Trinayani Today Episode విక్రాంత్ సుమన దగ్గరకు వచ్చి ఉసిరి దీపాలను ఎందుకు పడేయాలి అనుకున్నావ్ అని ప్రశ్నిస్తాడు. దానికి సుమన అవి ఎక్కడ పడ్డాయి గాలిలో ఉన్నాయి కదా అని అంటుంది. సుమన సమాధానం విన్న విక్రాంత్ కొట్టడానికి చేయి ఎత్తితో సుమన తన ముఖానికి అడ్డుగా చేతులు పెట్టుకొని కొడితే మిమల్ని శపిస్తాను అని అంటుంది. 


విక్రాంత్: ఎలాంటి శాపం ఇవ్వాలో నేనే కోరుకుంటానే..
సుమన: వరం కోరుకుంటారు కానీ ఎవరూ శాపం కోరుకోరు.
విక్రాంత్: నేను అడుగుతాను మా ఆవిడ సుమంగళిగానే పోవాలి అని. ఒకవేళ వద్దు అంటే నువ్వు విధవరాలివి అవ్వాలి అని కోరుకుంటా..
సుమన: ఛీ.. ఛీ.. బొట్టు లేకుండా నేను అస్సలు బాగోను.
విక్రాంత్: మేకప్‌ కోసమే మొగుడు ఉండాలి అనుకున్న నీలాంటి దాని మీదకి ఏ అమ్మవారు వస్తుందే. నయని వదిన ఆశయాలకు భంగం కలిగించాలి అని ఊగిపోతూ దీపాలు పడగొట్టావ్. కానీ నువ్వు అబద్దాలు ఆడి చెప్పిన ఆ చిత్తారాల అమ్మ తల్లే దీపాలను కింద పడకుండా గాల్లో ఎగిరేలా చేసింది. నయని వదినకు గాయత్రీ పెద్దమ్మ జాడ తెలిసొస్తే సరే సరి.. లేదంటే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది. 


నయని కాషాయి రంగు చీర కట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో విశాలాక్షి ఓ గర్భిణి మహిళలా నయనికి ఎదురుగా వస్తుంది. దీంతో నయని ఆమెను ఎక్కడికి వెళ్లాలి అని తోడుగా ఎవరు రాలేదా అని అడుగుతుంది. దీంతో ఆ గర్భిణీ స్త్రీ కోపంగా సమాధానం చెప్తుంది. ఇక ఆమె నా భర్తలా నీ భర్త కూడా అన్నీ చెప్పడని అంటుంది. నయని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆమె నీ కూతురు కోసం వెతుకుతున్నావు కదా అంటుంది. నయని కంగారు పడి నీకు ఎలా తెలుసు అంటుంది. ఆమెను ప్రశ్నించేలోపు మారువేశంలో ఉన్న విశాలాక్షి పురిటి నొప్పులు అని అరుస్తుంది. దీంతో నయని కంగారు పడుతుంది. చెట్టు చాటుకు వెళ్దామంటే నేను రాలేను అంటుంది.


గర్భిణి: నా వల్ల కాదు ఇక్కడే కాన్పు అవుతుంది. ఎండ పడకుండా చూస్తావో నలుగురి కంట పడకుండా చూస్తావో నీ ఇష్టం. 
నయని: ఇప్పుడెలా ఇక్కడెలా కాన్పు చేయడం. ఎండ పడకుండా పైన చుట్టడానికి ఏమీ లేదు. నలుగురి కంట పడకుండా కట్టడానికి ఏమీ లేదు. ఎలా చేయనమ్మా నీ కాన్పు.
గర్భిణి: మీ అత్త చీరలు ఎక్కడున్నాయో తీసుకొచ్చి చుట్టూ చుట్టూ..
నయని: గాయత్రీ అమ్మగారి చీరలా.. నీకు ఎలా తెలుసు..


ఇక ఆ గర్భిణి కింద పడిపోతే.. నయని విశాలాక్షి అమ్మవారిని వేడుకుంటుంది. ఇంతలో సమీపంలోని రావి చెట్టుదగ్గర ఉన్న అమ్మవారి దగ్గర నుంచి చీరలు గాలిలో ఎగురు కుంటూ అక్కడికి వచ్చి చుట్టూ చేరుతాయి. ఇక నాగయ్య పాము కూడా వచ్చి పెద్ద పాములా మారి ఎండ పడకుండా పెద్ద గొడుగులా మారుతుంది. 


