Trinayani Serial Today Episode: 


విక్రాంత్: బ్రో విశాల్ బ్రోకి తెలీదు అంట నాన్న రివాల్వర్ తీసుకొస్తాడని.. 
తిలోత్తమ: ఎవడ్రా నాన్న.. నా ప్రాణం తీయాలి అనుకున్నవాడిని నాన్న అంటావా. 
విక్రాంత్: అమ్మా నాన్నకి నిన్ను చంపే ఆలోచన ఎందుకు వచ్చిందో ఇక్కడ నీకు తప్ప ఇంకా ఎవరికీ తెలీదు.
హాసిని: చెప్పండి అత్తయ్య మొదటి మామయ్య మిమల్ని సుమంగళిగా పంపించి ఎందుకు పుణ్యం కట్టుకోవాలి అనుకున్నారు.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్యని చంపింది తనే అని నేను నిజం చెప్పినందుకు నన్ను చంపాలి అని కక్ష కట్టుకున్నాడు. విశాల్ గుడ్డిగా నమ్మి ఇంట్లోకి తీసుకొచ్చినందుకు నన్ను టార్గెట్ చేశాడు.
విశాల్: అమ్మా నేను గంగాధర్ ఏం తప్పు చేయలేదు అని నమ్మినట్టే నిన్ను కూడా మా అమ్మ నమ్మే సెక్రటరీని చేసుకుంది కదా.
తిలోత్తమ: షాక్ అయి మనసులో.. ఇదేంటి వీడు ఇలా అంటున్నాడు. హత్యా నేరం చేసింది నేనే అని తెలిసిపోయిందా ఏంటి. 
విశాల్: నీకన్నా ముందే గంగాధరం మా అమ్మ దగ్గర డ్రైవర్‌గా పనిచేశాడు. నువ్వు ఎందుకు ఆ గంగాధరం భార్యవి అని మా అమ్మ దగ్గర దాచావో చెప్తే నయని ఆ మల్లెపూలు మ్యాటర్ చెప్తుంది. 
నయని: బాబు గారు 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు.
విశాల్: సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నువ్వు అయినా.. నేను అయినా.. అమ్మ అయినా.. కారణాలు ఎందుకు దాస్తున్నామో అందరికీ తెలిస్తే మనస్పర్థలు పోతాయి అని నా ఉద్దేశం. 
విక్రాంత్: చెప్పు అమ్మా.. చిన్న పిల్లలు అయిన మాకు నాన్న చనిపోయాడు అని ఎందుకు అబద్ధం చెప్పావు. బంగ్లాలో సెటిల్ అయిపోవచ్చు అనా..
పావనా: ఏంటి అక్కయ్య మర్చిపోయావా.. గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నవా.. 
తిలోత్తమ: ఏంటి అందరూ నన్ను తప్పు పట్టాలి అనుకుంటున్నారా..
సుమన: నేను అయితే ఏం అనుకోవడం లేదు అత్తయ్య. విశాల్ బావగారి వల్లే మీకు ఇలా జరిగింది అని.
తిలోత్తమ: ఆపేయ్.. సుమన.. నేను అయితే ఇప్పుడు చనిపోలేదు కదా.. రేయ్ పదరా..
హాసిని: ఒక్క నిమిషం అత్తయ్య.. గండం మీకు మాత్రమే గాయత్రీ పాపకు కూడా పోయినట్లే.. మనం ముచ్చట్టు ఆడుకుంటుంటే ఎంచక్కా పాలు తాగి పడుకుందో. 


మరోవైపు సుమన సెల్ చూసుకుంటుంటే.. విక్రాంత్ కోపడ్డతాడు. దీంతో సుమన తన కూతురు ఉలూచి రాత్రి పూట ఆడపిల్లలా ఉండదు కాబట్టి తనకు బిడ్డతో ఏ ఇబ్బంది ఉండదు కనుకే టైం దొరికి సెల్ చూస్తున్నా అంటుంది. అయితే విశాల్‌ను తన తల్లి తిలోత్తమ బ్లేమ్ చేయడం వల్ల తనకు ప్రశాంతత లేదు అని విక్రాంత్ అంటాడు. ఇక మరోవైపు తిలోత్తమ హాల్‌లో కూర్చొని ఉంటుంది. వల్లభ తనకి కట్టు కట్టాలని అన్ని సిద్ధం చేస్తుంటాడు. ఇంతలో ఏదో మందు తీసుకురావడానికి లోపలకి వెళ్తాడు. ఇంతలో గాయత్రీ పాప అక్కడికి వచ్చి తిలోత్తమ కట్టు కట్టడానికి ఉంచిన క్లాత్‌లో గవ్వను పెట్టేస్తుంది. అది తెలీక వల్లభ తిలోత్తమకు కట్టు కడితే తిలోత్తమ నొప్పితో విలవిల్లాడిపోతుంది. 


