Trinayani Serial Today Episode విగ్రహం మీద కారం పొడిని ఎవరు కడుగుతారు అని విశాలాక్షి అడిగితే తిలోత్తమ నయని కడుగుతుందని అంటుంది. ఇంతలో విశాల్ తాను కడుగుతాను అని విగ్రహం కడిగితే అభిషేకం చేసినట్లే అని అంటాడు. దానికి డమ్మక్క విశాల్ ముందుకు వచ్చాడు కాబట్టి తామర పువ్వు అతనికే చెందుతుందని అంటుంది. విశాలాక్షి ఆ తామర పువ్వుని విశాల్‌కి ఇస్తుంది. దాని ప్రత్యేకత ఏంటి అని సుమన అడిగితే చాలా ఉందని డమ్మక్క అంటుంది. ఇక గాయత్రీ దేవి పునర్జన్మ గురించి మాట్లాడుతారు. దానికి సుమన పునర్జన్మ ఎత్తినా ఇప్పటి వరకు జాడలేదని అంటుంది.


వల్లభ: అప్పుడప్పుడు పెద్దమ్మ ఆత్మలా నయనికి కనిపిస్తున్నా కన్నకొడుకు విశాల్‌కి మాత్రం ఎందుకో పలకరించడం లేదు. 
విక్రాంత్: బ్రో చూడలేడు మాట్లాడలేడు కదా.
విశాలాక్షి: రేపు నాన్న విశాల్ గాయత్రీ దేవి మాటలు వింటాడు. అందరూ షాక్ అయిపోతారు. 
విశాల్: సంతోషంతో విశాలాక్షి ఏంటమ్మా నువ్వు అనేది మా అమ్మ మాటలు నేను వింటానా అదే నిజం అయితే నా జన్మ ధన్యమైనట్టే. నయని మా అమ్మ గొంతు వినబోతున్నాను.
వల్లభ: తమ్ము తమ్ము గారడీ పాప ఏదో అంటే నిజం అనుకోకు.
డమ్మక్క: అమ్మ విశాల్ బాబుకి ఇచ్చిన తామరపువ్వు వల్ల రేపు గాయత్రీ దేవి మాటలు వింటాడు.  
విశాలాక్షి: అయితే రేపు మీ అమ్మ నువ్వు అడిగే మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తుంది నాన్న ఆ సమాధానాలు నువ్వు తప్పు మరెవరూ వినలేరు నాన్న. ఆ తర్వాత ఆ పువ్వు నిష్ప్రయోజనం అవుతుంది.
విశాల్: విశాలాక్షి ఈ పువ్వు ఎలా ఉపయోగించాలో చెప్పమ్మా. 
విశాలాక్షి: మీ అమ్మ చెప్తుంది నయని పాటిస్తుంది. 


ఉదయం అందరూ హాల్లోకి చేరుకుంటారు. డమ్మక్క ఒక్కర్తే వచ్చి విశాలాక్షి రాకపోవడంతో తిలోత్తమ విశాలాక్షి భయపడి పారిపోయిందని అంటుంది. ఇక సుమన పువ్వు పట్టుకొని తిరుగుతారా బావగారు వాడిపోతుందని అంటుంది. ఇక గాయత్రీ దేవి వస్తుందని డమ్మక్క అంటుంది. గాలి పెద్దగా వీస్తుంది. అందరూ గాయత్రీ దేవి వస్తుందని అంటారు. ఇక నయని తిలోత్తమ అత్తయ్య వెనక గాయత్రీ దేవి ఉన్నారని అంటుంది. అందరూ చూస్తారు కానీ కనిపించదు. తిలోత్తమ భయంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే తిలోత్తమకు గాయత్రీ దేవి కనిపిస్తుంది. అమ్మ వచ్చిందా అని విశాల్ ఎమోషనల్ అవుతాడు.


