Gruhalakshmi December 29th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: లాస్యకు స్వాగతం పలికిన తులసి - దివ్యను గొలుసులతో కట్టేసిన ప్రియ

Gruhalakshmi Serial Today Episode: నందగోపాల్ వెళ్లి లాస్యను ఇంటికి తీసుకురావడంతో ఇంట్లో జరిగిన పరిణామాలు ఇవాళ్టీ ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచాయి.

Continues below advertisement

Gruhalakshmi  Telugu Serial Today Episode:  ప్రియ పైకి దివ్య బెడ్‌రూంలోకి వచ్చిన తర్వాత సంజయ్‌ ఇచ్చి వెళ్లిన గొలుసు, తాళం ప్రియ చేతిలో పెడుతూ.. మీ బావగారు ఎలాగూ నాకు సంకెళ్లు వేయడం లేదు. నువ్వైనా నాకు సంకెళ్లు వేసి ఇంట్లో వాళ్ల నిర్ణయాన్ని గౌరవించు అంటుంది దివ్య. ప్రియ మాత్రం సైలెంట్‌గా బాధపడుతూ చూస్తుండిపోతుంది. దివ్య గట్టిగా తాళం వేయమని అడగగానే ప్రియ గొలుసులతో దివ్యను కట్టేసి ఏడుస్తూ 'కీ' విక్రమ్‌ చేతిలో పెట్టి వెళ్లిపోతుంది. విక్రమ్‌ తాళం తీయబోతుంటే..

Continues below advertisement

దివ్య: విక్రమ్‌ వద్దు విక్రమ్‌ వదులు.

విక్రమ్‌: నేనుండగా నీకిలాంటి పరిస్థితి రాకూడదు. నేను చూసి తట్టుకోలేను.

దివ్య: నన్ను స్వేచ్చగా వదిలేస్తే ప్రమాదం అని సంజయ్‌ చెప్పాడా లేదా?

విక్రమ్‌: నువ్వలాంటి దానివి కాదు. అలాంటివెప్పుడు చెయ్యవు. నాకా నమ్మకం ఉంది. నేను ఎవ్వరి మాటలు పట్టించుకోను

అంటూ గొలుసు విప్పడంతో దివ్య ఏడుస్తూ విక్రమ్‌ను హగ్‌ చేసుకుంటుంది. మరోవైపు లాస్య సాంగ్స్‌ వింటూ ఎంజాయ్‌ చేస్తుంది. ఇంతలో నందు వస్తాడు. నందని చూసిన లాస్య హ్యాపీగా నందుకు వెల్‌కమ్‌ చెప్తుంది.

నంద: చిన్న పని ఉండి వచ్చాను.

లాస్య: ఎందుకొచ్చావని నేను అడగలేదు. రా ఇలా కూర్చో.. కంగారేమి లేదు. మెల్లగా చెప్పు ఏవైనా కబుర్లు చెప్పు.

నంద: ప్రస్తుతం నేను రిలాక్స్‌డ్‌ గా కబుర్లు చెప్పే మూడ్‌లో లేను.

లాస్య: సరే నందు ఇబ్బంది పెట్టనులే వచ్చిన పనేంటో చెప్పు.

నందు: నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి.

లాస్య: మీ ఇంటికా స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? ఈ సంగతి తులసికి తెలిసిందంటే ఇంకేముంది కర్రపట్టుకుని లాగిపెట్టి కొడుతుంది.

నందు: తులసే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపింది.

  అని నందు చెప్పగానే ఏ హక్కుతో ఆ ఇంటికి రావాలి ఎవరి హద్దులో వాళ్లు ఉంటేనే అందరికి మంచిది అంటూ లాస్య తను రాలేనని చెప్తుంది. దీంతో నందు రెండు చేతులు జోడించి లాస్యను మొక్కుతూ నీకు దండం పెడతాను మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని రక్షించు అంటూ వేడుకుంటాడు. దీంతో లాస్య సరే నందు నీకోసం మీ ఇంటికి వస్తాను అంటూ వెళ్దాం పద అంటుంది. నందు వెళ్లగానే ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్నాను అని మనసులో అనుకుంటుంది లాస్య. ఇంకోవైపు తులసిని ఇంట్లో పనిమనిషి కూడా తిడుతుంది. లాస్యను మళ్లీ ఇంట్లోకి ఎందుకు తీసుకురావడానికి పర్మిషన్‌ ఇచ్చారంటుంది. లాస్యను తిడుతుంది. ఇంతలోనే అక్కడకు నందు, లాస్య రావడంతో పనిమనిషి రాములమ్మ షాక్‌ అవుతుంది. అయితే నందును నువ్వు నన్ను ఎందుకు మళ్లీ మోసం చేశావు అని అడుగుతుంది లాస్య. అదేంటని నంద అడగ్గానే.. ఇక్కడ అందరూ నాకోసం ఎదురుచూస్తుంటారు అన్నావు. ఎవ్వరూ కూడా ఇక్కడ అలా కనిపించడం లేదు అంటుంది లాస్య.

