Priyanka - Shiv Never Ending Tales: బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక, తన బాయ్‌ఫ్రెండ్ శివ్.. ఎప్పటికప్పుడు తమ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లో జరుగుతున్న విషయాలను తమ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ముఖ్యంగా వారి రోజువారీ జీవితాల్లో జరిగే విశేషాలతో పాటు వారి స్పెషల్ మూమెంట్స్‌ను కూడా తమ యూట్యూబ్ ఛానెల్ అయిన ‘నెవర్ ఎండింగ్ టేల్స్’లో షేర్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఉగాదికి తాము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నామంటూ ఒక వీడియోను అప్లోడ్ చేశారు ప్రియాంక, శివ్. కానీ తాజాగా వారు మనసు మార్చుకున్నట్టు, ఇల్లు తీసుకోవడం లేదంటూ మరో వీడియోను అప్లోడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అందుకే ఆ నిర్ణయం..
ముందుగా ప్రియాంక, శివ్ కలిసి తాజాగా అప్లోడ్ చేసిన వీడియోలో ఒక ఫ్లాట్‌కు టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశామని చెప్పారు. కానీ అలా ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే ఒక ల్యాండ్ కొని అందులో ఇల్లు కట్టుకోవాలి నిర్ణయించుకున్నట్టు శివ్ బయటపెట్టాడు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి చాలా రోజుల నుండి ల్యాండ్ కొనడానికి చాలా తిరుగుతున్నామని చెప్పారు. జనవరి నుండి వాళ్లు ఎన్ని ల్యాండ్స్ చూశారో.. అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఫైనల్‌గా ఒక ల్యాండ్‌ను ఫైనల్ చేయడంతో తాజాగా ఆ హ్యాపీ న్యూస్‌ను అందరితో షేర్ చేసుకుంటూ ముందు నుండి ల్యాండ్ చూస్తున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోలు అన్ని ఒక వ్లాగ్‌గా మార్చి సబ్‌స్క్రైబర్ల ముందుకు తీసుకొచ్చారు.
ఏదో ఒక ప్రాబ్లమ్..
ఆ వీడియోలో ఫిబ్రవరీ 28న ప్రియాంక, శివ్.. ఒక ల్యాండ్ చూడడానికి వెళ్లారు. అంతకు ముందే మూడుసార్లు ల్యాండ్ చూడడానికి వెళ్లి పలు కారణాల వల్ల ఫైనల్ అవ్వక తిరిగొచ్చేశారు. ల్యాండ్ నచ్చితే రేటు నచ్చడం లేదని, రెండూ నచ్చితే పేపర్స్ ప్రాబ్లమ్ ఉంటుందని ఈ వీడియోలో చెప్తూ ఫీల్ అయ్యాడు శివ్. ఫైనల్‌గా తాము ల్యాండ్ తీసుకున్న రోజే వీడియో బయటికొస్తుంది అని ప్రకటించాడు. అనుకున్నట్టుగానే వారు ల్యాండ్ తీసుకోగానే ఈ వీడియోను బయటపెట్టారు. ఏప్రిల్ 10న ల్యాండ్‌ను ఫైనల్ చేయడంతో పాటు తానే దగ్గరుండి క్లీనింగ్ కూడా ప్రారంభించాడు శివ్. ఆ తర్వాత ల్యాండ్‌ను రెజిస్టర్ కూడా చేసుకున్నారు.
కల నెరవేరింది..
ల్యాండ్ కొని, రెజిస్ట్రేషన్ కూడా అయిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత మామూలు విషయం కాదని చాలా సంతోషంగా కనిపించాడు శివ్. ఏప్రిల్ 23న రెజిస్ట్రేషన్ జరిగిందని వీడియోలో చెప్పుకొచ్చారు. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకోవడం కంటే ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే మనది అనే ఫీలింగ్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు శివ్. మొత్తానికి తన కల నెరవేరిందని ఆనందంగా చెప్పాడు. అంతే కాకుండా జులై వరకు మంచి ముహూర్తాలు లేవని, దాంతోపాటు వర్షా కాలంలో ఇల్లు కట్టడం కష్టమని చెప్తూనే త్వరలోనే ఇంటి కన్‌స్ట్రక్షన్ గురించి నెవర్ ఎండింగ్ టేల్స్‌లో అప్డేట్ చేస్తామని సబ్‌స్క్రైబర్లకు మాటిచ్చారు ప్రియాంక, శివ్.
Also Read: మేకప్ రూమ్‌లో బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు, నాకు న్యాయం కావాలి - సీరియల్ నటి ఆవేదన