Trinayani Serial Today Episode తిలోత్తమ త్రినేత్రి మేనత్త వైకుంఠంతో గాయత్రీ పాపకి విషం కలిపిన పాలు ఇప్పిస్తుంది. పాప దురంధరతో పాటు హాల్‌లో కూర్చొని ఉంటే వైకుంఠం పాపకి పాలు ఇస్తుంది. పాప పాలు తీసుకోదు. దాంతో హాసిని పాపని ఎత్తుకొని ఎత్తుకొని నాకు నీరసం వచ్చింది నేను తాగుతా అని తీసుకుంటుంది. హాసిని తాగుతుంటే నయని ఆపుతుంది. పాలు తాగొద్దని చెప్తుంది. 


నయని: పాలు తీసుకొచ్చిన వైకుంఠమే ఆ పాలు తాగాలి. 
వల్లభ: మా వైపు చూస్తావేంటి మాకు కొంచెం పోస్తావా ఏంటి.
హాసిని: తాగు వైకుంఠం
నయని: పాలు ఎవరు తాగితే వాళ్లు వైకుంఠానికి పోతారు. 
వైకుంఠం: నా మీద అభాండం వేయాలని చూస్తుంది విక్రాంత్ బాబు మీ వదిన.
బామ్మ: నయని వైకుంఠం చెంప వాయించడంతో.. అదేంటి త్రినేత్రి అలా మీ మేనత్తని కొట్టావ్.
వల్లభ: తను త్రినేత్రి కాదు నయని తను అలా చెప్పేస్తుంది.
బామ్మ: నా మనవరాలు అలా ఎలా చెప్పేస్తుంది.
దురంధర: ఏ వైకుంఠం అందులో ఏం కలిపావు.
హాసిని: ఎవరు ఏం కలపమని చెప్పారో చెప్పు.
వైకుంఠం: హాసిని తోడు కోడలు నయనికి ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే అలా చెప్తుందని చెప్పింది అది నిజమో కాదో తెలుసుకోవడానికి పాలలో ఎలకల మందు కలిపి తీసుకొచ్చా. పాపకి ఇవ్వాలని అనుకున్నా. 
సుమన: మా అమ్మకి కానీ తన పిల్లలకు కానీ ఆపద వస్తే మా అక్క గుర్తు పట్టలేదు. హాసిని అక్క పాలు తీసుకుంది కాబట్టి పిల్ల బతికిపోయింది. 
బామ్మ: నీ ప్రయోగం పాడు కాను చంటి పిల్లకి ఏమైనా అయ్యుంటే నిన్ను ఇక్కడే పాతి పెట్టేవాళ్లు. తను మీ సొంత అక్క నయని ఏనా. 
సుమన: అవును. 
బామ్మ: అమ్మా నయని నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావో తెలీదు కానీ దయచేసి నువ్వు నిజం చెప్పు తల్లీ. విశాల్ బాబుగారి భార్య కోమాలో ఉంది అన్నావ్. నీతో పాటు నేను జాలి పడ్డాను కానీ ఇప్పుడేమో నా కూతురు వైకుంఠం మీదనే నువ్వు చేయి చేసుకున్నావు కొట్టినందుకు తప్పు అనడం లేదమ్మా అది తప్పు చేసినందుకు కొట్టావ్ అప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా మనవరాలు త్రినేత్రివి కాదు ఈ ఇంటి కోడలు నయని అని అర్థమైంది. ఎందుకు అంటే నా మనవరాలు అయితే తన మేనత్తని కొట్టనే కొట్టదు.
నయని: మనసులో తనే మీ మనవరాలికి విషం పెట్టి చంపేసింది అని తెలిస్తే నువ్వు నీ కూతురు అని కూడా చూడకుండా చంపేస్తావ్ బామ్మ.
బామ్మ: కోమాలో ఉన్నది నయని కాదు నా మనవరాలు త్రినేత్రి అని నాకు అర్థమైంది అయ్యా మీకు దండం పెడతాను దయచేసి దాన్ని బతికించండి అయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటాను. నా మనవరాలు కళ్లు తెరవాలి అది ప్రాణాలతో ఉండాలయ్యా


విక్రాంత్ వాళ్లు బామ్మని కూర్చొపెట్టి ఏడుపు ఆపమని చెప్తారు. మా అక్కకి యాక్సిడెంట్ అయితే త్రినేత్రి కోమాలో ఉండటం ఏంటి అని సుమన అంటుంది. లోతుగా ఆలోచించాలని తిలోత్తమ చెప్తుంది. నయని తిలోత్తమ దగ్గరకు వచ్చి పాలలో విషం కలిపింది మీరే అని నాకు తెలుసని చెప్తుంది. మాకు సంబంధం లేదని తిలోత్తమ చెప్తుంది. గాయత్రీ అమ్మ గారిని లేకుండా ఇలా చేయాలని ప్రయత్నించారని నాకు తెలుసు అని నయని అంటుంది. కనిపెట్టేశావ్ కంగ్రాట్స్ అని వల్లభ షేక్ హ్యాండ్ ఇస్తే నయని చేయి నలిపేస్తుంది. వల్లభ విలవిల్లాడిపోతాడు. విక్రాంత్ దగ్గరకు సుమన వెళ్లి వైకుంఠం పాప పాలలో విషం కలిపింది కదా ఏమీ అనడం లేదు ఎందుకని అడుగుతుంది. దాంతో విక్రాంత్ ఆవిడ చేసింది మంచి పనే అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారం బతికే ఉందా.. మరి రాజు తీసుకొచ్చిన శవం ఎవరిది? అసలేంటీ ట్విస్ట్!?