Trinayani Today Episode నయని, హాసిని మాట్లాడుకున్న వీడియోని సుమన చూస్తుంటుంది. విక్రాంత్ వచ్చి ఏం చూస్తున్నావ్ అని అడుగుతాడు. సుమన ఏం సినిమా అని కవర్ చేస్తుంది. విక్రాంత్ నయని వదిన, హాసిని వదినలు మాట్లాడుతున్నట్లుందని ఫోన్ ఇవ్వమని సుమనని అడుగుతాడు. ఫోన్ లాక్కునే టైంలో తిలోత్తమ, వల్లభ వస్తారు. తిలోత్తమ ఫోన్ ఇవ్వు తీసుకొని నయని, హాసినిలు గాయత్రీదేవి గురించి మాట్లాడుకోవడం వింటుంది. 


విక్రాంత్: పెద్దమ్మ వచ్చిందని నీకు కూడా తెలుసు కదామ్మ. మరి నువ్వెందుకు మ్యానేజ్ చేశావ్.
వల్లభ: మమ్మీకి ఆత్మ కనిపించదు కదరా.
తిలోత్తమ: కనిపిస్తుంది. ఆత్మని చూడాలి అంటే అక్కడ ఉండాలి. గాజు వస్తువు ఉన్నా సరే నేను చూడగలను.
సుమన: ఇది ఎప్పటి నుంచి అత్తయ్య.
వల్లభ: సర్పదీవికి వెళ్లి వచ్చిన తర్వాత మా అమ్మకు వచ్చిన శక్తులు అన్నీఇన్నీ కావు సుమన.
హర్ష: నయని ఇంటికి వచ్చి.. అక్క నిన్ను వెంటనే కలిసి విషయం చెప్పాలి అనిపించింది. మంత్రాలక్క వచ్చిందక్క. బయట కారులో ఉన్నారు.
నయని: గంటలమ్మా.. మళ్లీ ఎందుకు వచ్చింది.
హర్ష: ఆ మంత్రాలమ్మ వచ్చేదే ఆత్మని పట్టుకోవడానికి అక్క. 
సుమన: ఈ ఇంట్లో ఉన్న ఆత్మను పట్టి బంధించడానికి ఈ సారి గట్టిగానే నిర్ణయించుకొని వచ్చింది గంటలమ్మ.
విశాల్: అయ్యో గాయత్రీ పాప ఎక్కడుందో ఏంటో గదిలో పెట్టి గడియా పెట్టినా బాగున్ను. వెళ్దామంటే ఈ లోపు వీళ్లే వచ్చేలా ఉన్నారే.
నయని: గాయత్రీ అమ్మగారి ఆత్మ పట్టి బంధించాలి అని ఎందుకు ఈ విశ్వప్రయత్నాలు.
తిలోత్తమ: ఆత్మలకు విమోచనం కలిగించకపోతే భూమ్మీదే నరకం అనుభవిస్తాయంట. 
విశాల్: అమ్మ మా అమ్మ బతికున్నప్పుడే స్వర్గం అనుభవించింది అలాంటిది చనిపోయిన తర్వాత ఎందుకు నరకం అనుభవిస్తుంది.
గంటలమ్మ: ఆత్మగా మిగిలిపోవడం అంటే నరకమే కదా. 
హర్ష: గంటలమ్మ వారికి నేను ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే నన్ను పట్టుకెళ్లిపోతారేమో.
నయని: నా బిడ్డగా పుట్టిన తర్వాత ఆత్మ గురించి అనవసరం.
సుమన: మా అక్క బిడ్డను కని ఏడాదిన్నర అయింది. అయినా బిడ్డ రాకుండా ఆత్మ వస్తుంది అంటే ఆ బిడ్డ సజీవంగా లేదు అని ఒప్పుకోవాలి కదా.
విశాల్: ఒప్పుకోం. 
సుమన: ఏదో ఒకటి తేల్చుకుంటే తప్ప ఈ ఎదురు చూపులకు నీరీక్షణ తప్పదు.
గంటలమ్మ: ఆత్మ ఇక్కడే ఉంది.
విశాల్: చూడండి మీకు డబ్బులు కావాలి అంటే చెప్పండి అంతే కానీ ఇలా ఇంటికి వచ్చి భయానికి గురిచేస్తే బాగోదు.
గంటలమ్మ: నాకు ఆస్తులు ఇచ్చినా తీసుకోను. ఆత్మనే తీసుకెళ్తాను.
నయని: తీసుకెళ్లు. ఆత్మలు అంటే వీళ్లకి అంగడిలో సరుకులా అనిపిస్తుందేమో. చూడండి మిమల్ని చూడగానే వణికి పోవడానికి గాయత్రీ అమ్మ చిన్నపిల్ల కాదు. ఆ తల్లి జోలికి వెళ్తే మీకే నష్టం. అమ్మవారు నా దృష్టిలో మరో అమ్మవారు.
తిలోత్తమ: అక్క ఆత్మకి శాంతి కలగాలి అంటే విముక్తి కలగాలి.
గంటలమ్మ: గంటలమ్మనే అనుమానిస్తున్నారు. ఆత్మని చూపిస్తే అప్పుడు నమ్ముతారు కదా. 


గంటలమ్మ తమలపాకు చేతిలో పెట్టి మంత్రాలు చదువుతుంది. ఆకు కింద పెట్టగానే ఆకు నేలమీద పాకుతూ వెళ్తుంది. ఇంతలో గాయత్రీ పాప చున్నీ ఆకు మీద పడుతుంది. ఇంతలో గాయత్రీ పాప కిందకి వస్తుంటుంది. ఆకు మీద ఉన్న చున్నీని గంటలమ్మ తీయడానికి వెళ్తే దాని మీద గాయత్రీ పాప కాలు పెడుతుంది. గంటలమ్మ చున్నీ లాగలేకపోతుంది. ఏమైందని పైకి చూసి గాయత్రీ పాపని చూసి షాక్ అయిపోతుంది. నయని వచ్చి పాపని తీసుకుంటుంది. 


విక్రాంత్: గంటలమ్మ గంటలకు సౌండ్ రాలేదు అనుకుంటా.
సుమన: ఏంటి ఆ.. ఆ .. అంటుంది.
 



గంటలమ్మ గాయత్రీ పాప గురించి చెప్పబోతే అద్దంలో తిలోత్తమ హర్షని చూసి ఆత్మ అని అరుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'గుప్పెడంతమనసు' లో ఉన్న ఈ గోదారి పిల్ల మనుని మహా ఇబ్బంది పెట్టేస్తోంది!