Trinayani Telugu Serial December 1st Today Episode : తిలోత్తమ తీసుకొచ్చిన పాప ఎవరూ అంటూ సుమన అడుగుతుంది. దీంతో ఆ విషయం అమ్మే చెప్పాలి అని విక్రాంత్ అంటాడు. దీంతో డమ్మక్క చెప్పకపోయిన ఇప్పుడే ఆ విషయం తెలిసిపోనుంది అంటుంది. ఇక వల్లభఅయితే ఇప్పుడు ఏం ఏం చేద్దాం మమ్మీ అని తన తల్లిని అడుగుతాడు. తిలోత్తమ నోటి నుంచి మాట రాదు. హాసిని సెటైర్లు వేస్తుంది. 


నయని: పాపం కష్టపడ్డారు లే అక్క. ఈ అత్తయ్య మర్చిపోయారు అనుకుంటా మా అత్తయ్య చేయి రాచుకుంటే నిప్పు వస్తుందని
విక్రాంత్: అమ్మా.. నువ్వు ఏదో చేయబోయి చేతులు కాల్చుకున్నాను అనుకొని ఆ పాపని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావో వాళ్లకి తిరిగి అప్పగించు


మరో వైపు తిలోత్తమ ఎవరి దగ్గర నుంచి పాపను తీసుకొస్తుందో ఆ మనిషిని ఎద్దు తరుముకుంటూ వస్తుంది. దీంతో ఆ మహిళ నయని ఇంటి వైపు పరుగున వస్తుంది. తనని కాపాడమంటూ వేడుకుంటుంది. ఇంతలో వల్లభ తనని బయటకు వెళ్లమని చెప్తాడు. 


హాసిని: తను మీకు తెలుసా  
వల్లభ: నాకు తెలీదు.. 
మహిళ: అదేంటి సార్ అలా అంటారు నేను తెలీదా.. 
తిలోత్తమ: ముందు బయటకు వెళ్లు
నయని: నందీశా వెళ్లు
విశాల్: అదేంటి వద్దు అన్నట్లు తల అలా ఊపుతుంది
మహిళ: తిలోత్తమతో అమ్మా కాపాడండి తల్లీ
డమ్మక్క: తల్లీ కాపాడమని శరణు వేడుకుంటోంది అమ్మా
విశాలాక్షి: మీ మనవరాల్ని నువ్వు ఎత్తుకుంటే నందీశ్వరుడు వెనక్కి వెళ్లిపోతాడు. 
(ఆమె పాపను ఎత్తుకోగానే నంది వెళ్లిపోతుంది.)
మహిళ: బుద్దొచ్చింది అమ్మా నా మనవరాలు రాణిని ఈ మేడం అడిగితే నా మనవరాలు కోటీశ్వరురాలు అవుతుందని తీసుకొచ్చి ఇచ్చానమ్మా
తిలోత్తమ: ఏయ్ నువ్వే కదా ఈ బిడ్డ విశాల్ కన్న బిడ్డ అని మాకు ఇచ్చావ్
విశాల్: ఎవరు ఏం చెప్పినా కనువిప్పు కలిగేలా చేశాడు నందీశ్వరుడు
నయని: విశాల్ బాబు ఈమెకు డబ్బులు ఇచ్చి పంపించడం.. ఎక్కడో నా బిడ్డ కూడా వీళ్లలాంటి వారి దగ్గరే ఉంటుంది. అక్కడ నా బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే మీ ఆశకు ఓదార్పు ఇస్తూ ప్రేమగా ఇస్తున్న డబ్బు అది తీసుకో


