Trinayani Serial Today Episode దురంధరకి సీమంతం ఏర్పాటు చేస్తారు. నయని గట్టు రట్టు చేయడానికి నయని వండిన పాయసంలో తిలోత్తమ విషం కలుపుతుంది. ఆ విషయం తెలియక పావనా మూర్తి దురంధరకు తినిపించేస్తాడు. బాగుందీ అని మరో స్పూన్ అడిగి మరీ తింటుంది దురంధర. తర్వాత దురంధర కళ్లు తిరిగి పడిపోతుంది. దురంధర నోటి నుంచి రక్తం రావడంతో అందరూ తెగ కంగారు పడతారు. విశాల్ వాళ్లు దురంధరని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. 


దురంధర కోలుకున్న తర్వాత త్రినేత్రి పిన్ని ట్యాబ్లెట్స్ అని ఇస్తుంది. దురంధర భర్తలో ఈ ఇంట్లో ఎవరు ఏం ఇచ్చినా తీసుకోవడానికి భయంగా ఉందని చెప్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. అనుమానిస్తున్నావా అని తిలోత్తమ అడుగుతుంది. ఇక మా అక్క ఎలా ఉంది అని సుమన అడుగుతుంది. అదేంటి అలా అన్నావ్ అని అందరూ అంటే ఇంట్లో ఉన్నది నయని అక్కనా లేక కొత్త అక్క త్రినేత్రినా అని సుమన అంటుంది.


విక్రాంత్: ఏదో ఒకటి అనేసి ఇంట్లో గొడవ రేపకపోతే నీకు మనస్శాంతి ఉండదా. 
తిలోత్తమ: సుమన అన్నదాంట్లో అర్థముంది ఇప్పుడు ఎవరూ పరీక్ష పెట్టకుండానే తను నయని కాదని తేలిపోయింది. ఎందుకంటే నిజంగా తను నయని అయితే పాయసంలో విషం ఉందని ముందే కనిపెట్టేది కదా. 
పావనా: అవును కదా.
దురంధర: అవును కదా విష్. 
తిలోత్తమ: ఇంకా ఆలస్యం చేస్తే ఈ ఇంటిని గుల్ల చేసేస్తుంది.
విక్రాంత్: అమ్మా ఏం మాటలు అవి.
త్రినేత్రి: ఒక్క నిమిషం ఆగండి బాబు నేను సమాధానం చెప్తా. నిజమే మీరందరూ అన్నట్లు నేను నయని కాదు. నేను నయని అని బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం ఎవరికీలేదు కూడా. 
తిలోత్తమ: నువ్వు నయని కాకపోతే త్రినేత్రి అని చెప్పి ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉంటావ్ పదవే.
త్రినేత్రి: ఆగు మీరు నా మీద అనుమానాలతో ఇన్ని రోజులు పరీక్షలు పెడుతున్నా నేను మీ అగడాలు భరిస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా దురంధర పిన్ని ప్రాణాలు ఎందుకు తీయాలి అనుకున్నారు. కడుపులో పసి ప్రాణం ఎదుగుతుంది అన్న జ్ఞానం లేకుండా అలాంటి దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టారు. ఆపద వస్తే నయని పసిగడుతుందా లేదని అలాంటి ప్రయోగాలు చేస్తున్న మిమల్ని ఈ ఇంటి నుంచి గెంటేయాలి. 
వల్లభ: ఏంటి మమ్మీ కథ అడ్డం తిరిగింది.
విశాల్: అమ్మా నయని ఏ మాట ఊరికే అనదు.
విక్రాంత్: బ్రో వదిన మనసులో ఏముందో తెలీదు కానీ మా అమ్మ మనసులో మాత్రం విషం ఉందని అర్థమైంది. 
పావనా: ఏంటి అక్కాయ్ మాకు పిల్లలు పుట్టడం నీకు ఇష్టం లేదా
తిలోత్తమ: పావనా మూర్తి ఆధారం లేకుండా ఆరోపించకండి.
విక్రాంత్: సరే మీరు ఏ ప్రయోగాలు చేయలేదు అనుకుందాం ఇక మిగిలింది మేమే కదా మాలో ఎవరో ఒకరు అత్తయ్య మీద ప్రయోగం చేసుండాలి.
త్రినేత్రి: నేను ఎవరో చెప్పాను ఇక నా మీద ప్రయోగాలు చేయడం మానేయండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో అది చెప్పనివ్వండి. ఇంట్లో నుంచి దేవీపురం బయల్దేరిన నయని కారు యాక్సిడెంట్ అయిందని మాత్రమే మీరు మాట్లాడుకుంటున్నారు కానీ ఆ తర్వాత రోజు కారు బ్రేక్ ఫెయిల్ అయి డ్రైవర్ హరి చేయి విరిగింది అని మీకు తెలుసా. 
హాసిని: అందుకేనా డ్రైవర్ రెండు వారాల నుంచి రావడం లేదు.
త్రినేత్రి: ఆ విషయాలు అన్నీ మీ పెంపుడు తల్లిని అడగండి బాబు సరైన సమాధానం చెప్తారు.
విక్రాంత్: ఏమ్మా నీకు తెలుసా.
తిలోత్తమ: తెలుసు అంటే 
విశాల్: అమ్మా మా దాకా రాకుండా ఈ విషయం ఎందుకు దాచారు.
తిలోత్తమ: నయనికి ఇలా అయిందని బాధలో ఉంటే మళ్లీ డ్రైవర్ గురించి ఎందుకని చెప్పలేదు.
త్రినేత్రి: సరే ఇప్పుడు చెప్పండి నేను ఎవరిని.
తిలోత్తమ: నువ్వు నయనివే త్రినేత్రివి కాదు ఇక పరీక్షలు చేయము రేయ్ పదరా.


నయని గాయత్రీ పాపని ఎత్తుకొని విక్రాంత్‌తో బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. అందరూ వాళ్ల దగ్గరకు చేరుకొని నయనివా త్రినేత్రివా అంటే నయని నేనే త్రినేత్రినే అని అంటుంది. గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో కష్టపడిని వారికి ప్రతిఫలం దక్కేలా చేయాలని అనుకుంటున్నానని చెప్తుంది. ఇక వల్లభ అందరితో సాయంత్రం నుంచి పెద్ద మరదలు గాయత్రీని ఎత్తుకొనే ఉంటుందని అంటాడు. దానికి నయని ఒంట్లో నేను ఉండాలి అంటే తప్పదు అని అంటుంది. నవ్వు చెప్పేది ఏం అర్థం కాలేదని అందరూ అంటారు. ఇక నయని గాయత్రీ దేవి దగ్గర పని చేసిన వాళ్లు పేర్లు చెప్పి వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేయమని  అంటుంది. తిలోత్తమ బిత్తర పోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రాజీనామాని తాత ముఖం మీద విసిరి కొట్టిన కార్తీక్.. దీపే సర్వస్వం అని తేల్చేశాడుగా!