Naga Panchami Today Episode: పంచమి నాగేశ్వరిని తన ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. వెళ్లను అని నాగేశ్వరి అంటే పంచమి కుదరదు అని చెప్తుంది. వెళ్లకపోతే తన కడుపులో బిడ్డ మీద ఒట్టు అని పంచమి నాగేశ్వరితో అంటుంది. 


పంచమి: చెప్పు నాగేశ్వరి నా బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే నువ్వు వెళ్లిపోవాలి.
నాగేశ్వరి: నా అవసరం నీకు చాలా ఉంటుంది పంచమి. 
పంచమి: ఉండదు.. నాగేశ్వరి. నా ప్రాణం పోయినా నీ సాయం ఆశించను నువ్వు ఇక వెళ్లిపోవచ్చు. నువ్వు వెళ్లపోతే నేనే వెళ్లిపోతా. నా బిడ్డ మీద ఒట్టు వేసినా నువ్వు వెళ్లడం లేదు అంటే నీకు నా మీద ప్రేమలేదు. మరేదో ఆశించి నువ్వు ఇక్కడుంటున్నావు అనుకోవాలి.
నాగేశ్వరి: వెళ్తాను పంచమి.
పంచమి: మంచిది నాగేశ్వరి మళ్లీ ఎప్పుడూ నాకు కనిపించకు. నాగేశ్వరి పాము వెళ్లిపోతుంది.


ఇక గురువుగారు తన శిష్యులతో మహాదేవ వంశస్థులు వస్తున్నారు అని.. వాళ్ల వంశం చిన్నపాటి రాజవంశం అని.. వాళ్ల పూర్వీకులు గుప్త నిధి వేటలో భాగంగా నాగుల శాపానికి గురై వంశం అంతరిస్తూ వస్తుంది అని ఇప్పుడు ఆ వంశం వారసులే తన దగ్గరకు రాబోతున్నారు అని చెప్తారు. ఇక తన శిష్యుడు వాళ్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని అడుగుతాడు. దానికి గురువుగారు తన దివ్య దృష్టితో పంచమి జననం, మోక్ష పంచమిల పెళ్లి అన్నీ చూస్తారు. 


గురువుగారు: ఆ కుటుంబంలో ఓ కారణ జన్మురాలు కాలు మోపింది. ఆమె కడుపున ఓ  మహాత్తరమైన బిడ్డ పుట్టుగకు అంకురార్పణ జరిగింది. పుట్టబోయే బిడ్డ మహాత్‌ జాతకురాలు. మహారాణి యోగంతో జన్మించబోతుంది. 


మోక్ష ఫ్యామిలీ గురువుగారి దగ్గరకు బయల్దేరుతారు. కరాళి తన దివ్య దృష్టితో మోక్ష వాళ్లని చూస్తుంది. పంచమి డల్‌గా ఉంటే మోక్ష ధైర్యం చెప్తాడు. ఇక కరాళి తనకు అద్భుతమైన అవకాశం వచ్చింది అని ఓ ప్లాన్‌ను ఫణేంద్రకు చెప్తుంది. నాగేశ్వరిని అడ్డుకోమని ఫణేంద్రకు చెప్తుంది. అందరూ గురువుగారి దగ్గరకు వస్తారు. కరాళి, ఫణేంద్ర, నాగేశ్వరి పాము కూడా అక్కడికి వస్తుంది. నాగేశ్వరి పాముతో ఫణేంద్ర పాము గొడవ పడుతుంది. రెండు ఒకదాని మీదకు మరొకటి బుసలు కొడుతూ వెళ్తాయి. 


కరాళి: ఫణేంద్ర నాగేశ్వరిని అడ్డగించాడు. నేను వెళ్లి అనుకున్న కార్యం పూర్తి చేయాలి. 
గురువుగారు: తమందరి రాక మాకు చాలా సంతోషం కలిగిస్తుంది.
శబరి: మా వంశం గురించి మీరు పూర్తిగా తెలిసిన వారు. కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మాకు తమరే దిక్కు. మా సందేశాలకు తమరే చక్కగా పరిష్కారం చూపగలరు. ఆ నమ్మకంతోనే మీ దగ్గరకు రావడం జరిగింది.
గురువుగారు: నా మీద నమ్మకానికి ధన్యావాదాలు.. తమరి రాకకు కారణం నిస్సందేహంగా వివరించండి. నాకు తెలిసిన పరిష్కారం చూపిస్తాను. 
శబరి: నా మనవడు మోక్ష, అతని భార్య..
గురువుగారు: ధర్మపత్రి పంచమి.. పంచమి కారణ జన్మురాలు. ప్రస్తుతం తను గర్భవతి. అందరూ షాక్ అవుతారు.
శబరి: తమరి శక్తి సామర్ధ్యాలు మాకు బాగా తెలుసు. మేం మీకు ఏం చెప్పనవసరం లేదు. మా ఇంట్లో కొన్ని అపశకునాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఓ సోది ఆమె వచ్చి మా ఇంట్లో పుట్టబోయే బిడ్డకారణంగా చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పింది. దాంతో నా కోడలు చాలా భయపడుతుంది. ఏం జరగబోతుందో తమరు చక్కగా చెప్పగలరు అనే ఆశతోనే మీ దగ్గరకు వచ్చాం. 


గురువుగారు అమ్మవారికి దండం పెట్టుకుంటారు. ఇక కరాళి తన మంత్ర శక్తులతో తన అన్న ఆత్మని రప్పిస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడమే పెద్ద సర్‌ప్రైజ్‌ - వరలక్ష్మి శరత్‌కుమార్ ఆసక్తికర కామెంట్స్