Trinayani Telugu Serial Today Episode :
తిలోత్తమ: ఏం చెప్పను స్వామి.. దత్త పుత్రిక గాయత్రీని మార్చే ప్రయత్నం చేశాం స్వామీ కానీ ఫలితం లేకుండా పోయింది
అఖండ: బియ్యం ఒకటే అయినా సందర్భం బట్టి అవి అన్నంగా, తలబ్రాలగా.. నూకలుగా.. అక్షింతలుగా మారుతాయి. గాయత్రీ విషయంలో జరిగింది అదే.. ముందు అలా ఎందుకు జరిగిందో ఆలోచించండి
తిలోత్తమ: నాగులాపురం పెట్టె మీద పెట్టిన బియ్యం సడెన్‌గా పెట్టె మూత తెరచుకోవడంతో నామీద బియ్యం పడింది.
అఖండ: జరిగింది మీరు సూచన ప్రాయంగా తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవడమే
తిలోత్తమ: ఇంకేమైనా జరగనుందా స్వామి
అఖండ: మూడు నిమిషాలు కళ్లు మూసుకుంటే మకే అర్థమవుతుంది
తిలోత్తమ: కళ్లు మూసుకుంటే ఏమీ కనిపించదు మీరు మాత్రం వినిపిస్తుంది అంటున్నారు..
అఖండ: తిలోత్తమ కళ్లు మూసుకొని ఏకాగ్రతతో వినుంటే మరణ మృదంగం వినిపించేది. గండం మార్గం మార్చుకొని గ్రహను పట్టింది. జరిగింది ఆట. జరగబోయేటి అంతటా.. వెళ్లిపోండి
మరోవైపు ఎద్దులయ్య నయని దగ్గరకు వచ్చి ఏమైనా సాయం చేయాలా అని అడుగుతాడు. అతిథిలు మనతో కలిసిపోయారు అని పనులు చెప్పకూడదు అని నయని అంటుంది. ఇంతలో నయనికి తన అత్తయ్య గాయత్రీ దేవి ఫొటో మీద రక్తం పడటం కనిపిస్తుంది. దీంతో నయని కంగారు పడుతుంది.
ఎద్దులయ్య: ఏమీ లేదు అంటే నేను అలా గుడికి వెళ్లొస్తా మాతా
నయని: ఒక్క నిమిషం ఎద్దులయ్య.. మీరు శివభక్తులు కాబట్టి.. నాకు కనిపించిన దానికి అర్థం అడుగుదామని అనుకుంటున్నా.
ఎద్దులయ్య: ఏం కనిపించింది మాతా ఎదురుగా నేను ఉంటే..
నయని: రక్తం కనిపించింది.. కలలో.. కాదు కాదు గాయత్రీ అమ్మగారి ఫొటో పైన
ఎద్దులయ్య: మాతా ఒకరి ప్రాణం పోతుంది మాతా.. ఎవరికైనా గండం వస్తే ముందే నీకు తెలుసు కదా.. ఈ సారి ఆపద ఎవరికో అంతుపట్టక అయోమయానికి గురయ్యావు. అంతే కదా మాతా..
నయని: ఎవరికి ఏం జరుగుతుందో.. ఇంట్లో ఆపద వస్తుందోనని భయమేస్తుంది.
ఎద్దులయ్య: ఇంట్లో ప్రాణ గండం ఉంది మాతా.. అది ఎవరు అన్నది తెలీదు. కానీ మృత్యువు ఎవ్వరినీ వదలదు.
నయని: అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా.
ఎద్దులయ్య: ఒక్క నిమిషం ఆగు మాతా.. గాయత్రీ అమ్మ గారి పటం మీదే రక్తం పడింది అంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి..
నయని: ప్రమాదం ఇంట్లో వాళ్లకా.. పునర్జన్మ ఎత్తిన గాయత్రీ గారికా.. తనకైతే నాకు ముందే తెలీదు కదా.. ఎంతో అంతా అయోమయంగా ఉంది.
ఎద్దులయ్య: ఊహించనివి జరుగుతాయి మాతా.. సిద్ధంగా ఉండండి..
మరోవైపు విశాల్ గాయత్రీపాపకు అమ్మవారి తీర్థం తాగిస్తాడు. ఇక పావనామూర్తి భార్య అయితే గాయత్రీ అక్కయ్య పేరు పెట్టుకున్నందుకు ఈ పాప కూడా అక్కయ్యలా తీర్థం తాగుతూ ఉంది అని అంటుంది.
హాసిని: గాయత్రీ అత్తయ్య కూడా ఏం తినలేదు కదా..
పావనామూర్తి: గాయత్రీ అక్కయ్య దేవినవరాత్రల అప్పుడు తొమ్మిది రోజులు కేవలం తీర్థం తీసుకొనే ఉండేది. అంత కఠోర దీక్ష ఆ అమ్మకే సాధ్యమైంది
హాసిని: నాకు ఎందుకో ఆ పిల్ల తాగేది తులసి తీర్థం అనిపిస్తుంది. మీకు అర్థం కాలేదు బావగారు.