విశాల్: అన్నయ్య కట్టు మరీ గట్టిగా కట్టావా..
తిలోత్తమ: కట్టు కాదు.. ముళ్లులు గుచ్చినట్లు ఉంది.. గునపంతో గుచ్చినట్లు ఉంది.. తట్టుకోలేకపోతున్నాను. నొప్పి ఎక్కువ అవుతుంది విశాల్.. నా చేయి పడిపోయి పక్షవాతం వచ్చేలా ఉంది. (ఇక అది చూసి గాయత్రీ పాప నవ్వుకుంటుంది. మరో వైపు సుమన తన చేతిలో ఉలూచిని ఎత్తుకుంటూ వెళ్లి తిలోత్తమకు ధైర్యం చెప్తుంది. ఇంతలో ఉలూచి తిలోత్తమకు గాయం అయిన చోట తన చేతితో తాకితే ఒక్కసారిగా నొప్పి తగ్గిపోతుంది.) సడెన్‌గా నొప్పి ఆగింది.. ఇప్పుడు నొప్పి లేదు. 
విక్రాంత్: ఉలూచి అమ్మ చేతికి ఉన్న కట్టుని పట్టుకుంది.( ఉలూచి చేయి తీయగానే తిలోత్తమ నొప్పితో విలవిల్లాడిపోంతుంది.)
నయని: ఉలూచి పట్టుకున్నప్పుడే నొప్పి తగ్గుతుంది అంటే ఆ కట్టులోనే ఏదో ఉంది బాబు. 
ఇక విశాల్ కట్టు విప్పుతాడు. అందులో గవ్వ ఒకటి ఉంటుంది. అందరూ వల్లభ కట్టాడు అనుకుంటారు. 
సుమన: ఉలూచి పట్టుకోగానే నొప్పి ఆగిపోయింది అంటే గవ్వలో ఏదో శక్తి ఉంది.
నయని: అసలు నాగులాపురం పెట్టెలో ఉండే గవ్వను ఎవరు బయటకు తీశారు. 
విక్రాంత్: వదినా నేను తీసుంటే చెప్తే వాడిని.. అయినా ఐదు గవ్వలకు బదులు ఒకటే ఉంది. 
పావనా: పిల్లలు తీసేసుంటారు లేమ్మా.
విశాల్: ఆ పెట్టే తెరవాలి అంటే బలం కావాలి. 
హాసిని: (విశాల్‌కు గాయత్రీ పాపే అని సైగ చేస్తూ) కండ బలం కంటే బుద్ధి బలం ఉండేవాళ్లే ఇలా చేసుంటారు విశాల్.
విక్రాంత్: ఉలూచి పాపకి ఆ గవ్వకు ఏం సంబంధం ఉందో తెలుసుకోవాలి. 


మరోవైపు గాయత్రీపాపను అక్కడి నుంచి తీసుకెళ్లిన నయని.. పాప దగ్గర బొమ్మలు పెట్టి ఆడుకోమని చెప్పి.. తిలోత్తమ అత్తయ్య ఉండే దగ్గరకు వెళ్లొద్దు అని చెప్తుంది. ఇక అప్పుడే అక్కడి వచ్చిన హాసిని.. నువ్వు అలా ఎందుకు అంటున్నావో తెలుసు చెల్లి. తిలోత్తమ అత్తయ్యకు ఏం జరిగినా అక్కడ గాయత్రీ పాప ఉండటం వల్ల అందరూ పాప మీద నింద వేస్తారు అనే కదా నీ భయం అని అడుగుతుంది. దీంతో అవును అని నయని చెప్తుంది. ఇక సుమన అక్కడికి వచ్చి ఉలూచికి, నాగులాపురం గవ్వలకు ఏదో సంబంధం ఉంది అని విక్రాంత్ అడిగితే ఎందుకు ఏం చెప్పలేదు అని తన అక్క నయనిని అడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.