Trinayani Telugu Serial Today Episode :


పావనామూర్తి: అక్కయ్ పూలు పట్టుకొచ్చావ్ ఎందుకు పూజకా..
తిలోత్తమ: లేదు పావనామూర్తి మల్లెపూల సీజన్ అయిపోయింది కాదా అందుకే కొన్ని నేను పెట్టుకున్నాను. కొన్ని కోడళ్లకు ఇద్దామని అనుకున్నాను. 
వల్లభ: వాళ్లకి కాదు కదా మమ్మీ
తిలోత్తమ: ఇడియట్ వాళ్లకి కాకుండా ఇంకా ఎవరికిరా
వల్లభ: నా ఉద్దేశం ఆ రెండు మూరలు ఆ ముగ్గురికి సరిపోవు కదా వాళ్లకి కాకుండా ఇంకా ఎవరికైనా ఇవ్వు
హాసిని: ఇంకా ఎవరికి ఇస్తుంది మీ మమ్మీ చిట్టి కోడలు అంటే కదా ఇష్టం
సుమన: నాకు వద్దులే అక్క మొన్న మా ఆయన తీసుకొచ్చి తలలోనే కాదు చెవిలోకూడా పెట్టారు. ఇప్పుడు పెట్టుకుంటే ముద్దు ముచ్చట లేని మొగుడు మల్లెపూలు బాగానే తెస్తున్నాడు అని జనం అనుకుంటారులే
పావనామూర్తి: అక్కయ్ పోని నీ పెద్ద కోడలు హాసినికి కొన్ని నయనికి కొన్ని ఇచ్చెయ్ 
ఎద్దులయ్య: అమ్మా చూశావా పూల బాట ఎలా మారుతుందో
విశాలాక్షి: ఒకచోట దారి లేదు అందుకే ఇంకో చోటుకు దారి మళ్లుతోంది. (మరోవైపు నాగయ్య పాము లోపలికి రావడానికి తెగ ట్రై చేస్తుంది. ఇక గురువుగారు కూడా వస్తుంటారు. ఇక నయనీ కూడా పూలు వద్దు అనేస్తుంది)
ఎద్దులయ్య: విధి రాత తీసుకోనివ్వదు బాబు
హాసిని: ఉండవయ్యా నువ్వు ప్రతి సారి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. మా అక్క ఎందుకు వద్దు అందో చెప్పనివ్వు 
నయని: కోడళ్లలో చిన్నా పెద్ద అని వయసులో తేడా ఉండొచ్చు కానీ కాపురం చేసే ఇంట్లో ముగ్గురం సమానమే. మీరు పూలు పెట్టుకోనప్పుడు నేను ఒక్కదాన్నే పెట్టెకోను. 
సుమన: మరి విశాల్ బావ గారు తెస్తే మూరలు మూరలు పెట్టుకుంటావ్ కదా అక్క
నయని: ఇవి అత్త తెచ్చిన పూలు సమానంగా ఉండాలి. అవి భర్త తెచ్చినవి సొంతంగా ఉండాలి. అర్థమైందా..
తిలోత్తమ: సర్లే వాళ్లు వీళ్లు వద్దు అంటే విశాలాక్షికే ఇస్తాను.  


అప్పుడే గురువుగారు నయని ఇంటి దగ్గరకు వస్తారు. అక్కడ పూలు అడ్డంగా పెట్టి ఉండడంతో పాములోపలకి వెళ్లకుండా ఇబ్బంది పడటం చూసి "నాగయ్య నేను రావడం ఆలస్యం అయింది. అయినా ఈ ఇంట్లోకి నేను వెళ్లడం కంటే నువ్వు వెళ్లడం అవసరం. ఇదిగో ఈ కండువా పై నుంచి వెళ్లు" అంటూ.. కండువా కింద కప్పి పాము లోపలికి వెళ్లేలా చేస్తారు. ఇక గురువుగారు శివుడికి మొక్కుకోవడంతో అడ్డంగా ఉన్న పూలు బయటకు ఎగిరిపోతాయి. మరోవైపు గురువుగారు లోపలికి వచ్చేసరికి విశాలాక్షి జడలో తిలోత్తమ పూలు పెట్టేస్తుంది. మరోవైపు విశాలాక్షికి మైకం కమ్ముతుంది. దీంతో నయని, విశాల్ అందరూ కంగారు పడతారు. 


