Trinayani Telugu Serial Today Episode 


తిలోత్తమ పాలు మీద కాలు వేసి జారిపోయాను అని చెప్పడంతో ఆ పాలు ఎలా కిందపడ్డాయా అని చూడటానికి హాసిని బయటకు వస్తుంది. ఇక ఎదురుగా సోఫా మీద గాయత్రీ పాప గ్లాస్ పట్టుకొని కూర్చొని ఉంటుంది. దాన్ని చూసి హాసిని ఇందంతా నీ పనా అని సంబర పడిపోతుంది. ఇక విక్రాంత్, హాసినీలు వల్లభ, తిలోత్తమలకు జాగ్రత్తలు చెప్తారు. 


నయని: (చీరలు పట్టుకొని తన తల్లి కిందకి వస్తుంటే) అమ్మా ఇంకా నీ పని అవ్వలేదా.. ఎత్తుకెళ్లే పని అవ్వలేదా..
శ్యామల: అంటే ఏంటి చీరలు మూట కట్టి తీసుకెళ్లడం అంటున్నావా..
నయని: మా చీరలు నువ్వు కట్టకపోగా ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లకు ఇస్తావు అని ఇచ్చాం. నువ్వేమో ఆ చీరల్లో పెట్టెను పెట్టావు. పెడితే పెట్టావులే. అందులో డబ్బులు ఏం ఉండవు. కానీ అందులో ఉలూచి పాపను పెట్టాలి అనుకోవడం తప్పు.
శ్యామల: నేను వద్దు అనే అన్నాను కానీ ఆ నాగులమ్మే అందులో పెట్టింది. 
నయని: అదృష్టం కొద్దీ ఉలూచి అక్కడి నుంచి వెళ్లిపోయేది కాబట్టి సరిపోయింది లేదంటే..
సుమన: అప్పుడే అక్కడికి వస్తూ.. చచ్చిపోయేది..  పెద్ద బొట్టమ్మ దాని బిడ్డను చూడటానికి ఆరాటపడుతుంది అంటే అర్థముంది. నీ కూతురుని కదా నేను నన్ను చూడటానికి కదా నువ్వు రావాలి కానీనేను కన్న ఉలూచి ప్రాణాలు తీయడానికి వస్తావా..
నయని: అమ్మ ఏం చేయలేదు చెల్లి.
సుమన: సాయం చేసింది. ఉలూచిని పెద్దబొట్టమ్మ తీసుకెళ్లడానికి సాయం చేసింది.
శ్యామల: ఎక్కడికి తీసుకెళ్తుంది తెల్లారితే ఆడపిల్లలా మారే పిల్లని తనేం చేసుకుంటుంది. 
సుమన: నేను ఇప్పుడు పెద్దగా మాట్లాడితే అత్తయ్య వాళ్లు వచ్చేస్తారు. అందుకే ఏం అనడం లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపో..
నయని: ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తుంది చెల్లి.
సుమన: తెల్లారే వరకు ఉంటుంది అంటే నా బిడ్డను ఏం చేస్తుందా అనే టెన్షన్ నాకు ఎక్కువవుతుంది. 
శ్యామల: లేదు సుమన నాగులమ్మ కూడా వెళ్లిపోయింది. 
నయని: మనసులో.. అమ్మ ఏ ఉద్దేశంతో వచ్చిందో తెలుసుకుందా అనే లోపు సుమన చూసేసింది. ఇంకో గంట కూడా ఉండనిచ్చేలా లేదు.
సుమన: వెళ్తావా లేక ఇంట్లో వాళ్లని పిలిచి మెడ పట్టి బయటకు గెంటించేయాలా.. విష సర్పాన్ని అయినా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. 
శ్యామల: మనసులో.. సుమనతో పేచి పెట్టుకోకుండా వెళ్లిపోతే మంచిది ఈ సారి వచ్చినప్పుడు పని పూర్తి చేయొచ్చు. 



