Trinayani Today Episode: పావనామూర్తి గాయత్రీ పాపని హాల్‌లో ఆడిస్తుంటారు. డమ్మక్కని పావనామూర్తి పాట పాడమంటాడు. తాను పాడితే గాడిడలు ఇంటి నుంచి వెళ్లిపోతాయి అని ధురందర అంటే మీరు వెళ్లిపోతారా అని డమ్మక్క సెటైర్ వేస్తుంది. సుమన కలుగజేసుకొని నిన్నే అంటుంది పిన్ని అని చెప్తుంది. ఇక తిలోత్తమ, విశాల్, విక్రాంత్, అందరూ అక్కడికి వస్తారు. 


తిలోత్తమ: నయని, హాసిని దీపాలు పట్టుకొని వచ్చారు ఎందుకు.
నయని: శివజ్యోతిని వెలిగించి తులసి కోట దగ్గర పెట్టమని స్వామి వారు చెప్పారు. 
సుమన: ఇంకెక్కడి స్వామి..
విక్రాంత్: మన గురువుగారే..
సుమన: ఇంట్లోనే చల్లగా ఉంది. బయట గాలి వస్తుంది. బయట దీపం పెడితే ఉంటుందా..
గురువుగారు: సుమన శివజ్యోతి కొండెక్కదు. భక్తితో నువ్వు కొండెక్కినా సరే అది మకర జ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది. మేమం నమ్మము అని సుమన, తిలోత్తమ అంటారు. 
సుమన: గాలిలో దీపం పెట్టుకోవడం కాదు ఆరిపోయేదానికి శివజ్యోతి అని పేరు పెట్టుకోవడం ఎందుకు అంటున్నాను.
 విశాల్: అనవసరమైన వాదన ఎందుకు. ఇక దీపం ఆర్పుతాను అని వల్లభ గట్టిగా నోటితో గాలి ఊదుతాడు అయినా దీపం ఆరిపోదు. ఎంత ట్రై చేసినా దీపం చెక్కు చెదరదు. దీంతో సుమన, తిలోత్తమ, వల్లభలు షాక్ అయిపోతారు.  
సుమన: నేను ఊదుతాను.. సుమన కూడా ట్రై చేసినా దీపం ఏం కాదు. 
తిలోత్తమ: ఉప్ అని ఊదితే ఆరిపోయే దీపాన్ని బయట నుంచి వచ్చే గాలిలో కూడా ఆరకుండా చేస్తున్నారు అంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా నయని. అయితే అసలు గాలే లేకపోతే ఈ శివజ్యోతి వెలుగుతుందా.. ఆరిపోతుందా.. 
విశాల్: అమ్మా గాలిలేకపోతే మనుషులం మనం కూడా ఆరిపోతాం..
తిలోత్తమ: మీ ఆవిడని చెప్పమను నాన్న.
నయని: మీరు ఏం చేసినా సరే వెలుగుతూనే ఉంటుంది అత్తయ్య. ఇక దీపాన్ని కింద పెట్టి దాని మీద బిందె బోర్లా పెడతారు. దాని మీద వల్లభని కూర్చొమంటారు. వల్లభ కూర్చొగానే దీపం వెలుగు వల్లభ నెత్తిమీద వస్తుంది. 
వల్లభ: మమ్మీ ఏమైంది.
తిలోత్తమ: శివజ్యోతి నీ తలమీద వెలుగుతుందిరా.. బింది తీసి చూడగా.. ఇదిలా సాధ్యం.. దీపం వెలుగుతూనే ఉంది. 
వల్లభ: విశాలాక్షి లేకపోయినా గారడి జరిగిందేంటి.. 
తిలోత్తమ: హాసినితో.. తులసి కోట దగ్గర పెట్టిన ఈ శివజ్యోతిని పట్టుకొని తిరుగుతున్నావెందుకు.
హాసిని: ఈ సారి మీ నెత్తిన పెడదామని అత్తయ్య... మీకు ఈ పాటికి వెర్రి అనుమానాలు వచ్చి ఉంటాయని..  
తిలోత్తమ: నోర్మయ్‌వే.. అంటే నన్ను చంపేద్దామని అనుకుంటున్నావా..


మరోవైపు గాయత్రీ పాప ఆడుకుంటుంది. అక్కడికి సుమన గాయత్రీ దేవి చీర పట్టుకొని వచ్చి ఈ అనాథ పాప మీద తిలోత్తమ అత్తయ్య వేద్దామని అనుకుంది. అప్పుడు అయితే హాసిని అక్కమీద అమ్మవారు పూనింది ఇప్పుడు అయితే ఇక్కడ ఎవరూ లేరు. నేను ఈ దత్త పుత్రిక తప్ప అని అనుకుంటుంది. ఇక ఎద్దులయ్య చూస్తాడు. అది చూసి చిట్టిమాత అత్యాశతో నీ కళ్లు మూసుకుపోవడం వల్ల ఇంకెవ్వరినీ చూడలేవు అనుకుంటావనుకుంటా. నువ్వు ఈ చీర గాయత్రీ పాప మీద వేస్తే ఈ పసిబిడ్డే గాయత్రీదేవి అని నీకు తెలుస్తుంది. మరి అలా నీకు తెలియడం మా అమ్మ విశాలాక్షికి ఇష్టం ఉందో లేదో అని అనుకుంటాడు. మరో వైపు సుమన చీర తీసుకొని వెళ్లి గాయత్రీ పాప మీద వేయాలని ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ జనవరి 29th: ఎక్కడో తప్పు జరిగిందంటున్న జెండే, ఒకరిని చూసి ఒకరు షాకైన పద్దు, ఆర్య!