Trinayani Today Episode గుర్రం తన వైపు దూసుకొస్తున్న శబ్దం తిలోత్తమకు మరోసారి వినిపిస్తుంది. ఆ సౌండ్‌కు తిలోత్తమ చెవులు గట్టిగా మూసుకొని పెద్దపెద్దగా అరుస్తుంది. పాపం వల్లభ ఏం చేయాలో తెలీక బిత్తరపోతాడు. ఇక కొద్ది సమయానికి తిలోత్తమ తేరుకుంటుంది. ఏమైందని వల్లభ ప్రశ్నిస్తాడు. 


తిలోత్తమ: వల్లభ చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. ఆ గుర్రం నా మీద కక్ష కట్టి నా మీదకు వస్తున్నట్లు ఉంది.


వల్లభ: గుర్రమా ఎక్కడి నుంచి వస్తుంది మమ్మీ.


తిలోత్తమ: స్వర్గం నుంచి రావాలి ఎందుకంటే ఆ గుర్రం చచ్చిపోయిందని తిలోత్తమ అనగానే మరోసారి కరెంట్ కట్ అయిపోతుంది.


విశాల్: నయని ఏమైంది ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొన్నావ్.


నయని: కొబ్బరికాయ పగిలిపోవడం, పిండి బొమ్మ, గుర్రపునాడ, గుర్రం శకింలించినట్లు శబ్ధం రావడం అన్నీంటికన్నా తిలోత్తమ అత్తయ్య చాతి పట్టుకొని కుప్పకూలిపోవడం ఇవన్నీ తలచుకుంటుంటే మన ఇంట్లో ఏం జరుగుతుందని భయంగా ఉంది.


విశాల్: నయని ఇది మన ఇంట్లో ఇప్పుడు జరగడం కాదు. గతంలో జరిగి ఉంటే ఇప్పుడు రిపీట్ అవుతుంది. లేకపోతే దాని తాలూక జ్ఞాపకాలు గుర్తుచేయడం అనిపిస్తుంది. 


నయని: అంటే ఈ పరిణామాలకు తిలోత్తమ అత్తయ్యకు సంబంధం ఉంది అంటారా..


విశాల్: అవును నయని ఎందుకంటే అమ్మ దగ్గర సెక్రటరీగా తిలోత్తమ అమ్మ పనిచేసింది. ఇద్దరూ కలిసి చాలా సార్లు ఎస్టేట్‌కి వెళ్లి వ్యవహారాలు చూసుకునేవారు.


నయని: ఎస్టేట్ వివరాలు ఉన్నాయి కానీ ఎప్పుడు అక్కడికి తీసుకెళ్లలేదు ఎందుకు బాబుగారు. వద్దు అనుకున్నారా.. కారణం ఉండాలి కదా.. 


విశాల్: అవును నయని ఎందుకంటే అక్కడ మా అమ్మ అపురూపంగా చూసుకున్న గుర్రం వాయు. తన కళ్ల ముందే ప్రాణాలు విడిచింది. 


నయని: చచ్చిపోయిందా..


విశాల్: చంపేశారు. ఎవరో తెలీదు..


నయని: వాయు ఈ పేరు ఎక్కడో చూసినట్లు ఉంది బాబుగారు.


విశాల్: వాయు చనిపోయిన తర్వాత వారం వరకు అమ్మ తినలేదు. ఆఫీస్‌కు వెళ్లలేదు. ఆ వారం రోజులు బిజినెస్ చూసుకున్నది తిలోత్తమ అమ్మే. 


నయని: అవునా అయితే ఏదో లెక్క ఉంది అనిపిస్తుంది. విశాలాక్షి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మూట గురించి తెలుస్తుంది అన్నారు కదా గురువుగారు. 


విశాల్: అయినా విశాలాక్షికి ఈ విషయాలు అన్నీ ఎలా తెలుస్తాయి.


నయని: భక్తి ఉంటే అన్నీ సునాయాసంగా తెలిసిపోతాయి బాబుగారు. 


విశాల్: అవునులే అమ్మ కూడా తనకు చాలా విషయాలు తెలుసు అని చెప్పేది కానీ అర్థాయుష్షుతో చనిపోయింది. 


నయని: మళ్లీ పుట్టారు కదా బాబుగారు. మన దగ్గరకు వచ్చే వరకు ఓపిక పట్టండి. 


