Trinayani Serial timings in Zee Telugu: పాపులర్ సీరియల్ 'త్రినయని' టైమ్ మారిపోయింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ 'జీ తెలుగు'లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతూ ఉంది. జనవరి 1 (ఈ బుధవారం) నుంచి కొత్త టైంలో టెలికాస్ట్ కానుంది. ఆ సీరియల్ టైంలో కొత్త సీరియల్ 'చామంతి' ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 


'త్రినయని' సీరియల్ కొత్త టైమ్ తెలుసా?
Trinayani Serial New Timings: 'జీ తెలుగు' ఛానల్‌లో కొన్ని రోజులుగా 'త్రినయని' సీరియల్ మంచి టీఆర్పీ రేటింగులతో కంటిన్యూ అవుతోంది. ఇప్పుడీ సీరియల్ రాత్రి వేళల నుంచి మధ్యాహ్నం సమయానికి షిఫ్ట్ అయ్యింది. 


కొత్త ఏడాది (2025)లో మొదటి రోజు (జనవరి 1వ తేదీ) నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇప్పటి వరకు ఆ టైం స్లాట్‌లో 'జానకి రామయ్య గారి మనవరాలు' టెలికాస్ట్ అవుతోంది. ఆ సీరియల్ టైం ఒక్క అర గంట వెనక్కి జరిగింది. జనవరి 1వ తేదీ నుంచి ఆ సీరియల్ సోమ నుంచి శని వారాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు టెలికాస్ట్ కానుంది.


Also Readతెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?






'జీ తెలుగు' మీద త్రినయని అభిమానుల ఆగ్రహం
ఈ ఏడాది (2024)లో 51వ వారం టీఆర్పీ రేటింగ్స్ చూస్తే... 'త్రినయని'కి 6.85 రేటింగ్ వచ్చింది. 'జీ తెలుగు' సీరియళ్లు అన్నిటినీ గమనిస్తే... 8.45 టీఆర్పీతో 'మేఘ సందేశం' టాప్ ప్లేసులో ఉండగా, ఆ తర్వాత 'పడమటి సంధ్యారాగం' (7.98), 'నిండు నూరేళ్ళ సావాసం' (7.68), 'జగద్ధాత్రి' (7.65), 'అమ్మాయి గారు' (6.89) నిలిచాయి. టాప్ 6 సీరియల్ 'త్రినయని'ని మూడు గంటలకు షిఫ్ట్ చేయడం వల్ల టీఆర్పీ రేటింగ్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.  



'చామంతి'... ఇక నుంచి రాత్రి 8.30 గంటలకు!
'త్రినయని' సీరియల్ స్లాట్‌ను 'చామంతి' తీసుకుంది. కొత్త ఏడాదిలో మొదటి రోజు ఆ సీరియల్ మొదలు అవుతోంది. అక్కా చెల్లెళ్ల కథతో ఈ సీరియల్ తెరకెక్కినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. పల్లెటూరి నుంచి పట్నంలో ఓ సంపన్న కుటుంబం ఇంటిలో పని చేయడానికి ఓ అమ్మాయి వచ్చింది. ఆ ఇంటికి కోడలిగా వచ్చినది ఆమె అక్క. ఆవిడ ఏవో అబద్ధాలు చెబుతుంది. నిజం చెబితే చచ్చిపోతానని చెల్లెల్ని చెదిరిస్తుంది. 'అక్క భవిష్యత్ కోసం అబద్ధాన్ని చెల్లెలు నిజం చేసిందా? లేదా ఏం చేసింది?' అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి.


Also Readతనయుడు రామ్ చరణ్ లేటెస్ట్‌ పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?