Trinayani Today Episode సుమన ఆఫీస్‌కు వస్తుంది. తిలొత్తమ, వల్లభలు కలిసి సుమనను ఒంటరిగి ఆఫీస్‌లోపలికి పంపిస్తారు. వెనకాలే వచ్చిన విశాల్ వాళ్లు వస్తారు. ముందుగా వెళ్తున్న సుమనను చూసి ఆఫీస్‌లో ఆమెను ఎవరూ గుర్తుపట్టకపోతే ఇబ్బంది అని హాసిని, విశాల్‌ ఫాస్ట్‌గా సుమన వెంట వెళ్తారు. ఇక నయని కూడా వెళ్తుంటే తిలోత్తమ చేయి పట్టుకొని ఆపుతుంది.


తిలోత్తమ: మీ ఆయన ముందు వెనక ఆలోచించకుండా ఆఫర్ ఇచ్చాడు మీ చెల్లికి. 
వల్లభ: ఎందుకో తెలీదు మరి. మా తమ్ముడుని మేనేజర్ స్థాయిలో ఉంచి మీ చెల్లిని మటుక బోర్డ్ మెంబర్‌ స్థాయికి సడెన్‌గా తీసుకొచ్చాడు అంటే సుమన అదృష్టం అనుకోవాలా లేకపోతే విశాల్ ఇంట్రస్ట్‌ అనుకోవాలా..
నయని: ఆఫీస్‌కు వచ్చాక చేతికి నేను ఫైల్స్ తీసుకుంటా కానీ చెప్పులు తీసుకోను బావగారు. 
తిలోత్తమ: నా కొడుకుకే వార్నింగ్ ఇస్తున్నావా..
నయని: మీరు పెంచి కొడుకు విశాల్ బాబుగారి క్యారెక్టర్‌ ఏంటో మాకు బాగా తెలుసు. మీరు కన్న కొడుకుకు చెప్పండి.
తిలోత్తమ: మాకు చెప్పడం కాదు ఈరోజు అంతా మీ చెల్లెలికి చెప్పుకునే పరిస్థితి మీకు వస్తుంది వెళ్లి చెప్పుకో పో..


ఎద్దులయ్య: అమ్మా నయని మాతా పసిబిడ్డని వదల్లేక వదిలి వెళ్లింది.
విశాలాక్షి: బిడ్డను కన్న సుమనకు లేని పట్టింపు అమ్మకు ఎందుకు.
డమ్మక్క: నువ్వే అలా అంటే ఎలా అమ్మా. సుమనకు బుద్ధి వచ్చేలా చేస్తాను అన్నావు. 
ఎద్దులయ్య: బుద్ధి కాదు రక్తమే వచ్చేలా చేస్తాను అన్నావు.
విశాలాక్షి: తనకి గుణపాఠం చెప్పాలి అయితే.. సరే అయితే ఉలూచిలా మారిపోతాను నన్ను సుమన దగ్గరకు తీసుకెళ్లమని చెప్పండి. 
ఎద్దులయ్య: విశాలాక్షి ఉలూచిలా మారిపోతుంది. నేను అమ్మను తీసుకొని గదిలోకి వస్తాను. అక్కడున్న ఉలూచిని నువ్వు పొడుగుమాతాకి ఇచ్చేయ్ డమ్మక్క. 


సుమన ఆఫీస్‌కు వెళ్లడం వెళ్లడమే ఇక్బాల్ అనే ఓ వ్యక్తిని కొడుతుంది. ఇక ఉలూచిలా మారిన విశాలాక్షిని ఉలూచి స్థానంలో పెట్టి ఉలూచిని బయటకు తీసుకెళ్తుంది డమ్మక్క. ఇక విక్రాంత్ ల్యాప్‌టాప్‌లో కార్టూన్స్ పెట్టాలి అని వెళ్తాడు. 


ఎద్దులయ్య: పుత్రా ఉలూచి గాయత్రీ, గానవి పిల్లల్లా కాదు చిట్టిమాతను వదిలి ఒక్కనిమిషం కూడా ఉండలేదు. ఏడ్చి ఏడ్చి గుండె ఆగిపోయేలా ఉంది పుత్రా.
విక్రాంత్: మరి ఇప్పుడు ఏం చేద్దాం.
ఎద్దులయ్య: ఉలూచి పాపను వాళ్ల అమ్మ దగ్గరకు తీసుకెళ్లడమే మార్గం. 
విక్రాంత్: ఆఫీస్‌కా అక్కడికి అంటే.. ఎస్ అక్కడికి తీసుకెళ్తాను పాపను ఎందుకు దగ్గరకు తీసుకోదో అదీ చూస్తాను. అంటూ విక్రాంత్ పాపని తీసుకెళ్తాడు.


