Trinayani Serial Today Episode నయని, విశాల్‌లతో పాటు అందరూ గుడికి చేరుకుంటారు. అందరూ అమ్మవారిని దర్శించుకుంటారు. త్రినేత్రి కూడా వచ్చిందని ప్రదక్షిణలు చేస్తుందని విక్రాంత్ చెప్తాడు. త్రినేత్రి పూజ పూర్తి చేసేసిందని నయని తీర్థం ఇస్తానని చెప్పి గాయత్రీ పాప చేతిలో తీర్థం పెట్టి అందరికీ ఇవ్వమని అంటుంది. నయని పాపని ఎత్తుకుంటే గాయత్రీ పాప అందరికీ తీర్థం ఇస్తుంది. అందరూ పాపని పొగిడేస్తారు.
తిలోత్తమ కూడా తీసుకుంటుంది. పాప తిలోత్తమకు తీర్థం ఇవ్వగానే అమ్మవారి దివ్యదృష్టి ఆ తీర్థం మీద పడుతుంది. తిలోత్తమ తీర్థం తీసుకోగానే చేతులు వణుకుతూ తెలీకుండా ఏడుస్తుంది. గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతుంది. కళ్లు తేలేస్తుంది. గాయత్రీ అక్కయ్య నా ప్రాణం తీసుకుంటుందని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ కింద పడిపోతుంది. వల్లభ దగ్గరకు వెళ్లబోతే దగ్గరకు రాబోతుందని తిలోత్తమ వద్దని చెప్తుంది. తిలోత్తమ విలవిల్లాడిపోతుంది. అందరూ చూస్తూ ఉంటారు. అందరం అదే తీర్థం తాగాం కదా మనకు ఏం కాలేదని బామ్మ అని అంటుంది. దాంతో నయని అత్తమ్మ చనిపోయే సమయం వచ్చేసిందని అంటుంది. మా అమ్మని బలి ఇవ్వడానికి ఇక్కడికి రమ్మన్నారా అత్తయ్య నాటకం ఆడింది కదా అని వల్లభ అంటే దానికి తిలోత్తమ వల్లభతో ఎవరినీ ఏం అనొద్దురా ఇది ఆ తల్లి విశాలాక్షి అమ్మ ఆడించిన నాటకం అని అంటుంది. ఇంట్లో ఉండిపోవాల్సిన నాకు గుడికి రావాలి అని మనసు లాగిందని అదంతా దేవుడి నిర్ణయమే అని అంటుంది. అందరూ తీర్థం తాగినా ఏం కాలేదని తాను తాగగానే ఎడమ చేయి పడిపోయిందని అంటుంది. తిలోత్తమ నోటి నుంచి ముక్కు నుంచి రక్తం వస్తుంది. విశాల్ హాస్పిటల్‌కి తీసుకెళ్తానంటే తిలోత్తమ వద్దని అనేస్తుంది.
అత్తయ్య పరిస్థితి చూసి అలాగే వదిలేస్తారా అని సుమన అడిగితే నా మీద జాలి చూపించొద్దని గాయత్రీ అక్కయ్య లక్ష్మీ పురం వెళ్లినప్పుడు జ్యూస్‌లో విషం కలిపాననని అప్పుడు అక్కయ్య కూడా ఇలాగే ప్రాణం విడిచిందని గుర్తు చేస్తుంది. మీ అమ్మ ప్రాణాలు తీసిన దుర్మార్గురాలిని నేను అని విశాల్‌తో తిలోత్తమ చెప్తుంది. దానికి నయని ఆ విషయం నా భర్తకి ఎప్పుడో తెలుసు అత్తయ్యా కానీ పెంచిన తల్లి మీద ప్రేమ చూపించారని అంటుంది. ఇక తిలోత్తమ తాను చాలా పాపాలు చేశానని పశ్చాత్తాపంతో బతకాలని లేదని ఇప్పుడు చేయి పడిపోయింది రేపు నోరు పడిపోతుందని ఇలా బతకాలి అని లేదని ఏడుస్తూ పాపని చూసి అక్కా గాయత్రీ అక్క నాకు విముక్తి ప్రసాదించు అని అంటుంది. తన చేతికి తాకి అఖండ దీపంలా వెలిగిపోయేలా చేయు అని తన చేతిని ఒక్క సారి తాకమని అంటుంది. దాంతో పాప వెళ్లి తిలోత్తమ చేయి తాకుతుంది.
తిలోత్తమ చేయి తాకగానే పెద్ద మంట వచ్చి తిలోత్తమ కాలిపోతుంది. వల్లభ అమ్మ చేయి కాలిపోతుంది అని ఏడుస్తూ అడ్డుకోవడానికి వెళ్తాడు. వల్లభని విశాల్ ఆపుతాడు. అందరూ చూస్తుండగానే తిలోత్తమ కాలి బూడిద అయిపోతుంది. వల్లభ చాలా ఏడుస్తాడు. బూడిది మిగలగానే దాని దగ్గర కూలబడి చాలా ఏడుస్తాడు. కనుమరుగైపోయిందని పావనా ఏడుస్తాడు. వల్లభ విక్రాంత్ రేయ్ విక్రాంత్ అమ్మ లేదురా అని ఏడుస్తాడు. వల్లభ ఏడ్వడం చూసి కంట నీరు రాక మానదు. ఇక సుమన కూడా అందరికీ క్షమాపణ చెప్తుంది. ఇప్పుడు నాకు బుద్ధొచ్చిందని తన బుద్ధి మార్చుకుంటానని అంటుంది. ఇంతలో త్రినేత్రి అక్కడికి వస్తుంది. అచ్చం నయనిలా ఉండటంతో అందరూ షాక్ అయిపోతారు.
త్రినేత్రి వచ్చి బామ్మని పట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తుంది. నయనిని చూసి త్రినేత్రి నవ్వుకుంటుంది. నయని శరీరానికి త్రినేత్రి ఆత్మ చేరిందని విక్రాంత్ పావనా, దురంధరలతో చెప్తాడు. విశాలాక్షి అమ్మే చిక్కు తీయాలని అంటాడు. ఇక దురంధర కడుపులోకి తిలోత్తమ ఆత్మ చేరుతుంది. తిలోత్తమ పునర్జన్మ ఎత్తడానికి నీ కడుపులోకి చేరిందని నయని అంటుంది. వల్లభ మనసులో ఆడపిల్ల పుడితే మళ్లీ మా అమ్మ పేరు పెట్టి గాయత్రీ పాప అంతు చూస్తానని అనుకుంటాడు. ఇక తారు మారు అయిన త్రినేత్రి త్రినయనిలు అమ్మవారికి మొక్కకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. త్రినయని సీరియల్ కూడా ఈ ఎపిసోడ్తో శుభం కార్డు పడింది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!