Naga Panchami Today Episode మోక్ష పంచమిని తీసుకొని బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో వాళ్లకి చెప్తాడు. మేం చాలా హ్యాపీగా ఉన్నామని మీరు ఇలా ఎప్పుడు ఉంటారో అని మోక్ష తన వదినలను అంటాడు. మోక్ష వాళ్లు వెళ్లగానే జ్వాల మోక్ష వైదేహి మండిపోతుంటే పెట్రోల్ పోసి వెళ్తున్నాడు అని సెటైర్లు వేస్తుంది.
మీనాక్షి: ముందు మీరు కుళ్లు ఆపేస్తే మంచిది.
శబరి: ఆ జంటని అలా చూస్తుంటే నా రెండు కళ్లు చాలలేదు వైదేహి. నువ్వు కూడా నీ నిండు మనసుతో వాళ్లని ఆశీర్వదించు. అప్పుడు ఇంకా సంతోషంగా ఉంటారు.
వైదేహి: ఈ వైభోగం ఎన్ని రోజులో నేను చూస్తాను.
మీనాక్షి: వదిన ఇక అంతే మనం మార్చలేం అమ్మ.
జ్వాల: చిత్ర మోక్ష పంచమి అలా వెళ్లడం ఆర్టిఫిషియల్‌గా అనిపించడంలే..
చిత్ర: భయంగా.. ఏమో అక్క ఈ మధ్య నాకు నీతో మాటలు కలపాలి అంటే భయంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటావో తెలీడం లేదు. అయినా నువ్వు నన్ను వదిలేయ్ అక్క.
నాగదేవత: నువ్వు చెప్పకముందే అర్థమైంది ఫణేంద్ర. యువరాణిని తీసుకురాలేకపోయావ్.
ఫణేంద్ర: అవును మాతా. యువరాణి సామాన్యురాలు కాదు. రాను అని చెప్పదు కానీ అక్కడి నుంచి వచ్చే అవకాశం లేని పరిస్థితుల్ని కల్పిస్తుంది.
నాగదేవత: రాణి వంశస్తులకు ఆ మాత్రం తెలివితేటలు ఉండటం సహజం. తన తల్లి మృతికి మోక్షకారణం కాదు అని నాతోనే వాదనకు దిగింది. నాగలోకం రావడానికి తనకి ఏమాత్రం ఇష్టంలేదు.
ఫణేంద్ర: అవును మాతా యువరాణి మనసంతా మోక్ష చుట్టే తిరుగుతుంది. యువరాణిని తీసుకురావడానికి నేను చేయని పని లేదు. ఆలస్యం అవుతున్నందుకు మన్నించమని అడగడానికి వచ్చాను.
నాగదేవత: పర్వాలేదు ఫణేంద్ర. ఇంకా కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. యువరాణి నాగలోకం వస్తే చాలు.
ఫణేంద్ర: తీసుకురాగలను మాతా. నాకు సమయంతో పాటు కొంచెం సహకారం కూడా కావాలి. కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరం అయితే ఇంకా కొంచెం యువరాణి మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరు అనుమతి ఇస్తే బాగుంటుంది మాతా. యువరాణిని నేను పెళ్లి చేసుకొని రాణి వంశానికి వారసులు లేని లోటు తీరుస్తాను.
నాగదేవత: యువరాణికి హాని కలిగించకుండా ఏ నిర్ణయం అయినా తీసుకో ఫణేంద్ర. కానీ ఫలితం మాత్రం కనిపించాలి. భూలోకంలో బంధాలు చాలా పవిత్రంగా ఉంటాయి. అక్కడ యువరాణికి పెళ్లి జరిగింది. అక్కడి బంధాలను అంత త్వరగా తెంచుకోదు. పంచమిగా ఉన్న యువరాణి ఇక్కడ నీతో పెళ్లి అంటే అస్సలు రానే రాదు. అప్పుడు మన ప్రయత్నాలు అన్నీ వృథా అయిపోతాయి ఫణేంద్ర.
ఫణేంద్ర: నేను ఈ విషయాలు ఏవీ యువరాణి దగ్గర మాట్లాడను మాతా.
మోక్షని బలి ఇవ్వడం కోసం మేఘన, నంబూద్రీ మాట్లాడుకున్న మాటలు.. యువరాణిని పెళ్లి చేసుకొని రాణి వంశానికి వారసులు ఇస్తాను అన్న ఫణేంద్ర మాటలను సుబ్బు (సుబ్రహ్మణ్యస్వామి) చూస్తాడు.
మోక్ష: మనది నిస్వార్థం లేని ప్రేమ పంచమి.. ఫలితం ఆశించదు. ఎప్పటికీ మనల్ని విడదీయలేదు.
