Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఒంట్లో బాలేదు అన్నప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేశారు. అక్కడితో అయిపోయింది కదా మళ్ళీ పదే పదే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు. అది కూడా స్కూల్ ఎగ్గొట్టి అని అను పిల్లల్ని మందలిస్తుంది.


అభయ్: ఏంటో తెలీదమ్మ వాళ్లు ఇద్దరూ నాకు అమ్మమ్మ తాతయ్యలు లాగా అనిపిస్తారు ఏదో తెలియని బంధం ఉన్నట్టుగా ఉంటుంది.


అక్కి: చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ అందరూ సెలవలకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి మాత్రం ఎవరూ లేరని ఇంట్లోనే ఉంచేసే దానివి. వాళ్ళని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది వాళ్లు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు సొంత మనవల్లాగే చూస్తారు.


అభయ్: వాళ్ల వల్లే మేము మాల వేసుకున్నాం అమ్మ, ఆ తాతగారు వాళ్ళ కూతురు ఇంటికి రావాలని మాల వేశారు మేము కూడా మా నాన్న మా దగ్గరికి రావాలని మాల వేసాము. అందుకే థాంక్స్ చెబుదామని వెళ్ళాము అంతేనమ్మా.


అక్కి:  నువ్వు ఒద్దు అంటే ఇంకెప్పుడూ అక్కడికి వెళ్ళమమ్మా. ఇంక అక్కడికి వెళ్ళకూడదు అంటే నువ్వు నో అని చెప్పు.


అను: ఎవరితోనైనా సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటే ఎప్పటికైనా అనుకోని పరిస్థితుల్లో విడిపోతే తట్టుకోలేరు.


అభయ్: ఒకవేళ వాళ్లే మా అమ్మమ్మ తాతయ్య అయితే మేము విడిపోము కదమ్మా అని అనగానే అను ఏడ్చుకుంటూ గది బయటకు వెళ్ళిపోతుంది.


అక్కి: మనం అమ్మని ఎక్కువగా బాధపెడుతున్నాము కదా అన్నయ్య?


అభయ్: పోనీలే ఈ విధంగానైనా మన బాధ అమ్మకు తెలుస్తుంది అని అనుకుంటారు ఇద్దరు.


 ఆ తర్వాత సీన్ లో జ్యోతి అయ్యప్ప పూజకు ఏర్పాట్లు చేస్తుంది. పక్కనే యాదగిరి కూడా కూర్చొని ఉంటాడు.


జ్యోతి: పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు కళకళలాడుతుంది కదా


యాదగిరి: అవును మనం కూడా ట్రై చేద్దాము


జ్యోతి: అంత సంబరం మనకి ఎక్కడిది అని అనేలోగ పిల్లలు ఇద్దరు పూజ దగ్గరికి వస్తారు. ఇద్దరూ అయ్యప్ప స్వామికి పూజ చేసి పాట పాడుతారు. చివరిలో అభయ్ వెళ్లి కర్పూరాన్ని తన చేతిలో పెట్టుకోబోతాడు. 


సుగుణ: ఏం చేస్తున్నావ్ అభయ్?


అభయ్: కర్పూరాన్ని నా చేతిలో పెట్టుకొని హారతి వెలిగిస్తే కోరిక నెరవేరుతుందని పూజారి గారు చెప్పారు. అందుకే నేను కూడా మా నాన్న తిరిగి రావాలని ఇలా చేస్తున్నాను.


ఆర్య: అలా చేస్తే నొప్పి పెడుతుంది అభయ్


అభయ్: పరవాలేదు తర్వాత ఆయింట్మెంట్ రాసుకుంటాను. అని హారతి వెలిగించబోతుండగా ముసుగు వేసుకొని ఉన్న అను ఆపుతుంది.


అను: అభయ్, పెద్దోళ్ళు చెప్తే వినాలి. చెయ్యి కాల్తుంది అంటున్నారు కదా అని కొంచెం గట్టిగా ఉంటుంది.