ఎద్దులయ్య: (తిలోత్తమ గదిలో బాధపడుతుంటే) అక్కడికి వచ్చి.. గాయత్రి పాపను అక్కడ ఇక్కడా వెతికితే కాదు మాత ముందు చూపు ఉండాలి. 
విశాలాక్షి: దీనికి శిక్షణ అవసరం లేదు ఎద్దులయ్య కాస్త విచక్షణ ఉంటే చాలు
హాసిని: కరెక్ట్ విశాలాక్షి నన్ను అంటారు ఈ తల్లీ కొడుకులు తింగరి అని కానీ వీల్లే అప్పం జప్పం
తిలోత్తమ: రేయ్.. పిచ్చివాళ్లతో మాటలేంటి.. మేము ఏం ఆలోచిస్తున్నామో మీకు తెలుసా
విశాలాక్షి: తెలుసు.. చుట్టుపక్కల పిల్లల చేతుల్లో ప్రసాదం పెట్టాలి అనుకున్నావ్ కదా
వల్లభ: మమ్మీ ఏం ప్రసాదం మమ్మీ
తిలోత్తమ: రేయ్ నువ్వు ఆగరా.. ఈ గారడి పిల్ల ఏం చెప్పాలి అనుకుందో సూటిగా చెప్పాలి
విశాలాక్షి: మీకు అర్థమైంది వీళ్లందరికీ అర్థమయ్యేలా చెప్పనా.. పసి పిల్లల చేతుల్లో ప్రసాదం పెట్టినట్లే పెట్టి నిప్పురవ్వలు వస్తాయో రావో అని తెలుసుకుందాం అనుకున్నావ్ కదా.. ఈ రాత్రికి మీకు నిద్ర పట్టదు. రేపు నేను ప్రశాంతంగా నిద్ర పోతా అది కూడా మీవల్లే. ఎద్దులయ్య శివనామస్మరణ చేసుకోవాలి
ఎద్దులయ్య: ఏర్పాట్లు చేశానమ్మా పదండి
హాసిని: గాయత్రీ అత్తయ్య కావాలా మీకు తీసుకోండి గాయత్రిని.. 
తిలోత్తమ: రేయ్ మనకు కావాల్సింది ఎక్కడో అనాధగా ఉన్న గాయత్రీ కాదురా. ఈ అనాధగా ఉన్న విశాలాక్షి గురించి తెలుసుకోవాలి. ఈ పిల్ల గురించి తెలిస్తే గాయత్రీ అక్క గురించి ఆటోమెటిక్‌గా తెలుస్తుంది.
నయని: ఆస్తి పేపర్లు విశాల్ చేతికి ఇస్తుంది 
విశాల్: ఏంటి నయని ఇలా రాశావ్
నయని: సంతకం కూడా చేశాను. రేపు ఎప్పుడైనా గాయత్రీ అత్తయ్య పాపగా మన ఇంటికి వస్తుంది కాదా తన కోసం మనం కష్టపడ్డ డబ్బు డిపాజిట్ చేస్తాతప్పితే ఇప్పటి వరకు ఉన్న ఆస్తి మాత్రం గాయత్రి, గానవిలకు మాత్రమే దక్కుతుంది. 
విశాల్: ఎందుకింత నిర్ణయం తీసుకున్నావ్
నయని: దత్తత తీసుకున్న గాయత్రిని నిర్లక్ష్యం చేస్తున్నామ్ అని కొందరు తనకి ఇచ్చిన ఆస్తిని తిరగి తీసుకుంటామని ఇంకొందరు అనుకుంటారు
విశాలాక్షి: లోకులు కాకులమ్మా. వాళ్ల అరుపులు పట్టించుకుంటే శాంతి కరవు అవుతుంది. 
విశాల్: విశాలాక్షి ఎవరు ఏం చేస్తున్నారు అని నీ ఉద్దేశం
విశాలాక్షి: అమ్మా ఆస్తి లెక్కలు తేల్చి సంతకం పెడితే.. నువ్వేమో నీ కన్న తల్లి ఎక్కడో ఉందని ఊర్ల పేర్లు రాస్తున్నావ్ కదా నాన్న.
నయని: నాకు అర్ధం కాలేదు బాబుగారు
విశాల్: విశాలాక్షి ఇది నీకెలా తెలుసు
విశాలాక్షి: చెప్పిండి నాన్న
విశాల్: అదే నయని మా అమ్మ, గానవి ఓకే రోజు పుట్టారు కదా తన వయసున్న చంటి పిల్లలు చుట్టుపక్కల ఏ ఊర్లో ఉన్నారో లిస్ట్ తెప్పించాను. కానీ ఈ విషయం విక్రాంత్‌కి తప్ప ఎవరికీ తెలీదు, తను చెప్పాడా?
విశాలాక్షి: చిన్న పిల్లను కదా అంచనా వేశాను.. నాన్న ఏమో ఏదీ సరిగ్గా చెప్పడం లేదు. నిన్ను అయోమయంలో పడేస్తూ తనకు తోచింది చేస్తున్నాడు
నయని: బాబు గారు ఏం చేస్తున్నారు. నా దగ్గర కూడా నిజం దాస్తున్నారా.. విశాలాక్షి తమాషా చేయదు. నాకు తెలీయని విషయం ఏదో ఉంది. 


మరోవైపు తాళపత్రాలు, గవ్వలు ముందు వేసుకొని విశాలాక్షి, ఎద్దులయ్య, గాయత్రి గవ్వలాట ఆడుతారు. ఇక అందరూ అక్కడికి వస్తారు. ఇక సుమన అయితే నాగులాపురం గవ్వలతో అష్టాచెమ్మా అడుతూ తాళపత్రాలను పడేశారు అని అంటారు. ఇంతలో విశాల్ అవి తన తల్లి పునర్జన్మ అని చెప్తాడు. విశాలాక్షి పర్లేదు అంటుంది. అందరూ అవి చిరిగిపోతే మళ్లీ సంపాదించలేమని బాధపడతారు.  అయితే ఆ తాళపత్రాలను చదవడానికి పెద్దబొట్టమ్మ రావాలి అని తిలోత్తమ అంటే మళ్లీ తనని రప్పిస్తారా అని సుమన అంటుంది. దీంతో ఎద్దులయ్య అవి చదవడానికి పెద్దబొట్టమ్మ మాత్రమే చదవాలా మన విశాలాక్షి అమ్మ చదివేస్తుంది అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక నయని నువ్వు చదవగలవా అని అడుగుతాడు. అయితే నయని తాళపత్రాలు చదవడానికి నియమాలు చెప్తుంది. దాంతో విశాలాక్షి రోజుకు ఒక్క తాళపత్రమే చదవాలి అంటే అందరూ షాక్ అవుతారు. ఆ విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతారు. తాళపత్రం చదివేందుకు విశాలాక్షి సిద్ధమవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply