Trinayani Serial Today Episode


తిలోత్తమ రెండో పెళ్లిరోజు వేడుకలకు మొదటి భర్త గంగాధర్ వస్తాడు. గాయత్రీ అమ్మగారే తిలోత్తమ పాపాలను కడిగేస్తారు అని గంగాధర్ అంటాడు. దీంతో తిలోత్తమ ఇలా అనే జీవితాన్ని నాశనం చేసుకున్నావు మామ అంటుంది. ఇక అఖండ స్వామి గాంగాధర్ చేతిలో ఉన్న బ్యాగ్ చూసి దాని వల్లే తిలోత్తమకు గండం పొంచిఉంది అని గ్రహించి ఆమెకు జాగ్రత్తలు చెప్తారు. కోపం తెప్పించేలా మాట్లాడొద్దు అని సూచిస్తారు. 


తిలోత్తమ: విశాల్ ఎందుకు నమ్ముతున్నారో ఏమో తెలీదు కానీ ఇతన్ని ఇక్కడికి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. గాయత్రీ అక్కయ్య లేని లోటుని నేను పూడ్చాను అని నా మీద కోపం ఆయనకి. అది మనసులో పెట్టుకొని చాలా సార్లు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. మారు వేశంలో మా దగ్గరే ఉండి నన్ను కడతీసే ప్రయత్నం కూడా చేశారు.
గంగాధర్: అదంతా గతం వదిలేసేయ్.. జగదీష్‌ బాబుని పెళ్లి చేసుకొని విశాల్ బాబు, నయని అమ్మల అండతో అందనంత స్థాయిలో ఉన్నావు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. బాబు రమ్మన్నారు అందుకే వచ్చాను. 


ఇక గంగాధర్ తిలోత్తమ పెళ్లి రోజు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా గిఫ్ట్ ఇవ్వొచ్చా అని అడుగుతాడు. ఇక అఖండ స్వామి తీసుకోవద్దు అని హెచ్చరిస్తాడు. గంగాధర్ బ్యాగు నుంచి మల్లెపూలు తీస్తాడు. అదిచూసి నయని ఫ్యామిలీ షాక్‌కు గురవుతారు. ఎందుకంటే మల్లెపూలు వల్లే గండం వస్తుంది అని నయని చెప్తుంది. ఇంతలో సుమన మా అక్క చెప్పిన మల్లెపూలు గండం ఇదేనా అని వల్లభను అడుగుతుంది. ఇక తిలోత్తమ అవి తీసుకోవడానికి నిరాకరిస్తుంది. నయని అయితే గంగాధర్‌ని వెళ్లిపోమని చెప్తుంది. విశాల్ అడ్డుకుంటాడు. ఇక గంగాధర్ కేక్ కటింగ్ టైంలో గన్ తీసి తిలోత్తమ మీదకు గురిపెడతాడు. అది చూసిన నయని తిలోత్తమను పక్కకు లాగేస్తుంది. దీంతో బులెట్ తిలోత్తమ చేతికి తగిలి రక్తం గాయత్రీ దేవి ఫొటోమీద పడుతుంది. అందరూ కంగారు పడతారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు.


గురువుగారు: పూర్తిగా సత్యం చెప్పకపోయినా తప్పే స్వామి.. 
అఖండ: జరగాల్సింది ఇదే అని తెలుసుకాబట్టే వివరంగా చెప్పలేదు గురువుగారు
డమ్మక్క: ధర్మం వైపు ఒకరు.. అధర్మం వైపు మరొకరు ఉన్నా మీ ఇద్దరి ఆశయం ఒకటే.. 


