Trinayani Today Episode తిలోత్తమ అందర్ని హాల్‌లోకి పిలుస్తుంది. ఎందుకు పిలిచావ్ అని అందరూ అడిగితే చెప్పడం కంటే చూపిస్తే మంచిది అంటుంది. ఇంతలో గురువుగారు వస్తారు. గురువుగారు రావడం రావడమే ఎందుకు విశాల్ నన్ను ఉన్నఫళంగా రమ్మన్నావు అంటారు. దానికి విశాల్ నేను పిలిపించలేదు అంటాడు. అప్పుడు తిలోత్తమ నేనే కబురు పెట్టాను అంటుంది.


తిలోత్తమ: మీరు క్షేమంగా ఉన్నట్లే మా అక్క కూడా ఉండాలి కదా స్వామి. 
విశాల్: లలిత పెద్దమ్మకి ఏమైంది బాగానే ఉన్నారు కదా.
వల్లభ: హలో తమ్మి అక్క అంటే టక్కున గుర్తు రావాల్సింది గాయత్రీ పెద్దమ్మ. 
సుమన: ఇప్పటి వరకు ఎలా ఉందో రూపురేకలే తెలీలేదు. క్షేమ సమాచారం ఎలా తెలుస్తుంది.
తిలోత్తమ: అలా తెలుస్తుంది. మీ అందర్ని ఆశ్చర్యానికి గురి చేయాలనే గురువుగారిని రమ్మన్నాను. ఈ కాగితంలో ఉన్నట్లే ముగ్గు వేయండి. అని ముగ్గు చూపిస్తుంది. ఎవరు వస్తే ప్రతీ రోజూ పండగే అని అనుకుంటారో ఆవిడ కోసం వేయించిన ముగ్గు ఇది.
విశాల్: అమ్మ ఆ ముగ్గు గురువుగారే వేయాలా.
తిలోత్తమ: ఆయన వేస్తేనే అక్క విషయం తేటతెల్లమవుతుంది.
విక్రాంత్: అర్థమయ్యేలా చెప్పండి.
వల్లభ: ఓరేయ్ విక్రాంత్ నయని కన్న బిడ్డ గురించి అడిగితే చాలా మంది తేలికగా బుజాలు ఎగరేస్తున్నారు. మేం మాత్రం తేలికగా తీసుకోలేదు. అఖండ స్వామిని కలిస్తే ఒక పేపర్‌లో ముగ్గు వేసి అంజనం వేసే కాటుక ఇచ్చారు.
తిలోత్తమ: అవును ముగ్గు వేసి ఆకుమీద కాటుక రాస్తే ఇప్పుడు గాయత్రీ అక్క ఎలా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుంది. 
దురంధర: పెద్ద వదినను కనిపిస్తుంది అంటే అందరూ ఎగిరి గంతేస్తారు అంటే విశాల్ కూడా సైలెంట్ అయిపోయాడు. 
పావనా: ఇంత ఈజీగా తెలిసిపోతుంది అని ఎవరూ ఊహించరు కదా.
నయని: అవును బాబాయ్ ఈ పని ఏదో ముందే చేసుంటే బాగుండేది. 
హాసిని: గాయత్రీ అత్తయ్య కనిపించడం అంటే అద్భుతమే కదా గురువుగారు.
గురువుగారు: అఖండ స్వాముల వారిని కలిసి ఇంత ప్రయాస పడిన తిలోత్తమ, వల్లభలను అభినందించి తీరాలి. 


గురువుగారు తన బ్యాగ్‌లో నుంచి ఓ పువ్వును తీసి హాసినికి ఇస్తారు. అది ఇచ్చి అనుకూలమైన పని చేసిరామ్మ అంటారు. హాసిని అర్థం కాలేదు అంటే వెళ్లు నీకే అర్థమవుతుంది అంటారు. దీంతో హాసిని పువ్వుని తీసుకొని గాయత్రీ పాప దగ్గరకు వెళ్తుంది. గురువుగారు అంజనం సిద్ధమవుతారు. 


విశాల్: ఫోన్‌లో మెసేజ్.. వదినా గురువుగారు ఇచ్చిన పువ్వుతో మా అమ్మే గాయత్రీ పాప అన్న నిజం తెలియకుండా చేయొచ్చేమో. ఆ పువ్వును గాయత్రీ పాపకు ఇవ్వండి. ఏం జరుగుతుందో చూద్దాం. 


హాసిని పాపకు పువ్వు ఇవ్వగానే అది తీసుకున్న పాప పడుకుండిపోతుంది. ఇక హాసిని ఆ విషయం అందరికీ చెప్పాలా వద్దా అని కంగారుగా బయటకు వస్తుంది. ఇక నయని తన బిడ్డను చూడబోతున్నాను పిన్ని అని తన సంతోషాన్ని దురంధరకు చెప్తుంది. గురువుగారు అంజనం వేయగానే పెద్ద గాలి వస్తుంది. అంజనంలో గాయత్రీ దేవి ఫొటో కనిపిస్తుంది. అందరూ షాక్ అవుతారు. 


నయని: అమ్మగారు.. బాబుగారు అమ్మగారు కనిపిస్తున్నారు చూడండి..
విశాల్: గాయత్రీ పాప కనిపించకుండా అమ్మ కనిపించింది అంటే అమ్మ ఆత్మను మాత్రమే అంజనం చూపించగలదు అన్నమాట. హమ్మయ్య. 
సుమన: ఇదేంటి అత్తయ్య గాయత్రీ అత్తయ్యే కనిపించి మాయం అయిందేంటి.
తిలోత్తమ: నేను అదే ఆలోచిస్తున్న పిల్లలా కనిపించలేదు ఏంటి.
గురువుగారు: బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక ఇలా ఎలా జరిగింది అని తిలోత్తమ ఆలోచిస్తూ ఉంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: 'నాగ పంచమి' సీరియల్: పంచమి గర్భంలోని బిడ్డ సామాన్యురాలు కాదన్న గురువుగారు.. నాగేశ్వరిని అడ్డుకున్న ఫణేంద్ర!