Trinayani Today Episode వల్లభ, తిలోత్తమలు గాయత్రీ పాప కోసం వెతుకుతారు. పాపని ఎవరు చూడకుండా అఖండ స్వామి దగ్గరకు తీసుకెళ్లాలి అనుకుంటారు. పాప ఏడ్వకుండా ఉండటానికి మత్తు మూలిక వేరు కూడా తీసుకొస్తారు. అయితే వల్లభ ఆ మత్తు కోసం తెచ్చిన వేరు ఎలా పని చేస్తుందా అని చూడాలి అని ఆ వేరును తన తల్లి ముక్కు దగ్గర పెడతాడు. దీంతో తిలోత్తమ స్పృహా కోల్పోతుంది. హాసిని వచ్చి అత్త చచ్చిపోయింది అని హడావుడి చేస్తుంది. కింద పడుకోపెట్టి ఏడుస్తుంది. ఇక నయని, హాసిని కలిని తిలోత్తమ కాలి చిటికెన వేలు గట్టిగా లాగి స్పృహలోకి వచ్చేలా చేస్తారు. 

హాసిని: బతికి పోయింది.విశాల్: అమ్మా ఇటు చూడు.తిలోత్తమ: ఎక్కడున్నాను నేను..హాసిని: ఊటీలో ఉన్నాను అని ఫీలవుతున్నారేమో.. మొత్తానికి బతికిపోయారు. తిలోత్తమ: వల్లభను గట్టిగా చెంప మీద కొడుతుంది.. విశాల్: అమ్మ నిన్ను కొట్టింది అంటే నీ వల్లే స్పృహా కోల్పోయింది అని అర్థం అన్నయ్య.నయని: బావగారు ఏం చేశారు.వల్లభ: అది ఏం చేశాను అంటే.. అని వేరు తీయబోతుంటేతిలోత్తమ: ఏమీ చేయకుండా సైలెంట్‌గా చూస్తూ కూర్చొన్నందుకే కొట్టాను. ఆరింటి నుంచి ఆకలిగా ఉందిరా అంటే కనీసం పాలు అయినా తెచ్చి ఇవ్వకుండా నేను కళ్లు పడిపోయేంతవరకు చూస్తూ ఉన్నాడు ఈ వేస్ట్ ఫెలో. సుమన: నాకు చెప్పాల్సింది కదా అత్తయ్య.విక్రాంత్: నువ్వు నయని వదినకు చెప్తావ్ అంతే కదా.ధురందర: సర్వీస్ చేయనివాళ్లు చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వకండి. వదినను కాస్త కనిపెట్టుకొని ఉండండి.హాసిని: ఇక నేను కనిపెట్టుకొని ఉంటాను కదా మీ అత్తయ్యని ఎప్పుడు ఎలా ఉంటుందో బాగా చూస్తూ ఉంటాను. తిలోత్తమ: సర్లే. పిల్లలు ఏం చేస్తున్నారు.పావనా: వాళ్లు ఇంకా లేవలేదు అక్క.విశాల్: అమ్మా వాళ్లతో ఆడుకుంటే ఇంకా అలిసిపోతావ్. నువ్వు టిఫెన్ చేసి రెస్ట్ తీసుకో.డమ్మక్క: వాళ్లకి పాలు పట్టడానికి తల్లులు ఉన్నారు. ముందు నువ్వు పాలు తాగమ్మా. హాసిని: నేను వెళ్లి పాలు తీసుకొని వస్తా.. కిచెన్‌లో రెండు ఒకేలాంటి గిన్నెలతో పాలు ఉంటే చూసిన హాసిని ఇలా ఎందుకు ఎవరు ఉంచారు అనుకుంటుంది.తిలోత్తమ: మనసులో.. ఈ హాసిని పాలు తీసుకొని వస్తాను అని వెళ్లింది ఏం పాలు తెస్తుందో ఏంటో. డమ్మక్క: తిలోత్తమకు కొత్త భయం పట్టుకున్నట్లు ఉంది.విక్రాంత్: అమ్మ ఎప్పుడూ లేనిది ఈ రోజే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు.తిలోత్తమ: అలాంటిది ఏమీలేదే.నయని: గంధరగోళానికి గురైనట్లు కనిపిస్తున్నారు అత్తయ్య.హాసిని: అయోమయానికి గురైంది నేను చెల్లి. అంటూ రెండు గిన్నెల్లో పాలు తీసుకొని వస్తుంది. పాలు తీసుకొద్దామని వెళ్తే రెండు గిన్నెల్లో ఉన్నాయి. వల్లభ: పిల్లలకు పెద్దలకు అని వేరు చేసి పెట్టి ఉంటారు.విశాల్: అన్నయ్య అలా ఎందుకు చేస్తారు. ఆవుపాలు గేదె పాలు అని వేరు చేసి పెట్టి ఉంటారు. నయని: ఒకే గిన్నెలో పాలు పెట్టాను కదా. సుమన ఉలూచి కోసం నువ్వు పాలు తీసుకొచ్చావా.సుమన: లేదే..డమ్మక్క: పాలు పోసే అతను ఉదయమే వచ్చాడు. సాయంత్రం వరకు రాడు. ఈ మధ్యలో ఈ పాలను ఎవరు ఎక్కడి నుంచి తెచ్చారో కొంచెం ఆలోచించాలి.  తిలోత్తమ ఆ పాల ప్యాకెట్ తెచ్చి. అందులో మత్తు మందు కలిపి వాటిని గాయత్రీ పాపకు పట్టిస్తే గాఢ నిద్రలోకి జారుకుంటుంది. అఖండ స్వామి ఇచ్చిన మత్తు వేరుని ఇంకోలా వాడొచ్చు అని తలోత్తమ అనుకుంటుంది. ఇక తిలోత్తమ ఆ పాలను తాగను అనేస్తుంది. జ్యూస్ కావాలని అంటుంది. ఇక హాసిని పాలు తాగమని బలవంతం చేస్తుంది. తిలోత్తమ భయపడుతుంది. వద్దు అంటే బలవంతం చేస్తున్నారు అని అంటుంది. ఇక తిలోత్తమ ఈ గిన్నెలో పాలు వద్దు అని అంటుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: హన్సిక మోత్వాని: చీరకట్టులో చందమామల కవ్విస్తున్న హన్సిక