తులసి: మామయ్య మనసులో ఉండే ఏ భ్రమలైనా నిజమని అనుకునేలా అందరం  ప్రవర్తించాలి. ఇది ట్రీట్‌మెంట్‌లో భాగమని డాక్టర్‌ గారు చెప్పింది నీకు కూడా తెలుసు. ఆయనిప్పుడు నిన్ను ఈ ఇంటి కోడలు అనుకుంటున్నారు. నువ్వు ఈ ఇంట్లో కనబడకపోయేసరికి గొడవలు పెడుతున్నారు. కనీసం కాఫీ కూడా తాగడం లేదు.

లాస్య: అలా అని ఈ ఇంటి కోడలుగా నేను నటించడం తప్పు కదా? ఇదే మాట నందుకు కూడా చెప్పాను.

అనసూయ: ఈ ఇంట్లో ఎన్ని తప్పులు జరగలేదు. అందులో ఇది ఒకటి అనుకుంటాను.

నందు: ఎవరు ఎలా నటించినా.. నాన్న భ్రమలోంచి బయటకు వచ్చేంతవరకే..

  అనగానే ఆయనను ఆ భ్రమలోంచి బయటకు రానివ్వనుగా ఎప్పటికీ ఇక్కడే సెటిల్‌ అవ్వడానికే ఇక్కడికి వచ్చాను. అని లాస్య మనసులో అనుకుంటుంది. ఇంతలో అక్కడకు పరంధామయ్య వచ్చి లాస్య చూసి చాలా హ్యపీగా ఫీలవుతాడు. అనసూయను తిడతాడు. మరోవైపు విక్రమ్‌ బాధపడుతూ ఉంటే వాళ్ల నాన్న ఓదారుస్తాడు. తను పడ్డ కష్టాల గురించి చెబుతూ నాకు ఈ ప్రపంచాన్ని కొత్తగా ఒక దేవత పరిచయం చేసింది. అలాంటి దేవత ఇప్పుడు నాలాంటి దీనస్థితిలో ఉంది అయినా ఏమీ చేయలేకపోతున్నాను అంటూ బాధపడతాడు. ఇందంతా దూరం నుంచి వింటున్న బసవయ్య  వెంటనే వెళ్లి రాజ్యలక్ష్మీకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దీంతో నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావని శత్రువు ఒక్క అడుగు వేసే లోపే నేను పరిగెత్తి పది అడుగులు వేస్తానని చెప్తుంది రాజ్యలక్ష్మీ.

బసవయ్య: ఇంతకీ ఏం చేయబోతున్నావ్‌ అక్కయా..?

రాజ్యలక్ష్మీ: ఈ రోజు రాత్రికి జరిగబోయే సంఘటన చూస్తే మీ బావ కూడా మన దారిలోకే వస్తాడు. దివ్యను గొలుసులతో కట్టేయమని ఆయనే చెప్తాడు.

బసవయ్య: అదేంటో నేను అడగను

అంటూ చూస్తుండిపోతాడు బసవయ్య. మరోవైపు లాస్య, తులసి హాల్లో కూర్చుని ఉంటారు. ఎవో కొన్ని టాబ్లెట్స్ తీసి లాస్యకు ఇస్తుంది. ఇవి మామయ్య గారికి ఇవ్వు అంటుంది తులసి. నిజంగా కోడలుగా ఉన్నప్పుడు కూడా మామయ్య గారిని నేను అసలు పట్టించుకునే దానినే కాదు. నన్ను ఆయన దగ్గరకు కూడా రానిచ్చే వారు కాదు అంటూ లాస్య చెప్తుండగానే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

Continues below advertisement