వల్లభ: నాకే అర్థమైంది మీకు అర్థం కాలేదా.. పసిబిడ్డ పుటుక్కుమనే ముందు తులసి తీర్థం గుటకలేస్తుందీ అని
విశాల్: అన్నయ్య ఏం మాట్లాడుతున్నావ్
నయని: ఇంకా నూరేళ్ల జీవితం ఉన్న పసిబిడ్డ కోసం అలా మాట్లాడటానికి మీకు నోరు ఎలా వచ్చింది.
తిలోత్తమ: ఫీలవకు నయని.. అన్నం పెట్టినా తినదు.. పాలు తాగదు తీర్థం మాత్రమే తీసుకుంటుంది అంటే.. అర్థం ఇంకేమై ఉంటుంది అని అనుకుంటున్నారు.
డమ్మక్క: ఈ శతాబ్దం దాటి ఉన్న బిడ్డ కోసం అటు ఉంచండి.. రేపో మాపో తులసి తీర్థం తీసుకోనున్నది ఎవరో ఏంటో..
వల్లభ: ఊరుకోండి డమ్మక్క మాటలు పట్టించుకోకండి..
డమ్మక్క: చితి పెట్టించుకోవడం ఖాయం పుత్రా
నయని: శివభక్తురాలివి కాబట్టి ఏం జరగనుందో చెప్పగలుగుతున్నావు డమ్మక్క.
హాసిని: చెల్లి అంటే నీకు కూడా అలానే అనిపించింది అన్నమాట
విక్రాంత్: వదినకు అనిపించింది అంటే కచ్చితంగా జరుగుతుంది
సుమన: డమ్మక్క మంచి మాటలు చెప్పకుండా ఇలా చావు గురించి మాట్లాడుతుంది. దానికి మా అక్క వత్తాసు పలుకుతుంది.
డమ్మక్క: వాస్తవం కాబట్టి చెప్పింది..
విశాల్: నయని మనలో మృత్యువు వైపు అడుగులు వేస్తుంది ఎవరు..
హాసిని: అందరికీ జాగ్రత్త పడమని చెప్తుంది అంటే తన తప్ప అందరికీ ప్రమాదం ఉందనే కదా
నయని: భయపెట్టాలి అనుకుంటే నువ్వే చనిపోతావని ఆ విషయం నీకే చెప్పేదాన్ని కదా..
డమ్మక్క: శివుడు ఆడే ఆటలు ఇలాగే ఉంటాయి. విశాలాక్షి అమ్మవారు ఏంటయ్యా ఈ చలగాటం అంటున్నా సరే కాలగర్భంలో పుట్టుక ఉండదని.. చావుతోనే ముగుస్తుందని అర్థం
విశాల్: అన్నయ్య మీ భయం ఏంటి
వల్లభ: ప్రమాదం జరుగుతుందని తెలిసే వచ్చాం
నయని: నేను చెప్తే నమ్మలేదు. ఎవరో చెప్తే నమ్ముతున్నారా
సుమన: చావు వస్తే మాత్రం బతికున్న వారికి మాత్రమే తెలుస్తుంది.
విక్రాంత్: వదిన ఎవరికి హాని కలుగుతుందో మీకు ముందే తెలుస్తుంది కదా
నయని: రక్తం చిందుతుంది అని సూచన వచ్చింది బాబు కానీ అది ఎవరిది అనేది ఇంకా తెలీడం లేదు.
సుమన: నేను అంటే ఫీలవుతారు గానీ మన రక్తం కానీ ఈ గాయత్రీ పాప
విశాల్: ఇక ఆపేయ్ సుమన ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వే పదే పదే అలాగే అంటే నీ మాతృత్వానికి మచ్చ పడినట్లే
నయని: ఎవరు ఎలా చెప్పినా కానీ నేను చెప్పిన విషయాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోండి..
డమ్మక్క: మరణ మృదంగం మోగబోతుంది. మీలో ఒకరు మృత్యు ఒడిలోకి జారడం ఖాయం.
మరోవైపు సుమన ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి విక్రాంత్ వస్తాడు. ఇక గాయత్రీ పాప రెండు రోజులు తినకుండా ఎలా ఉందా అని విక్రాంత్‌తో చెప్తుంది. ఆ పాపకి నిజంగా గండం ఉంటుందా అని అడుగుతుంది. ఇక నయని ఇంట్లో వాళ్లకి గండం ఉందని అందర్నీ భయపెడుతుంది అని అంటుంది. నయని సీక్రెట్‌గా ఆ పాపకి తినిపించేస్తుంది అంది అందరి ముందు తినడం లేదు అని నాటకం ఆడుతుందని సుమన అంటుంది. ఇక విక్రాంత్, సుమన మాటల యుద్ధం చేస్తారు. మరోవైపు డమ్మక్క గాయత్రీ పాప దగ్గర కూర్చొని జాతకం చూస్తూ ఏవో లెక్కలు వేస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.