Kavya Kalyanram: లంగావోణి వేసి మాయ చేస్తున్న కావ్య కళ్యాణ్‌రామ్ - 'బలగం' బ్యూటీ ట్రేడిషనల్ లుక్ కి కుర్రకారు ఫిదా!
Kavya Kalyanram Photos: కావ్య కళ్యాణ్‌రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'గంగోత్రి' మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన కావ్య ఆ తర్వాత ఠాగూర్, ప్రభాస్ 'అడవి రాముడు' వంటి చిత్రాల్లో తన క్యూట్ క్యూట్ మాటలు, లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
ఇక సినిమాలు ఆపేసి చదువుపై దృష్టి పెట్టింది. చాలాకాలం తర్వాత 'మసూద' సినిమాతో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బలగం చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో కావ్య ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత కావ్య వరుస ఆఫర్స్ అందుకుంటూనే ఉంది.బలగం వరకు బొద్దుగా ఉన్న కావ్య.. ఈ మధ్య సన్నబడి నాజుగ్గా తయారైంది.
దీంతో తరచూ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. పట్టు లంగావోణి వేసి అచ్చమైన తెలుగుంటి అమ్మాయిల మురిపించింది.
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావ్య కళ్యాణ్‌రామ్‌ను ఇలా ట్రెడిషనల్ లుక్‌లో చూసి కుర్రకారు ఫిదా అవుతుంది.