వల్లభ: అమ్మా గారడి పిల్ల ఎందుకు అలా ఊగుతోంది
తిలోత్తమ: శివ భక్తురాలు కదరా.. నిత్యం ధ్యానంలో ఉంటుంది కదా.. అప్పుడప్పుడు ఇలా పూనకం రావడం సహజం. భయపడాల్సిన పని లేదు. కదా గురువుగారు
తిలోత్తమ: ఎవరు అనుకున్నది వారు చేస్తున్నప్పుడు భయపడాల్సింది కూడా వారే తిలోత్తమ. 
నయని: అమ్మవారు పూనారంటారా స్వామి
తిలోత్తమ: అందరూ ఉండండి ఏ అమ్మవారు పూనిందో నేను అడుగుతాను
విశాల్: అమ్మా చిన్న పిల్లతో ఈ పరాచికాలు ఏంటి.. బాగుండదు మర్యాద కూడా కాదు
తిలోత్తమ: విశాల్ తను ఎలా స్పందిస్తుందో చూద్దాం.. అప్పుడు నువ్వున్నంటు సైలెంట్ అయిపోతామ్ సరేనా.. పాప నువ్వు ఎవరు
విశాలాక్షి: విశాలాక్షి
గురువుగారు: మనసులో.. గాయత్రీ దేవి గురించి కూపీ లాగుతారు. అమ్మవారి గురించి తెలుసుకుంటారు. ఈ దుర్మార్గులకు ఆ వివరాలు ఏమీ తెలీకూడదు. నీ పని తనం చూపించు నాగయ్య".. అంటే కండువా నుంచి పాము కిందకి వస్తుంది. 
వల్లభ: పాప విశాలాక్షి నీ పేరు అది సరే. కానీ నువ్వు ఎవరు పూనకంలో వచ్చింది ఎవరు
నయని: బావగారు పద్దతికాదు. ఎది అడగాలన్నా సూటిగా అడగండి
తిలోత్తమ: రేయ్ నేను అడుగుతున్నా కదా నువ్వు కామ్‌గా ఉండు.. పాప విశాలాక్షి
విశాలాక్షి: వినిపిస్తుంది తిలోత్తమ
తిలోత్తమ: నువ్వు చెప్పు విశాలాక్షి ఇంతకీ నువ్వు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నావ్.. నేను అడిగే ప్రశ్నలకే కాకుండా నా ఉద్దేశం గ్రహించి అన్నింటికి చకచకా సమాధానం చెప్పు
విశాలాక్షి: మీరు అనుకున్నట్లు నేను గారడి చేసే పిల్లని కాను. 
గురువుగారు: నాగయ్య త్వరగా కానీ దిక్కులు చూడకు అని గురువుగారు అంటే.. విశాలాక్షి అమ్మవారు ఇంకా ఏదో చెప్పబోతుంటే పాము హాసిని చేతిలో అగ్గి కింద పడేస్తుంది. దీంతో విశాలాక్షి అమ్మవారికి దూపం తగిలి..  పడిపోతుంది.
గురువుగారు: కంగారు పడకండి .. విశాలాక్షి స్పృహ కోల్పోయింది. అరగంట పాటు ఆమె కళ్లు తెరవదు. చింతించకండి
వల్లభ: ఎక్కడ నుంచి వచ్చిందో ఈ పాము.. అంతా ఇలా చేసేసింది
గురువుగారు:  అంతా మంచికే అనుకోవాలి వల్లభ


మరోవైపు డమ్మక్క బయటనుంచి వస్తే.. పావనామూర్తి ఆ విషయం తనకి చెప్పడాని వెళ్తాడు. అదంతా తనకు తెలుసు అన్నట్లు మాట్లాడుతుంది. అంతేకాకుండా తన అత్త తిలోత్తమ పూలు జడలో పెట్టడంతో అలా మైకం వచ్చిందని డమ్మక్క నయనికి చెప్తుంది. ఈ విషయం పావనామూర్తి, విశాల్‌లకు కూడా చెప్పరు. ఇక నయని ఇన్ డైరెక్ట్‌గా తిలోత్తమను తిడుతుంది. ఇక డమ్మక్కను దగ్గరున్న గుడికి వెళ్లి అభిషేకం చేయమని నయని చెప్తుంది. డమ్మక్క  వెళ్తుంది. ఇక విశాలాక్షి కోలుకునేలా చేయాలి అని విశాల్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నయని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అరగంట దాటింది విశాలాక్షి ఇంకా లేవలేదు ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ ఇంటికెళ్లిన కావ్య, రాజ్‌ - స్వప్నను ఇంటికి తీసుకెళ్లమన్న రుద్రాణి