Hansika Motwani : చీరకట్టులో చందమామల కవ్విస్తున్న హన్సిక
లైట్ మిక్స్డ్ కలర్ శారీలో హన్సిక మోత్వానీ మెరిసింది. మినిమల్ మేకప్లుక్లో చీర కాంబినేషన్లో హన్సిక చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/iHansika)
హెయిర్‌ను ముడి వేసుకుంటూ.. చిన్న బొట్టుపెట్టుకుని చాలా సహజంగా కనిపించింది హీరోయిన్. శారీకి తగ్గట్లు.. బ్లౌజ్‌ను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. (Images Source : Instagram/iHansika)
ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. వైట్ లవ్ సింబల్ క్యాప్షన్‌గా పెట్టింది. అభిమానులు మాత్రం ఈ భామ లుక్ చూసి తెగ పండుగ చేసుకుంటున్నారు.(Images Source : Instagram/iHansika)
హన్సిక తెలుగు, తమిళంలో హీరోయిన్గా మంచి విజయాలు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఈ భామ హిందీలో ఎన్నో సీరియల్స్ చేసింది. దేశముదురు సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/HansikaMotwani)
దేశముదురు, కందిరీగ, మస్కా, సింగం వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దాదాపు ఈమె నటించిన అన్ని సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. (Images Source : Instagram/HansikaMotwani)
కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/HansikaMotwani)