Trinayani Serial Today Episode


సుమన: దీపం ఎక్కువై స్పృహ కోల్పొయిన విశాలాక్షి ఎప్పుడు లేస్తుందంట
విక్రాంత్: నీకు ఏదైనా పని ఉంటే వెళ్లి చూసుకో
సుమన: అలాగే అయితే
గురువుగారు: సుమన నువ్వు ఉండాలి
సుమన: నాతో ఏం పని గురువుగారు
గురువుగారు: విశాలాక్షి మేలుకోవాలి అంటే నీ పని తనం కూడా కావాలి
సుమన: నేనేం చేయాలి
నయని: అదే చెప్తారు.. హడావుడి ఎందుకు చెల్లి
తిలోత్తమ: చీరా సారెలు ఎందుకు తీసుకొచ్చారు
ఎద్దులయ్య: అమ్మకు భక్తితో సమర్పించాలి పెద్దమాత
వల్లభ: ఏ అమ్మ
ఎద్దులయ్య: నిద్రిస్తున్న అమ్మకే 
విక్రాంత్: ఇందాకే అమ్మవారు పూనింది అన్నారు కాబట్టి జగన్మాతే నిద్రిస్తుంది అనుకోవాలి
విశాల్: అవును నిజంగా సంతోషం అనిపిస్తుంది. నా చిన్నప్పుడు లక్ష్మీపురం వెళ్లి అటునుంచి అటే తిరిగి రాని నా తల్లి కోసం చాలా ఏళ్లు ఎదురు చూశాను. మా అమ్మ రాలేదు కానీ అమ్మలను కన్న అమ్మ ఈ రోజు ఇంటికి వచ్చింది. 
తిలోత్తమ: వచ్చింది ఇంటికి కాదు ఒంటికి
వల్లభ: అయినా ఇంకా ఉంటుందా ఏంటి.. 
ఎద్దులయ్య: అమ్మ ఎప్పటికీ ఉంటుంది పుత్రా.. బిడ్డలే జన్మాలు మార్చుకుంటారు. 
గురువుగారు: నయని విశాలాక్షి నుదిట కుంకుమ పెట్టి, చేతులకు విభూది పెట్టు, హాసిని అమ్మ చెంపలకు గందం రాయు. 
సుమన: నన్నేం చేయమంటారు
గురువుగారు: అమ్మ పాదాలకు పారాణి రాయు
సుమన: ఈ పిల్ల కాలు నేను పట్టుకోవాలా
విశాల్: సుమన స్వామీజీ గారే అమ్మ అని చెప్పారు. నేవ్వేంటి వ్యత్యాసంగా చూడకు
సుమన: నేను తన పాదాలు ముట్టను
నయని: నువ్వు రాయకపోతే రాయకపో నోటి కొచ్చినట్టు మాట్లాడకు
గురువుగారు: సుమన కాళ్లకు పారాణి రాయకపోతే ఇక్కడే రాయిలా ఉండాల్సి వస్తుంది
సుమన: ఏంటి శపిస్తారా
తిలోత్తమ: పడుకున్న గారడీ పిల్ల ఇప్పుడు అమ్మవారు అయిపోయింది అని భయపెడుతున్నారు. 
వల్లభ: అదే కదా వీళ్లు మనల్ని చిన్న పిల్లల్ని చేసి ఆడుకుంటున్నారు. 
గురువుగారు: వల్లభ మీరు గమనించలేరు.. గుర్తించలేరు.. సుమన విశాలాక్షి పాదాలకు పారాణి రాయకపోతే ఇక్కడ నుంచి కదలదు అని చెప్పాను. అది నామాట కాదు. సుమన ఆ పని చేయకపోతే పాము కాటుకి బలి కావాల్సి వస్తుంది.
ఎద్దులయ్య: మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం నాగయ్య పాముకు లేదు.. చిట్టీ మాత పక్కకు కదిలితే కాటెయ్యాలి అని తన కాళ్లకు చుట్టుకొని ఉన్నాడు చూడండి..(సుమన కాళ్లకు పాము చుట్టుకొని ఉంటుంది)
సుమన: అక్క పాము నన్ను కాటేస్తే నా బిడ్డ అనాధ అయిపోతుంది. నాగయ్యను వెళ్లి పోమని చెప్పు అక్క
గురువుగారు: నాగయ్య పాము రాదు నయని.. అమ్మ పాదాలకు పారాణి రాస్తే తప్ప నాగయ్య పాము విడిచి పోదు. 
తిలోత్తమ: కొన్ని సార్లు తగ్గితేనే మంచిది త్వరగా పారణి రాసేయ్.. 