విశాల్: అమ్మతో మాట్లాడుతా నయని అమ్మ మాట వినాలని ఉంది. 
గాయత్రీదేవి: భయపడకు తిలోత్తమ నా కొడుకు సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను ఏం చేయను. నీ వల్ల తను బాధ పడితే మాత్రం నిన్ను వదలను అర్థమైందా.
విశాల్: నయని అమ్మతో మాట్లాడి విషయం చెప్పు.
నయని: అమ్మగారు విశాలాక్షి ఇచ్చిన తామర పువ్వు పట్టుకొని బాబు గారు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. తను అడిగే మూడు ప్రశ్నలకు మీరు చెప్పే సమాధానాలు బాబుగారు మాత్రమే వింటారు. అప్పుడు నాకు కూడా వినపడదు.
గాయత్రీదేవి: అర్థమైంది నువ్వు వెళ్లి మట్టి కుండ తీసుకురా నయని. 
వల్లభ: ఏం చెప్పిందో నాకు చెప్పు నయని నేను తీసుకొస్తా.
నయని: మట్టి కుండ తీసుకురమ్మన్నారు.
వల్లభ: నేను తీసుకొస్తా.
తిలోత్తమ: ఈ సారి నా పెద్ద కొడుకు బ్రైన్ షార్ప్‌గా పని చేసింది. ఆత్మలు మాట్లాడిన ఆ తరంగాలు రికార్డ్‌ చేసి డీ కోడ్ చేస్తే విశాల్ అడిగిన ప్రశ్నలకు గాయత్రీ అక్క చెప్పిన సమాధానాలు మాకు వినపడకపోయినా ట్రేస్‌ అవుట్ చేస్తాం.
సుమన: బావగారు ఉత్సాహంతో వర్షం పడిందా చలి వేస్తుందా ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు.


వల్లభ మట్టి కుండలో తరంగాలు రికార్డ్ చేయడానికి మెషిన్ పెడతాడు. తిలోత్తమ తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని నమ్మకంతో మనసులో వెళ్లక్క మీ కొడుకు దగ్గరకు అని అంటుంది. గాయత్రీదేవి విశాల్ దగ్గరకు వెళ్తుంది. విశాల్ తన మూడు ప్రశ్నలు అడగడానికి సిద్ధపడతాడు. ఇక ఆ కుండని విశాల్ భుజం మీద పెట్టి దాన్ని తన చెవికి ఆనించమని చెప్తుంది. నయని అలాగే చేస్తుంది. తామర పువ్వు పట్టుకున్న విశాల్ చేతిని పైకి పట్టుకోమని ఆవిడకు పువ్వు ఇస్తున్నట్లు చేయి పెట్టమని అంటుంది. తన ఎదురుగానే తల్లి ఉందా అని విశాల్ సంతోష పడతాడు. తల్లీ కొడుకులు ఎమోషనల్ అవుతారు. గాయత్రీ దేవి విశాల్ చేతిలో పువ్వుని చేతిని తాకుతుంది. పువ్వులో లైటింగ్ రావడం అందరూ చూసి షాక్ అవుతారు. 


విశాల్: ఏడుస్తూ నయని అమ్మ కూడా తామర పువ్వు పట్టుకుంది కదా. అమ్మ కనిపించడం లేదు కానీ అమ్మని పుష్పాన్ని తాకిన ఫీలింగ్ నాకు అనిపించింది. 
నయని: మూడు ప్రశ్నలు అడగండి. ఆ కుండని ఆనుకున్న మీ చెవికి సమాధానాలు వినిపిస్తాయి.
విశాల్: అమ్మ ఎలా ఉన్నావ్ అమ్మ. కనిపించకుండా పోయిన అమ్మని బిడ్డ ఇలా కాకుండా ఇంకేం ప్రశ్నలు అడుగుతాడు అత్తయ్య.
గాయత్రీదేవి: అవకాశం అన్నీ నాకే కావాలి అనుకున్న స్వార్థం మనిషికి ఉంటుంది. 
తిలోత్తమ: నాకు కూడా వినిపించడం లేదు అంటే నయనికి కూడా వినపించదు. పర్వాలేదు నువ్వు నీ కొడుకుకి చెప్పే సమాధానాలు వల్లభ చేసిన మెషిన్‌లో రికార్డ్ అవుతాయి అక్క.
గాయత్రీదేవి: వేరే వారు అయితే ఇంకెన్ని ఆస్తులు సంపాదించావు ఎక్కడెక్కడ ఉన్నాయని వాటి వివరాలు అడుగుతారు నువ్వు నా కొడుకు కాబట్టి ఎలా ఉన్నావని అడిగావు నాన్న. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కాళ్లు పట్టుకున్నా కనికరించని పద్మాక్షి.. బావమరదళ్లు రెండు ఫ్యామిలీలను ఒకటి చేస్తారా!