నయని ఆ గర్భిణికి డెలివరీ చేస్తుంది. ఆ బిడ్డ పుట్టుగానే నయని ఇంట్లో ఉసిరి దీపాలు మాయం అవుతాయి. ఇక ఆ గర్భిణి నయనితో కూతురు కోసం వెళ్లాల్సిన నువ్వు నా కష్టం చూసి ఆగిపోయావ్ నీది చాలా గొప్ప మనసు అంటుంది. 


గర్భిణి: నాకు కాన్పు చేశావ్ కాబట్టి నువ్వు గుడికి వెళ్లొద్దు ఇంటికి వెళ్లు.
నయని: మరి నా కూతుర్ని చూసేది ఎలా..
గర్భిణి:  నేను చెప్పి నట్లు చేస్తే నీ కన్న కూతురు గురించి తెలుసి పోతుంది. అని చేయాల్సింది చెప్తుంది.



మరోవైపు అందరూ ఇంట్లో హాల్‌లో కూర్చొని ఉంటారు. ఇంతలో హాసిని ఉసిరి దీపాలను తీసుకొని వస్తుంది. అందరూ ఏదో అపశృతి జరిగింది అని అనుకుంటారు. ఇక నయని ఇంటికి వస్తుంది. ఇక విశాలాక్షి అమ్మ మంచి పని చేసి వచ్చిందని అంటుంది. ఏంటని వల్లభ అంటే చేతులకు అంటిన రక్తం చూస్తే తెలుస్తుందిగా  అని అంటుంది. దాంతో అందరూ నయని చేతులు చూసి షాక్ అవుతారు.


సుమన: ఎవరి ప్రాణం తీసి వచ్చావ్ అక్క.
హాసిని: శత్రువులు ఇంట్లో ఉంటే బయట ఎవరి ప్రాణాలు తీస్తుంది చెల్లి.
నయని: గుడికి వెళ్లేదారిలో ఓకామె పురుడు పోసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు చేసినప్పుడు పడిన మరకలు తుడుచుకున్నా కొన్ని ఉండిపోయాయి.
తిలోత్తమ: మైలతో మరేం గుడికి వెళ్తావ్ నయని. 
విక్రాంత్: వదినా గాయత్రీ పెద్దమ్మ జాడ కోసం గుడికి వెళ్లమన్నారు మరి అవకాశం పోయినట్లేనా..
నయని: అవకాశం నా దగ్గరకు వచ్చింది విక్రాంత్ బాబు. గాయత్రీ అమ్మచీరలు ఆ గర్భిణికి రక్షణగా ఉన్నాయి. అని జరిగింది చెప్తుంది. 
హాసిని: అమ్మో.. ఆవిడ ఎవరో కానీ దైవాంశ సంభూతురాలిగానే మాట్లాడింది చెల్లి. 
నయని: అవునక్కా..
విశాలాక్షి: తనని తీసుకురావాల్సింది అమ్మ.
సుమన: ఆ అందర్ని ఇంటికి తీసుకొస్తే.. మేం వరండాలో కాపురం పెట్టుకుంటా..
విశాల్: నాన్న నువ్వు అన్నట్లు అమ్మ మైల పడలేదు. తలంటు స్నానం చేసుకుంటే సరి.
నయని: ఆవిడ పూజ చేయమని చెప్పింది. ఈ పూజ చేస్తే గాయత్రీ అమ్మగారు  ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది. చాలా విచిత్రంగా చెప్పింది ఆమె. అమ్మవారికి శిరస్సు ఉండదు అంట కానీ జీవం ఉండదంట ఆ తల్లికి పూజ చేయమంది.
హాసిని: చెల్లి ఇదెక్కడి విచిత్రం. 
తిలోత్తమ: ఏ విధంగా ఆలోచించినా అంతుపట్టలేదు.
విశాలాక్షి: హృదయం ఉంటే దైవం అనుకూలంగా మారుతుంది. ఇక విశాలాక్షి ఆ పూజ ఎలా చేయాలో తాను చెప్తా అంటుంది. నయనిని తీసుకొని వెళ్తుంది. అందరూ పూజకు రెడీ అవుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: లంగావోణి వేసి మాయ చేస్తున్న కావ్య కళ్యాణ్‌రామ్‌ - 'బలగం' బ్యూటీ ట్రేడిషనల్ లుక్ కి కుర్రకారు ఫిదా!