హాసిని: శ్యామల పిన్ని కోసం జొన్నరొట్టెలు చేయాలేమో..
సుమన: అవసరం లేదు. అమ్మ రాత్రే వెళ్లిపోయింది.
విశాల్: అంత రాత్రి పూట ఎలా వెళ్లారు. నయని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి. 
తిలోత్తమ: (అప్పుడే వచ్చిన గురువుగారుని చూసి) మహానుభావులు ఇంటికి వస్తే మౌనంగా ఉంటావు ఎందుకు నయని. కోరలమ్మ పూర్ణిమ పూజ ఫలితంగా గుళ్లో నువ్వు దత్తత తీసుకున్న గాయత్రీ, నిన్ను అమ్మా అని పిలిచే విశాలాక్షి, నీ కన్న కూతురి జాడ తెలిసిన ఒకే ఒక్కడు జీవం ఈ ముగ్గురు కనిపించారు అంటే గండ కాలం వీళ్ల ముగ్గురులో  ఎవరికి ఉందో అడిగి తెలుసుకోవడం తప్పేమీ కాదు.
వల్లభ: తప్పేది కాదు. ఎందుకంటే అందులో చిట్టి పాప గాయత్రీ కూడా ఉంది. 
విక్రాంత్: విశాలాక్షికి ఏం అయినా పర్లేదా అనుకుంటున్నారా..
సుమన: కొంప తీసి ఆ విశాలాక్షిని కూడా దత్తత తీసుకొని కాపాడాలి అనుకుంటున్నారా..
విశాల్: ఈ ఇంటి కోడల్ని సరిగా అర్థం చేసుకోలేని వారు బయట వారిని ఏం అర్థం చేసుకుంటారు. 
తిలోత్తమ: మరేం పర్లేదు. విశాల్ నన్ను విమర్శించడం మొదలు పెట్టాడు అంటే నాలో కొన్ని సవరించుకోవాల్సినవి ఉన్నాయని అనుకుంటాను. పాజిటివ్‌గా..
సుమన: స్వామి మా అక్క మీ దగ్గరకే వచ్చి ఈ విషయం అడుగుదామనుకుంది. మీరే వచ్చారు. ఆ ముగ్గురు కనిపించారు అంటే ఏం జరుగుతుందో మీరే చెప్పండి.
గురువుగారు: పూజ జరిగే దగ్గర హత్య జరుగుతుంది సుమన. మీకు కనిపించిన ముగ్గురులో ఒకరు చనిపోతారు. ఇంకొకరు చంపబడతారు. 
తిలోత్తమ: అంటే నయని కూడా ఏం చేయలేకపోతుంది అన్నమాట. 
నయని: లేదు అలా జరగడానికి వీలు లేదు.
విక్రాంత్: వదినా అవకాశం లేనట్లు అనిపిస్తుంది. అన్నింటికన్నా దురదృష్టం ఏంటంటే.. ఆ ముగ్గురులో గాయత్రీ పాప కూడా ఉంది.
సుమన: ఫ్రీగా వచ్చిన పిల్ల ఫ్రీగా..
విశాల్: ఆపేయ్.. 
తిలోత్తమ: విశాల్ మాట్లాడకుండా అడ్డుకోవచ్చు కానీ విధిరాతను అడ్డుకోలేము కదా..
విశాల్: గురువుగారు ప్రాణ హాని ఏ ఇద్దరికి ఉంది.
గురువుగారు: అలా చెప్పలేము విశాలా.. 
పావనామూర్తి: అల్లుడు నాకు ఓ ఐడియా వచ్చింది. అసలు గుడికే వెళ్లకపోతే..
హాసిని: ఈ ఐడియా బాగుంది. అప్పుడు గాయత్రీ పాప క్షేమంగా ఉంటుంది కదా..
నయని: తీసుకెళ్లాలి. అవును అలా కనిపించింది అంటే విధిరాతను అనుసరించాల్సిందే.. పాపను తీసుకెళ్లకపోతే విశాలాక్షి, జీవం అన్న ప్రాణాలు అన్యాయంగా తీసేసిన పాపం నాకు చుట్టుకుంటుంది. 
విక్రాంత్: అదీ కాకుండా జీవం అక్కడికి వస్తే గాయత్రీ పెద్దమ్మ జాడ తెలుసుకోవాలి కదా వదినా.
గురువుగారు: ఈ సారి రెండు ప్రాణాలు కాపాడాలి అంటే విశాలాక్షి అమ్మవారే దిగిరావాలి తిలోత్తమ. మీరు ఎవ్వరూ ఊహించలేనిది ఏమిటంటే జీవం చావుకి నయనినే కారణం అవుతుంది. 
విశాల్: లేదు.. కాదు..
తిలోత్తమ: నువ్వేం చేస్తావు నాన్న విధి అలా రాసుంది. జీవం ప్రాణం పోవడానికి వాడి పిల్లలు అనాథ కావడానికి ఆ కుటుంబ నాశనం అవడానికి నయనినే కారణం అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Read Also: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రిలీజ్‌ డేట్ ఫిక్స్, సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?