మరోవైపు సుమన రూమ్‌లో అద్దం ముందు రెడీ అవుతుంటే విక్రాంత్ వచ్చి తిడతాడు. హాస్పిటల్‌కి వచ్చి చూడాలి అని లేదా అని కోప్పడతాడు. 
సుమన: పైకి మంచిగా కనిపించే మహానుభావుడే ఈ రోజు మీ అమ్మకి ఈ పరిస్థితి పడ్టడానికి కారణం అయ్యాడు. ఇంకెవరు మా అక్క మొగుడు మీ బ్రో విశాల్ బావగారు..
విక్రాంత్: తనేం చేశాడు.
సుమన: ఏం తెలీనట్లు అడగొద్దు.. అందరి కళ్ల ముందే మీ నాన్న మీ అమ్మను తుపాకితో కాల్చేయడానికి కారణం మీ నాన్న కాదు.. గాయత్రీ అత్తయ్యగారి ఏకైక పుత్రుడు విశాల్ బావగారు. అత్తయ్య క్షేమంగా ఇంటి వచ్చిన తర్వాత అత్తయే ఈ మాట అనకపోతే నేను గుండు అవుతా అని సమన ఛాలెంజ్ విసురుతుంది. 


ఇక హాసిని గాయత్రీ పాపతో..  గాయత్రీదేవి ఫొటో మీద పడిన రక్తాన్ని శుభ్రం చేయిస్తుంటుంది. ఇక ఇన్ని రోజులు పాలు, తిండి లేని గాయత్రీ పాప ఇప్పటి నుంచి పాలు తాగి తిండి తింటుంది అని హాసిని అంటుంది. దీంతో నయని షాక్ ఎందుకు అలా అని అడుగుతుంది. దీంతో పావనామూర్తి గండం పూర్తయింది కదా అందుకే అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. 


ధురందర: పిల్లకు గండం ఉంటేగా.. ఉన్నది పాపం తిలోత్తమ వదినకు.
హాసిని: పాపం అని జాలిపడాల్సిన పనిలేదు పిన్ని. తన రక్తం ఫొటో మీద చిందినందుకే గాయత్రీ పాపకు నయం అయి పాలు తాగి తిండి తింటుంది. 
విక్రాంత్: ఆశ్చర్యంగా ఉంది బ్రో. అయితే అమ్మకు అలా జరగడం వల్ల మంచే జరిగింది అన్నమాట.
సుమన: అత్తయ్య రక్తం చిందితే తప్ప ఈ పిల్ల కడుపులోకి తిండి వెళ్లదన్నమాట. చూశావా అక్క నువ్వు దత్తత తీసుకున్న పిల్లకు రాక్షస లక్షణాలు ఉన్నాయి. 
హాసిని: చిట్టీ ఉలూచిని కూడా తీసుకురా తనతోని గాయత్రీ అత్తయ్య ఫొటో క్లీన్ చేయిస్తా. 
సుమన: నా కూతురుని ఈ పిల్లలా పనిమనిషిని చేయడం నాకు ఇష్టం లేదు అక్క.
పావనా: గాయత్రీ పాప జాతకం తెలిస్తే నోరెళ్లబెడతావు అమ్మా.
 
ఇంతలో తిలోత్తమ ఇంటికి వస్తుంది. ఇక డిశ్చార్జ్ చేశారు అని తెలుసుంటే నేను వచ్చేవాడికి కదా అని విశాల్ అంటే దానికి తిలోత్తమ నా చావును నువ్వు కోరుకున్నావు కదా ఇప్పుడు నాకు సాయం చేయడానికి వస్తాను అంటావా అని అడుగుతుంది. దీంతో విశాల్ షాక్ అవుతాడు. మరోవైపు వల్లభ కూడా తన తల్లికి ఇలా అయిందని సీరియస్ అవుతాడు. ఇక తిలోత్తమ నయనిని తిడుతుంది. పాపకు గండం అని చెప్పి వేరే వాళ్ల మీదకు మళ్లింది అని చెప్పిందే కానీ తనకే గండం అని చెప్పలేదు అని అంటుంది. దీనికి సుమన బయట వాళ్లకు గండం అయితే కాపాడే మా అక్క అత్తయ్యకు గండం అని చెప్పి ఉంటే ముందే జాగ్రత్త పడేవాళ్లం కదా అంటుంది. ఇక విక్రాంత్ గంగాధర్ గురించి మాట్లాడుతూ నాన్న అంటే తన ప్రాణాలను తీయాలి అనుకున్న వాడిని నాన్న అంటావా అని తిలోత్తమ సీరియస్ అవుతుంది. ఇంతతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read : విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్