హాసిని: చెల్లి చిట్టీ ఇక్బాల్‌ని కొట్టింది.
నయని: తిరిగి కొట్టమని చెప్పాల్సింది అక్క. 
విశాల్: నయని అలా అంటావ్ ఏంటి.. పూర్తిగా తెలుసుకోవాలి కదా..
హాసిని: ఆ చిట్టి తల్లిని ఎందుకు బోర్డు మెంబర్‌ని చేశావో నీకే తెలియాలి విశాల్..
 
ఇక నయని వాళ్లు వస్తారు. ఇక సుమనను పరిచయం చేస్తాను అంటే అందరూ తన గురించి బాగా అర్థమైందిలే అంటారు. ఇక సుమన ఇక్బాల్ విశాల్‌ ప్రజంటేషన్ ఫైల్ ఇస్తే ఇక్బాల్‌కి సుమన కాఫీ తెమ్మని ఆర్డర్ వేస్తుంది. అందరూ షాక్ అవుతారు. మరోవైపు విక్రాంత్ ఉలూచిని తీసుకొని వస్తాడు. 


నయని: సుమన ఇక్బాల్ ఎవరు అనుకున్నావ్.
తిలోత్తమ: ఎవరూ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు నయని ఇందాక తను సుమనను గుర్తుపట్టలేదు అంటకదా. నా చిన్న కోడలు ఇక్బాల్‌ని ఒకప్పుడు టీ కాఫీ ఇచ్చే అంటెండర్‌ గానే గుర్తుపెట్టుకుంది కదా..
వల్లభ: అవును తీసుకొస్తే తప్పేంటి.
ఇక్బాల్: తీసుకొస్తా సార్.. 
విశాల్: అక్కర్లేదు.. 
సుమన: నాకు కావాలి బావగారు.. కాఫీ వేడిగా ఉండాలి.. 
విక్రాంత్: ఇక్బాల్ నువ్వేంటి ట్రే పట్టుకెళ్తున్నావ్ బాయ్‌ని పిలు..
ఇక్బాల్: పర్వాలేదు సార్ మీ మేడం గారు నన్ను కాఫీ తీసుకురమ్మన్నారు. కాఫీ ఇచ్చి వచ్చాక నేను పాపని ఎత్తుకుంటాను మీరు మీటింగ్‌కి వెళ్లండి.
విక్రాంత్: పాప వాళ్ల అమ్మ దగ్గరకే వెళ్లాలి నువ్వు రా..
నయని: విక్రాంత్ బాబు పాపని ఆఫీస్‌కి తీసుకొచ్చారు ఏంటి. 
బోర్డుమెంబర్: ఆ పాప సుమన కూతురే కదా.. గర్భాశయాన్ని రెండు కోట్లకు కొని ఈ పాపనేనా కన్నది. 
మరోవ్యక్తి: అవును రిస్క్ తీసుకొని ఈ బిడ్డనే కన్నది కానీ ఇంట్లో వదిలేసి ఆఫీస్‌కు వచ్చింది..
సుమన: ఇంక ఆపుతారా.. నాకు ఇష్టం వచ్చినట్లు నేను పిల్లల్ని కంటాను మీకు ఏంటి నొప్పి.
విశాల్: సుమన కూర్చో.. నిజమే మాట్లాడుతున్నప్పుడు సైలెంట్‌గా ఉండాలి.
తిలోత్తమ: రేయ్ ఉలూచిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు. 
విక్రాంత్: ఉలూచిని నా దగ్గర వదిలేసి వస్తే ఎలా అమ్మా నా దగ్గర ఉంటం లేదు.
నయని: సుమన పాపని తీసుకెళ్లి లాబిలోకి వెళ్లు.
సుమన: నేను పాపని ఆడిస్తే మీరు మీటింగ్ పూర్తి చేసేస్తారా.. నేను వెళ్లను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: ఇమ్రాన్‌: సౌత్‌ ఫిలిం మేకర్స్‌పై బాలీవుడ్‌ హీరో, 'ఓజీ' విలన్‌ ఇమ్రాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు