Trinayani Today Episode సుమన విశాలాక్షి కాళ్ల మీద పడటంతో విశాలాక్షి తిలోత్తమ చేతికి ఉన్న గ్లౌజ్‌ని గండర ఖడ్గంతో తెంచేస్తుంది. దాంతో తిలోత్తమలో ప్రవేశించిన ఆత్మ బయటకు వెళ్లిపోతుంది. అందరూ బిత్తరపోతారు. డమ్మక్క విశాలాక్షి అమ్మవారిని చూసి ఓం శాంతి అని అంటుంది. ఇక తిలోత్తమ తనలోని ఆత్మ వెళ్లిపోవడంతో నార్మల్ అవుతుంది.


తిలోత్తమ: విశాలాక్షి ఏం జరిగింది చేతిలో కత్తి పట్టుకొని నిల్చొన్నావు. 
విశాలాక్షి: పుర్రెలదిబ్బలో గాయత్రీ అమ్మ చేతిలో హతమైన రక్తపుంజి ఆత్మకు విముక్తి కలగక ఇక్కడికి వచ్చి నిన్ను ఆవహించింది. 
హాసిని: మీకు దెయ్యం పట్టి అలా ప్రవర్తించావు అత్తయ్య.
తిలోత్తమ: నేనేం చేశాను.
విశాల్: ఇప్పుడు అవన్నీ ఎందుకు మమ్మీ. విశాలాక్షి నీ కాళ్లు చేతులు నరికినందుకే నిన్ను వదిలి ఆ ఆత్మ వెళ్లింది.
విక్రాంత్: సుమన ఇంక లే.
దురంధర: సుమన నీ కాళ్లు మామూలు అయిపోయావే. 


సుమన చాలా సంతోషిస్తుంది. ఇక విశాలాక్షి డమ్మక్కతో పరమేశ్వరుని పూజకు ఏర్పాట్లు చేయమని అంటుంది. విశాల్ విశాలాక్షి రుణం ఈ జన్మలో తీర్చుకోలేమని అంటాడు. ఇక రాత్రి విశాల్, నయనిని మాట్లాడుకుంటారు. చాటుగా విశాల్ వాళ్ల మాటలు వింటుంటాడు. ఇక హాసిని వల్లభ వెనకాలే నిల్చొని సెటైర్లు వేస్తుంది. దాంతో వల్లభ అరుస్తాడు. ఇద్దరూ నయని, విశాల్‌ల దగ్గరకు వెళ్తారు. ఇక హాసిని ఇద్దరూ చాటుగా మాట్లాడుతుంటే ఏం వింటున్నావ్ అని అంటుంది. ఇక వాళ్లు తిలోత్తమ గురించి మాట్లాడితే వల్లభ వాళ్లతో మా అమ్మని ఎలా చంపాలని అంజనం వేస్తున్నారా అని అడుగుతాడు. ఇక విశాల్ వల్లభతో మేం చెప్తుంటే తిలోత్తమ అమ్మ వినడం లేదని నువ్వు అయినా చెప్పు అని అంటాడు. 


సుమన గదిలో కాళ్లకు మసాజ్ చేస్తుంటే విక్రాంత్‌ అక్కడికి వచ్చి విశాలాక్షి నీకు చాలా సాయం చేసింది తనకు రుణపడి ఉండని అంటాడు. సుమన మాత్రం విశాలాక్షికి అంత పవర్ లేదని ఏదో గారడి చేసిందని అంటుంది. విశాలాక్షికి నిజంగానే అంత పవర్ ఉంటే తన కూతురు ఉలూచి పాదాలు మామూలుగా చేసి పాములా మారకుండా చేయమని విక్రాంత్‌తో వాదిస్తుంది. మరోవైపు గంటలమ్మ తిలోత్తమ చేతికి వేపాకులతో రుద్దుతూ మంత్రాలు చెప్తూ అటూ ఇటూ తిప్తుంది. రక్తపుంజి ఆత్మ తనలోకి వచ్చిందని తెలీక పోయిన విశాలాక్షికి ఎలా తెలుస్తుందని అనుకుంటారు. ఇక ఆత్మని పట్టుకోలేకపోయావని తిలోత్తమ గంటలమ్మని ప్రశ్నిస్తుంది. 


ఇక గంటలమ్మ గాయత్రీపాప, ఉలూచిపాప, గానవీపాప, పుండరీనాథం నలుగురి పిల్లలకు తాయత్తులు కట్టమని ఇస్తుంది. ముగ్గురు ఆడపిల్లల్లో ఏ పసిబిడ్డని గాయత్రీదేవి ఆత్మ ప్రవేశిస్తుందని అప్పుడు ఆ తాయత్తు తెగిపోతుందని, ఆ ఆత్మే పునర్జన్మలో గాయత్రీదేవి ఆత్మకు శరీరాన్ని ఇచ్చినది ఎవరో తెలిసిపోతుందని అంటుంది. ఉదయం దురంధర దగ్గరకు పావనామూర్తి తినడానికి ఏమో తీసుకొస్తే సుమన వచ్చి నీ పేరు మీద ఆస్తులు రావడంతో నీ మొగుడు సేవలు చేస్తున్నాడని సెటైర్లు వేస్తుంది. ఇక తిలోత్తమ, వల్లభలు వస్తారు. ఇప్పటికే అక్కడ గాయత్రీ, ఉలూచిలు ఉండగా పుండరీనాథం, గానవీలను తీసుకురమ్మని వల్లభ చెప్తాడు. తిలోత్తమ ఇంట్లో వాళ్లకి ఓ స్వామివారు దర్శనం ఇచ్చి పిల్లలకు తాయత్తులు కట్టమని చెప్పారని చూపిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన సీత.. మహాలక్ష్మికి నెల రోజులు గడువు!