను మూట కట్టుకొని రాబోతుంది. 


పెద్దబొట్టమ్మ: అనుకున్నాను స్వామి ఏదో అపాయం రాబోతుంది అని. 


గురువుగారు: తిలోత్తమ మరణ గండం తప్పించుకొని వస్తే నయని, విశాల్, గాయత్రీలకు మృత్యు గండం మొదలైనట్లే. 



ఇంట్లో అందరూ ఉలూచి, తిలోత్తమల రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఇక బయట కారు హారన్ వినిపిస్తే అందరూ బయటకు వెళ్లి చూద్దామని అనుకుంటారు. బయట మూడు కారులు ఉంటాయి. అమ్మ ఒక్కదాన్ని తీసుకు రావడానికి ఇన్ని కార్లు ఎందుకు అని అనుకుంటారు. ఎవరైనా వీఐపీ అయింటారు అని అనుకుంటారు. రెండు కార్లలో ఇద్దరు పీఏలు దిగుతారు. తర్వాత మొదటి కారులో డ్రైవర్ దిగి డోర్ ఓపెన్ చేయగానే రూపం మారిన తిలోత్తమ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. కళ్లద్దాలు.. చేతికి గ్లౌజ్ దాని మీద వాచ్.. చాలా రిచ్‌గా మోడ్రన్‌గా ఉంటుంది. అందరూ ఆమెని చూసి షాక్ అయిపోతారు. కొత్త తిలోత్తమ నేరుగా వచ్చి విశాల్ ఎదురుగా నిల్చొని విశాల్‌ని తాకగానే విశాల్ అమ్మ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఓరి దేవుడా ఇదేం ట్విస్ట్‌రా.. ముకుంద దగ్గర మురారి, పరిస్థితి మరీ ఇంత దారుణమా!