Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శివనారాయణ, జ్యోత్స్న, దీప, కార్తీక్‌లు ఆఫీస్‌లో కలుసుకుంటారు. శివనారాయణ తనకు దీపే మనవరాలు అయింటే తనకు ఇంత బాధ పెట్టి తన మనవరాలికి అన్యాయం చేసినందుకు బస్‌స్టాప్‌లో వదిలేసేవాడిని అని అంటాడు. దానికి కార్తీక్ దీప లాంటి మనవరాలు పుట్టాలి అంటే మీరు ఎన్నో తరాలుగా అదృష్టం చేసుకోవాలని మీకు అంత లేదు అని అందుకే ఇలాంటి మనవరాలు పుట్టిందని జ్యోత్స్నని చూపించి అవమానిస్తాడు. దీప తన సర్వస్వం అని చెప్తాడు.  దీపని దగ్గరకు తీసుకుంటాడు. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. 


దీప చేయి పట్టుకొని ఈ చేయి జీవితాంతం వదలను తనకు తోడుగా ఉంటాను అని అంటాడు. ఇక శివనారాయణతో మీ దగ్గర పని చేయను అని రాజీనామా ఇచ్చేస్తాడు. అందరకీ గుడ్ బాయ్ అని చెప్పేస్తాడు. దీపని క్యారేజ్ తీసుకొని వచ్చేయమని అంటాడు. ఇక జ్యోత్స్న బావని ఆపు అని తాతతో చెప్తే నేను ఛైర్మన్‌గా వాడి రాజీనామా యాక్సెప్ట్ చేస్తున్నా వాడు ఎక్కడికి వెళ్లినా నా దగ్గరకే వస్తాడు అంటాడు. జ్యోత్స్న మనసులో నీ ఆవేశంతో బావని నువ్వే నాకు దూరం చేస్తున్నావ్ అని అనుకుంటుంది. పారిజాతం దాసు ఇంటికి వెళ్లి స్వీట్స్ ఇస్తుంది. కార్తీక్‌ని కంపెనీ నుంచి బయటకు గెంటేశారు అని నా మనవరాలి కింద పని చేయలేక కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయాడని అంటుంది. స్వప్న అదిరిపోయింది కౌంటర్ అని గుడ్ న్యూస్ అని స్వీట్స్ తింటుంది ఇదేంటి అని అంటే తలనొప్పి వదిలిపోయిందని స్వప్న అంటుంది. ఇక పారిజాతం దీప అనాథని అంటే దీప అనాథ కాదు దానికి మేం ఉన్నాం అని దాసు అంటాడు. దీప నష్టజాతకురాలు అని పుట్టగానే తల్లి పోయింది తర్వాత తండ్రి పోయాడని జ్యోత్స్నకి అన్యాయం చేసిన ఆ దీప బాగు పడకూడదని పారిజాతం అంటుంది. 


దీప, కార్తీక్ ఓ చోట ఆగుతారు. సీఈఓ పోస్ట్ నుంచి తీసేసి తనని అవమానించారని కార్తీక్ అంటాడు. తనకు ఏ పోస్ట్ ఇవ్వాలో తెలీక ఏదో ఒకటి ఇచ్చారని నా సంతకాలు కూడా తీసుకోకుండా నన్ను అవమానించారని అంటాడు.అందుకే ఆ పోస్ట్ వద్దు ఆ కంపెనీ వద్దని వదిలేశానని అంటాడు. దాంతో దీప కంపెనీ నుంచి బయటకు రావడం అంటే ఆ కుటుంబం నుంచి బయటకు రావడమే అంటుంది. అలాగే వచ్చేశాను అని కార్తీక్ అంటాడు. దాంతో దీప నేను మీ నుంచి దూరంగా వెళ్లిపోతాను అని మిమల్ని మీ కుటుంబానికి దూరం చేశానని అంటుంది. నేను అనాథ కాదని మీరు ఉన్నారని చెల్లి, బావ ఉన్నారని మీ అత్త అనసూయ ఉందని అంటాడు. మీలా మీ అమ్మ అనుకోలేరని దీప అంటుంది.  దానికి నేనే కారణం అవుతున్నానని దీప ఏడుస్తుంది.


జ్యోత్స్నని పెళ్లి చేసుకొని ఉంటే ఇంత బాధ ఉండేది కాదని మీ ఇద్దరి కోసం రెండు కుటుంబాలు ఎంతో ఆశపడ్డాయని ఏడుస్తుంది. అలా జరగలేదు అని నేను బాధ పడుతున్నా అని చెప్తుంది. మీరు జ్యోత్స్నని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయని అంటే కార్తీక్ దీప చేయి పట్టుకొని పద వెళ్లి సంబంధం మాట్లాడుదామని అంటాడు. భర్తకి మరదలికి ఇచ్చి పెళ్లి చేస్తే అందరూ నిన్ను సన్మానిస్తారని అంటాడు. నాకు జ్యోత్స్న అంటే ఇష్టం లేదు అని కార్తీక్ అంటాడు. నువ్వు అంటే నాకు ఇష్టం అని నువ్వు నాకోసం చేసే ఏ పని అయినా నాకు ఇష్టం అని విలువైన నిన్ను సంపాదించుకున్నానని అంటాడు. ఇప్పటికైనా జరిగింది అంతా అత్తకి చెప్పమని దీప అంటుంది. కార్తీక్ చెప్పడానికి ఒప్పుకోడు. ఇక కాంచన, అనసూయలు హాల్‌లో ఉంటే దీప, కార్తీక్‌లు వస్తారు. ఇద్దరూ ఏం మాట్లాడకుండా ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మొగుడుపెళ్లాల ఉగ్రరూపం.. గజగజ వణికిపోయిన జ్యోత్స్న, పారిజాతం.. కార్తీక్‌కి డౌట్!