సుమన విశాలాక్షి పాదాలకు పారాణి రాస్తుంది.. దీంతో పాము సుమన కాళ్లను వదిలి వెళ్లి పోతుంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఇక గురువుగారు చీర గాజులు తాంబూలం విశాలాక్షికి సమర్పించి దండం పెట్టుకోండి అని నయనితో చెప్తారు. దూపం వేస్తే అమ్మ శాంతంగా కళ్లు తెరుస్తుంది అని హాసినికి చెప్తారు. దీంతో విశాలాక్షి అమ్మవారు కళ్లు తెరుస్తుంది.


తిలోత్తమ: హాయిగా నిద్ర పట్టేసినట్టుంది
విశాలాక్షి: నేనిక్కడ పడుకున్నట్టు మీకు అనిపించింది కానీ నిజానికి నేను ఇక్కడ లేను.. శివయ్య దగ్గరకు వెళ్లాను.. 
వల్లభ: ఆయన ఎవరూ
హాసిని: చూడాలని ఉందా
తిలోత్తమ: వద్దులే.. దూపం తగిలి ఏవేవో మాట్లాడబోయి కళ్లుతిరిగి పడిపోయింది..  మొత్తానికి మేలుకుంది అది చాల్లే.. ఏదైనా జరిగితే మనకు మాటొచ్చేది
విశాల్: అమ్మా ఇప్పుడు బాగుంది కదా
విశాలాక్షి: బాగుంది నాన్న.. నిన్ను పెంచిన అమ్మ నా జడలో పూలు కూడా పెట్టింది.. మిగతా వాళ్లు పూజ కూడా చేశారు. త్వరలోనే ఎవరికి కావాల్సిన ఫలితం వాళ్లకు దక్కుతుంది. జాగ్రత్తగా ఉండండి
గురువుగారు: విశాలాక్షి మాటల్లోని పరమార్థం గ్రహించి మెలిగితే మంచిది


మరోవైపు హాసిని తిలోత్తమ సెల్‌కి మిస్డ్‌ కాల్ ఇస్తుంది. ఇక నయని మల్లెపూలు తీసుకొని హాసిని దగ్గరకు వస్తుంది. హాసిని, నయని తిలోత్తమ మీద ఏదో ప్లాన్ వేశారు. ఆ ప్లాన్‌లో భాగంగానే.. తిలోత్తమకు డౌట్ వస్తే ఎలా అని నయని అంటే.. డౌట్ కాదు ఆమె బయటకు రావాలి అని హాసిని అంటుంది. ఇక హాసిని నయని దగ్గర మల్లెపూలు తీసుకొని వాటి మీద సెంటు కొడుతుంది. ఇక ఆ మల్లెపూలను నయని తిలోత్తమ తలలోనూ.. హాసిని వల్లభ చేతికి పెడుతుంది. ఇద్దరు బలవంతంగా తిలోత్తమ, వల్లభను కూర్చొపెడతారు. విశాలాక్షికి పెట్టిన పూలు మీద మత్తు మందు ఎందుకు కొట్టారు అని అడుగుతారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు అని హెచ్చరిస్తారు. మరోవైపు విక్రాంత్, సుమనతో గొడవ పెట్టుకుంటాడు. ఆమెను లై డిటెక్ట్‌తో టెస్ట్ చేస్తా అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘బహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంట్లో తిష్టవేసిన కనకం - అరుణ్‌ను పట్టుకోవడానికి కావ్య కొత్త ప్లాన్