Anchor Neha Chowdary About Leaving Dance Show: నేహా చౌద‌రి బిగ్ బాస్ సీజ‌న్ - 6 లో కంటెస్టెంట్. ఆమె ఆట తీరు, అందం, మాట‌ల‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు నేహా. ప్ర‌స్తుతం మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వతో క‌లిసి మా టీవీలో వ‌చ్చే రియాల్టీ డ్యాన్స్ షో నీతోనే డ్యాన్స్  2.0లో కంటెస్ట్ చేస్తున్నారు. ఇద్ద‌రి జోడి మంచి మంచి డ్యాన్స్ ల‌తో అల‌రిస్తున్నారు. అయితే, ఒక్క‌సారిగా నేహా షో నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది. ఇంక షో లో  చేయడం లేద‌ని చెప్పింది. మెడ‌కు పెద్ద బ్యాండేజ్ తో ఆమె స్టేజ్ పైకి రావ‌డం అంద‌రినీ షాక్ కు గురిచేసింది. అయితే, ఆమెకు అలా ఎందుకు అయ్యింది? ఎందుకు షో నుంచి బ‌య‌టికి వెళ్లిపోయిందో చెప్పింది నేహా. ఈ మేర‌కు ఆమె ఛానెల్ లో వీడియో రిలీజ్ చేసింది నేహా. 


అస‌లు ఏం జ‌రిగిందంటే? 


నేహా, విశ్వ ఇద్ద‌రు డ్యాన్స్ షోలో జోడీ. దాంట్లో భాగంగా ఇద్ద‌రు మంచి మంచి పాట‌ల‌కు డ్యాన్స్ లు చేస్తూ జ‌డ్జ్ ల‌ను మెస్మరైజ్ చేశారు. విన్యాసలతో, డిఫరెంట్ గా డాన్స్ చేశారు. అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే దెబ్బ త‌గిలి ఆమె మెడ ద‌గ్గ‌ర దెబ్బ త‌గిలింద‌ట‌. అయినా కూడా నేహా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయ‌డంతో.. అది కాస్తా సీరియ‌స్ అయ్యింద‌ని డాక్ట‌ర్ ఆరు వారాల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోమ‌ని చెప్పార‌ని అన్నారు నేహా. "డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మెడ ద‌గ్గ‌ర దెబ్బ త‌గిలింది. అయినా కూడా ప్రాక్టీస్ చేశాను. దాంతో నొప్పి ఎక్కువ అయ్యింది. అది కాస్తా చేతికి పాకింది. దీంతో డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లాను. ఎంఆర్ ఐ తీయ్యించి చెక్ చేసి ఆరు వారాలు పూర్తిగా రెస్ట్ చెప్పారు. మూడు వారాలైతే క‌చ్చితంగా.. స్ట్రిక్ట్ గా మెడ‌కు బెల్ట్ వేసుకోవాల‌ని చెప్పారు అందుకే, డ్యాన్స్ షో మానేశాను" అని చెప్పింది నేహా. 


కొంచెం త‌గిలితే చేతులు, కాళ్లు ప‌డిపోయేవి.. 


"ఒక్క‌సారిగా చేయి నొప్పి ఎక్కువైపోయి, క‌నీసం కారు గేర్ కూడా మార్చ‌లేక‌పోతున్నాను. గుండెల్లో నొప్పి వ‌చ్చిన‌ట్లు అయ్యింది. ఊపిరి ఆడ‌లేదు. అందుకే, వెంట‌నే ఎంఆర్ ఐ చేయించుకుని హాస్పిట‌ల్ కి వెళ్లాను. అక్క‌డ అన్నీ చెక్ చేసి ఇప్పుడు త‌గిలిన దానికంటే ఇంక కొంచెం త‌గిలితే చేయి, కాళ్లు ప‌డిపోయి పూర్తిగా పెరాల‌సిస్ అయిపోయ్యేదాన్ని అని చెప్పారు. మూడు నెల‌లు బెల్ట్ పెట్టుకుని రెస్ట్ తీసుకోవాల‌ని, త‌గ్గ‌క‌పోతే స‌ర్జ‌రీ చేయాల‌ని చెప్పారు. డ్యాన్స్ షో లో న‌న్ను చాలా స‌పోర్ట్ చేశారు మీరంతా.. ఇలా జ‌రిగినందుకు సారీ. వ‌చ్చే సీజ‌న్ లో పార్టిసిపేట్ చేస్తాను. దానికి స్టార్ మా వాళ్లు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా బాగా చేస్తాను. న కోసం అందరూ  ప్రార్థించండి" అని అన్నారు నేహా. 



ఏడ్చేసిన విశ్వ‌.. 


నేహా ప‌రిస్థితి చూసి ఆమె కో కంటెస్టెంట్ విశ్వ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్ద‌రం క‌లిసి బెస్ట్ ప‌ర్ఫామెన్స్ లు ఇచ్చామ‌ని, నేహా ఫైట‌ర్ అని అన్నారు. ప్రాప‌ర్ టైంలో డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం మంచిది అయ్యింద‌ని అన్నారు. మ‌నం బాగుంటే వేరే షోకి వెళ్లొచ్చు. పెరాల‌సిస్ వ‌చ్చే స్టేజ్ నుంచి దేవుడు కాపాడాడు. ఏం కాదు అని విశ్వ నేహాకి ధైర్యం చెప్పారు. నేహాని చాలా మిస్ అవుతున్నాన‌ని చెప్పి క‌న్నీళ్లు పెట్టుకున్నారు.



Also Read: రానా ద‌గ్గుబాటి, ప్రియ‌ద‌ర్శి కాంబినేష‌న్​లో క్రేజీ ప్రాజెక్ట్.. థ్రిల్లు ప్రాప్తిర‌స్తు అంటూ పోస్టర్ రిలీజ్