Trinayani Telugu Serial Today Episode 


గాయత్రీ పాప ఆస్తిని సుమన తన కూతురు ఉలూచి పేరు మీద రాసి ఇమ్మని చెప్తుంది. దీంతో నయని, విశాల్ షాక్ అవుతారు. అందరూ అలా ఎలా సాధ్యమని, గాయత్రీ పాపని అన్యాయం చేయమంటావా అని సుమనను ప్రశ్నిస్తారు. గాయత్రీ పాప అనాథ కాబట్టి తనకి ఆస్తి ఎందుకు అని వాదిస్తుంది. 


తిలోత్తమ: అరేయ్ మీకు ఇంకా సుమన ఏమంటుందో అర్థం కావడం లేదా.. రేపు ఎలా అయినా పాప రూపంలో ఉన్న గాయత్రీ అక్కయ్య ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు గాయత్రీ అక్కయ్య ఇంటికి వచ్చినా శాస్త్రిగారి మనవరాలు గాయత్రీ పేరు మీద సగం ఆస్తి ఉండటం ఎందుకు అని.. అది ఏదో చెల్లిలి కూతురు అయిన ఉలూచి పేరు మీద రాస్తే బాగు పడతారు అని తన ఉద్దేశం అర్థమైందా.. 
నయని: బాగా అర్థమైంది అత్తయ్య ఇది మా చెల్లి సొంత ఆలోచన కాదు అని.
వల్లభ: మేము ఫిటింగ్ పెట్టామని అనుకోకు పెద్దమరదలా.. మీ చెల్లిలిలాగా ఆస్తుల కోసం ఆలోచించడం మా వల్లకాదు.
విక్రాంత్: చివరి మాట అంటే ఏంటో అనుకున్నా మొదటి నుంచి ఒకటే మాట డబ్బు, ఆస్తి ఇదే కదా..
నయని: అక్క లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయ్..
సుమన: నేనంతే మీకు అంత తక్కువగా ఉందా.. నా మాటలు అంటే మీకు లెక్కలేదా.. లేక నా కూతురు బతుకు అంటే మీకు లెక్కలేదా..
విశాల్: సుమన అలా మాట్లాడకు దయచేసి చిన్న పిల్లని ఇలాంటి వాటిలోకి లాగొద్దు.
తిలోత్తమ: అయితే బదులుగా రాసివ్వడమో.. రాయము అని చెప్పడమో ఏదో ఒకటి చెప్పండి విశాల్. ఇలా మాట్లాడుతూ పోతే అర్థరాత్రి అవుతుంది. 
సుమన: అంటే ఏంటి అక్క అనాథ పిల్ల గాయత్రికి ఆస్తి ఇస్తారు కానీ సొంత చెల్లిలి బిడ్డకు చిల్లిగవ్వ ఇవ్వరు అంతే కదా.
నయని: అనాథ గాయత్రీ కాదు నీ కూతురు ఉలూచి అనాథ. సుమనతో ఉండే మూడు కోట్ల నగలు విలువ చేస్తాయి కానీ, తనతో దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఉలూచి పెద్దది అయినా నగలు పగలు వేసుకుంటుంది కానీ రాత్రి వేసుకోదు కదా.. అయినా మా చెల్లి వేసుకోనివ్వదు కూడా.. తల్లికే ఎలా ఉండాలో తెలీదు ఇక పిల్లని ఎలా పెంచుతుందో తెలీదా..
హాసిని: ఇప్పటికైనా అర్థమైందా.. నువ్వు బుద్ధిగా ఉంటే ఏదో ఒక రోజు జాలి పడి ఆదుకుంటారు. లేదంటే ఉలూచి జీవితాన్ని నువ్వే పాడు చేసిన దానివి అవుతావు. 
సుమన: అయితే మాత్రం నా బిడ్డనే అనాథ అంటుందా మా అక్క. రేపు నువ్వు జైలుకి వెళ్తే నువ్వు కన్న గానవి అనాథ కాదా. గాయత్రీ అనాథ కాదా.. జీవం ప్రాణాలు పోవడానికి మా అక్కే కారణం అయితే జరగబోయేది అదే కదా.. 
నయని: రాబోయే ప్రమాదాలకు భయపడుతూ కూర్చొంటే గాయత్రీ అమ్మగారి భవిష్యత్‌ ఏమవుతుందో..
తిలోత్తమ: ముందు నీది నీ భర్త పిల్లల భవిష్యత్ చూసుకో నయని. 


ఇక విక్రాంత్, సుమనను అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాడు. ఇక ఇద్దరూ తన గదిలో మరోసారి గొడవ పడతారు. ఇక సుమన ఉదయం గుడి దగ్గరకు వెళ్లి గాయత్రీ అత్తయ్య ఉందో లేదో తెలుసుకున్నాక మీ సంగతి తేలుస్తానని అంటుంది. మరోవైపు తిలోత్తమ, వల్లభలు అఖండ దగ్గరకు వస్తారు. 


తిలోత్తమ: స్వామి అమ్మవారి గుడి దగ్గర గాయత్రీ అక్కయ్య జాడ తెలుస్తుందా.. నయని జీవాన్ని చంపేస్తుందా..
అఖండ: నయని ఒకరికి ప్రాణం పోస్తుందే తప్ప తీయదు. నయని జీవాన్ని చంపదు. తన బిడ్డ జాడ చెప్పమని ఒత్తిడి తీసుకొస్తుంది. దీంతో గాయత్రీ దేవిని జాడ చూపించగానే జీవం నెత్తురు కక్కుకొని చనిపోతాడు కాబట్టి ఆ చావుకి నయని కారణం అవుతుంది. 
తిలోత్తమ: జీవం గాయత్రీ అక్కయ్య జాడ చెప్పి చనిపోతాడు. అలా అయితే మేము చస్తాం.
వల్లభ: గాయత్రీ పెద్దమ్మ ఇంటికి వస్తే దగ్గరుండి అందరూ మా అమ్మ ప్రాణాలు తీయిస్తారు. 
అఖండ: అలా జరగకూడదు అంటే మీరు ఏదో చేయకూడదు అని నిర్ణయించుకుంటారు కదా..
తిలోత్తమ: అదే స్వామి జీవం నిజం చెప్పక ముందే అతన్ని పైలోకాలకు పంపించేయాలి అనుకుంటున్నాం. నయనికి నిజం తెలీకూడదు. 
అఖండ: పాములు పట్టేవాడిని తీసుకెళ్లి విష సర్పాన్ని అతడి మీదకు విసిరేయండి.


నయని వాళ్లు గుడికి వస్తారు. దీంతో తిలోత్తమ గాయత్రీ పాప ఇక్కడికి వచ్చేసింది ఇంకా విశాలాక్షి, జీవం రావాలి అని అంటుంది. ఇక ఎవరికీ ఏం కాకూడదు అని నయని దేవుడికి దండం పెట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.