పంచమి: మన ప్రేమలో కల్మషం లేదు మోక్షాబాబు. నన్ను ఇంత ప్రేమించే మిమల్ని ఎలాంటి అనుభూతి లేకుండా పూర్తిగా ఒక జీవిత కాలాన్ని హరింపజేసుకోవడం పాపం అవుతుంది కానీ ప్రేమ అనిపించుకోదు. ఎలా అయినా మీ మనసు మార్చి మీ జీవితం నుంచి తప్పుకుంటాను. సుబ్బు మోక్ష, పంచమిల మాటలు దివ్య దృష్టితో వింటాడు.
ఇక మోక్ష సినిమాకు వెళ్దామని అంటాడు. ఇంతలో సుబ్బు తన దివ్య దృష్టితో మోక్షకి గుడి కనిపించేలా చేస్తాడు. దీంతో మోక్ష ముందు గుడికి వెళ్దామని అంటాడు. పంచమి సంతోషంగా సరే అంటుంది. ఇద్దరూ గుడికి వెళ్తారు. ఇద్దరూ సుబ్బుని చూస్తారు. ఇక తన కోరిక కోరుకొని వస్తాను అని పంచమి వెళ్తుంది.
మోక్ష: సుబ్బు నువ్వు మా ఇంట్లో ఉన్న టైంలో నేను నాగగండం అని అది అని ఇది చాలా టెన్షన్‌లో ఉన్నాను సుబ్బు. అందుకే నిన్ను ఒకసారి ఇంటి నుంచి వెళ్లిపోమని అన్నాను. ఇప్పుడు అవన్నీ లేవు సుబ్బు. చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను చూసిన తర్వాత చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచి వేదాలు నేర్పితే ఎంత బుద్ధిమంతులు అవుతారు అర్థమవుతుంది సబ్బు. నా పిల్లలకు కూడా..
సుబ్బు: ఏమైంది మోక్ష చెప్పడం ఆపేశావ్. ఈ ఒక్క మాట చాలు మోక్ష పంచమి నీ కోసం తన జీవితాన్నే త్యాగం చేయడానికి. ప్రతి దానికి ఒక పరిమితి ఉన్నట్లే ప్రేమకు ఉంటుంది. అమృతాన్ని మరిపించే ప్రేమ వికటిస్తే విషం కూడా అవుతుంది. పంచమి ఎప్పుడూ నీ పక్కనే ఉండాలని పరితపించే ఫలితం ఆశించని ప్రేమ నీది. ప్రాణంగా ప్రేమించే భర్త సుఖంగా ఉండాలి అనికోరుకునే నిస్వార్థ ప్రేమ పంచమిది. ఇద్దరిదీ ప్రేమే.. కానీ నీ ప్రేమ గెలిస్తే పంచమి నువ్వు కోరుకున్నట్లు నీతోనే ఉంటుంది. పంచమి ప్రేమ గెలిస్తే తను తప్పుకొని నీకు దూరంగా వెళ్లి పోతుంది.
మోక్ష: అలా ఎప్పటికీ జరగనివ్వను.
సుబ్బు: గెలుపోటములు మన చేతుల్లో ఉండవు. కానీ అప్రమత్తంగా ఉండటం కనీస కర్తవ్యం. ఇప్పుడు పంచమి చెప్పివెళ్లింది అదే. నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకోవడానికి వెళ్లింది.
మోక్ష: పంచమి కోరిక ఎప్పటికీ నెరవేరదు సుబ్బు.
సుబ్బు: అనుకుంటే సరిపోదు మోక్ష. పంచమి చాలా తెలివైనది. నాగకన్య. శక్తి సామర్థ్యాలు ఉన్నది. భార్యాభర్తల బంధానికి నువ్వు ఎంతగా కట్టుబడి ఉంటే అంతే బలంగా నీ మనసు ఉంటుంది. అప్పుడు నిన్ను ఎవరూ మార్చలేరు.
వైదేహి: అత్తయ్య గారు ఈ ఇంట్లో నా పెత్తనాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా. ప్రస్తుతం ఈ ఇంట్లో ఉండేది నా పెత్తనమా కాదా..
మీనాక్షి: మీకు ఆ అనుమానం వచ్చింది అంటే నీ చేతుల్లో నుంచి పెత్తనం జారిపోతుంది అని భయం నీకు పట్టుకున్నట్లే వదినా..
వైదేహి: నన్ను అన్ని మాటలు అన్నదాన్ని నేను ఇంట్లోనే కాదు ఈ లోకంలోనే ఉండనివ్వును.
శబరి: గుట్టుగా సాగిపోతున్న కుటుంబాన్ని నీ అహంకారంతో రోడ్డుమీదకు ఈడ్చకు వైదేహి. పంచమిని శత్రువుగా చూడటం మానేసి మోక్ష భార్యగా చూడు.
వైదేహి: దాన్ని నా కాలికింద చెప్పులా కూడా చూడను. దానికి బుద్ధి చెప్పినప్పుడే నా పరువు తిరిగి వస్తుంది. దాన్ని ఏం చేస్తానో చూడండి.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సైఫ్ అలీఖాన్ : విడాకులు, రెండో పెళ్లిపై సైఫ్ అలీఖాన్ సంచలన కామెంట్స్ - వైరల్ అవుతున్న పాత వీడియో