నయని మరోసారి మూట హాల్‌లోకి తీసుకొని వస్తుంది. మళ్లీ ఈ మూట తీసుకొచ్చారు అని విక్రాంత్ అంటే నయని విశాలాక్షి వస్తుందని డమ్మక్క చెప్పింది కదా అంటుంది. ఇక వల్లభ వెటకారంగా ఫోన్ లేదు ఏం లేదు వీళ్లు ఎలా మాట్లాడుకుంటారో అంటాడు. దానికి విశాల్ మనసు చెప్తుంది బ్రదర్ అంటాడు. ఇంతలో సుమన అనుకుంటే అవుతుందా అలా అయితే ఇప్పుడు గురువుగారు రావాలి అని నేను అనుకుంటాను వచ్చేస్తారా అని ప్రశ్నిస్తుంది. సరిగ్గా అప్పుడే గురువుగారు ఇంట్లోకి అడుగు పెడుతూ వచ్చేశాను సుమన అంటాడు. సుమనతో పాటు అందరూ షాక్ అవుతారు.  


తిలోత్తమ: మీరు రావాలి అని సుమన అనుకోగానే వచ్చేశారు అలాగే మా గాయత్రీ అక్కయ్య రావాలి అని మేం తలచుకుంటే వస్తుందా గురువుగారు.


గురువుగారు: తలచుకో తిలోత్తమ.. 


విశాల్: స్వామి ఏమంటున్నారు. కోరుకుంటే వీళ్లకు అమ్మ కనిపిస్తుందా..


గురువుగారు: ప్రయత్నించని విశాలా..


తిలోత్తమ: అందరి ముందు కోరుకుంటున్నాను. గాయత్రీ అక్క రావాలి.. గాయత్రీ అక్క రావాలి.. తిలోత్తమ కళ్లు తెరచి చూసే సరికి ఎదురుగా లలితా దేవి ఉంటుంది. 


లలితాదేవి: తిలోత్తమ కోరిక నెరవేర్చడానికి గాయత్రీ దేవి ఈరోజు వస్తుందని చెప్పడానికే నేను వచ్చాను. క్రితం సారే చెప్పాను. చైత్ర పౌర్ణమి నాడు నా చెల్లెలిని మీకు చూపిస్తాను అని.


నయని: నిజంగానే అమ్మగారు వచ్చారా పెద్దమ్మ గారు.


లలితాదేవి: హా..


సుమన: మొత్తానికి మీ చెల్లిని తీసుకొచ్చారు పెద్దత్తయ్య గారు.


విశాల్: పెద్దమ్మ అమ్మ వచ్చిందా..


లలితాదేవి: అమ్మే వచ్చింది విశాల్..


విశాల్: మనసులో.. అమ్మను నేను ఎత్తుకున్నా కదా.. మరి పెద్దమ్మ ఎవర్ని తీసుకొని వచ్చింది. 


లలితాదేవి లోపలికి రా అని పిలవగానే ఇంట్లోకి పెద్దగా గాలి వీస్తుంది. అందరూ ఎవరు వస్తారా అని ఎదురు చూస్తారు. లోపలికి కాలు మోపలేకపోతుంది అని వల్లభ అంటే సుమన కాలు లేవేమో అంటుంది. అవును అని గురువుగారు అంటే అందరూ షాక్ అవుతారు. వల్లభ అర్థం కాలేదు అంటే  సుమన  ఏడాదిన్నర అయింది పుట్టిన గాయత్రీ అత్తయ్య ఇప్పుడు అవిటిది అయింటుంది అని వెటకారం చేస్తుంది. దీంతో లలితా దేవి సుమన అంటూ పెద్దగా అరుస్తుంది.  


లలితాదేవి: సుమన నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పళ్లు రాలతాయ్.


సుమన: స్వామి వారు అన్న మాటకు అర్థం అదే అయింటుందని అలా అన్నాను పెద్దత్తయ్య గారు.


గురువుగారు: లలితాదేవి అమ్మను ఇప్పుడు చూడు.


లలితాదేవి: లోపలికి ఇప్పుడు రావమ్మా నీ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నామో..


లలితా దేవి పిలవగానే విశాలాక్షి వస్తుంది. విశాలాక్షి వచ్చింది ఏంటా అని అందరూ షాక్ అవుతారు. గాయత్రీ దేవి వస్తుంది అనుకుంటే విశాలాక్షి వచ్చిందేంటి అని తిలోత్తమ అడుగుతుంది. దీంతో విశాలాక్షి ఈ రోజు పౌర్ణమికి మీ అందరికీ గాయత్రీ దేవి ఛాయ తెలుస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మానవ శక్తితో ఈ ఆత్మను కట్టడి చేయలేం, అది దైవశక్తి వల్లే సాధ్యం - భయపెడుతున్న తమన్నా, రాశిఖన్నా 'బాక్' ట్రైలర్‌