ఆర్య: చిన్నపిల్లలతో నెమ్మదిగా మాట్లాడండి అని చెప్పి అభయ్ చేతిలో ఉన్న కర్పూరాన్ని తన చేతిలో పెట్టుకుంటాడు ఆర్య.


అక్కి: ఫ్రెండ్, మేము మా నాన్న కోసం చేస్తున్నాము


ఆర్య: నేను మీకోసం చేస్తున్నాను. అని అనగా ఆర్య తన చేతి మీద కర్పూరాన్ని పెట్టి హారతి వెలిగిస్తాడు. ఆ చేతిని అభయ్, అక్కీ లు పట్టుకుంటారు.


తర్వాత సీన్లో ఆర్య కుర్చీలో కూర్చుని ఉండగా అభయ్, అక్కీలు అక్కడికి వస్తారు.


అక్కి: నీవల్ల మా కోరిక నెరవేరింది అని ఆనంద పడాలో లేకపోతే మా వల్ల నీ చేతికి గాయమైందని బాధపడాలో తెలియట్లేదు.


అభయ్: అందుకే మీకోసం స్వామి ప్రసాదం తీసుకొని వచ్చాము అని అనగా ఆర్య ప్లేట్ ని తీసుకుందాం అనుకుంటాడు కానీ అక్కి ఆపుతుంది.


అక్కి: మేమే తినిపిస్తాము ఫ్రెండ్ అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. ఆ సంఘటనని కిటికీ వెనుక నుంచి అను చూసి ఆనంద పడుతూ కన్నీళ్లు కారుస్తుంది.


తర్వాత సీన్లో ఛాయాదేవి, జలంధర్ లు ఇద్దరూ చెస్ ఆడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మాన్సీ వస్తుంది.


మాన్సీ: అక్కడ సుగుణ వాళ్ళింట్లో అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నారట. అందరూ అక్కడ సంతోషంగా గడుపుతున్నారు. ఇక్కడ మీరు చెస్ ఆడుతూ ఉన్నారు రివెంజ్ ప్లానింగ్ ఏం లేదా?


జలంధర్: ఎందుకు లేదు ఈ రోజు వాళ్ళు అయ్యప్ప పూజ చేస్తున్నప్పుడు అటువైపు ఉండేది సుగుణ, అను, పిల్లలు, ఆర్య, కానీ ఇటువైపు ఉండేది మాలవేషంలో ఉన్న మా రౌడీలు.


ఛాయా దేవి: అయితే ఈసారి రివెంజ్ ఎవరి మీద? కింగా? క్వీనా?


జలంధర్: కాదు ఈసారి ప్లాన్ పిల్లల మీద. కన్న పిల్లలు కంటి ముందు కన్నుమూస్తే ఎలా ఉంటుందో బాధ వాళ్లకు తెలుస్తుంది అని నవ్వుకుంటాడు జలంధర్.


ఆ తర్వాత సీన్లో ఇంట్లో అందరూ అయ్యప్ప పూజకు ఏర్పాట్లు అన్నీ చేస్తారు. పంతులుగారు పిల్లలు ఇద్దరినీ కూర్చోబెట్టి పూజను ప్రారంభిస్తారు. వాళ్లతో పాటు కొందరు అయ్యప్పలు కూర్చుని ఉంటారు. మరోవైపు అయ్యప్ప వేషంలో ఉన్న రౌడీలు ఇంటి బయట ఉంటారు.


రౌడీ: అందరూ గుర్తుంచుకోండి హారతి ఇచ్చే టైంలో కొంచెం సేపు లైట్లను ఆపుతారు. ఆ టైంలోనే మనం పనిని ఫినిష్ చేసుకోవాలి అని చెప్పగా అందరూ వాళ్ళ వెపన్స్ ని షర్ట్లలో దాచేసుకుంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.