Trinayani Promo Today Episode: తిలోత్తమ వెన్నుపోటు పొడిచి చంపేసిన గాయత్రీ దేవి పునర్జన్మలో నయని కడుపులో పుడతాను అని చెప్పి పుడుతుంది. మళ్లీ పుట్టిన గాయత్రీ దేవి గాయత్రీ పాపగా ఇంట్లోనే ఉంటుంది. నయని, తిలోత్తమలకు ఈ విషయం తెలీక ఒకరు కన్నబిడ్డ కోసం మరొకరు తన పగ తీర్చుకోవడానికి చిన్న పిల్లలా ఉన్న గాయత్రీ దేవి కోసం వెతుకుతూనే ఉంటారు. మరోవైపు గాయత్రీ పాప కూడా తిలోత్తమకు రోజుకో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజా ప్రోమో సీరియల్ మీద ఇంకా ఆసక్తి రేకెత్తిస్తుంది.


"విశాల్ ఇంట్లోనే ఉన్న గాయత్రీ పాప ఓ మూటని పట్టుకుంటుంది. దాంతో విక్రాంత్ గాయత్రీ పాప సంచిని పట్టుకుంది చూశారా అని అంటాడు. దానికి విశాలాక్షి ఆశ పడకూడదు.. అర్హత సంపాదించుకోవాలి అని అర్థమయ్యేలా గాయత్రీ చేసిందని అంటుంది. ఇక నయని ఆ మూట తీసుకొని చూస్తుంది. అందులో బంగారు కొబ్బరి కాయ ఉంటుంది. నయనితో పాటు అందరూ అది చూసి షాక్ అయిపోతారు." దీంతో ప్రోమో పూర్తవుతుంది.  



నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..


నయని తిలోత్తమ మెడలో దండ వేయడంతో స్ఫృహ కోల్పోయిన తిలోత్తమ వాయుని చంపింది తానే అని ఒప్పుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక తర్వాత వల్లభ తల్లితో వాయుని చంపింది నువ్వే అని ఎందుకు ఒప్పుకున్నావని ప్రశిస్తాడు. దీంతో తిలోత్తమ వాయు చనిపోయినప్పుడు గాయత్రీ అక్కయ్య ఢీలా పడిపోయిందని.. ఇప్పుడు వాయుని చంపింది తానే అని తెలుసుకున్న విశాల్‌కు కూడా అదే పరిస్థితి దాపరిస్తుందని అంటుంది.  


ఇక వాయుని చంపానని చెప్పడం వల్ల తనకు వచ్చే నష్టం, భయం ఏమీ లేదని తిలోత్తమ వల్లభతో అంటుంది.  అందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివి అయిపోతావని వల్లభ అంటే అది తనకు కొత్తేమీ కాదని తిలోత్తమ అంటుంది. అయితే ఏదో ఒకరోజు అందరికీ తన అసలు రంగు తెలిసిపోతుందని ఇంట్లో అందరి తన మీద అభిప్రాయం మార్చుకునేలోపే వాయుకి సంబంధించిన రహస్యాలు సంపాదించి వాటి వల్ల ప్రయోజనాలు పొంది ఎవరికీ తెలీకుండా ఎవరికీ దొరకనంత దూరంగా వెళ్లిపోవాలని కొడుకుతో చెప్తుంది.  


మరోవైపు తిలోత్తమ పేరు మీద ఓ లెటర్ వస్తుంది. దీంతో తిలోత్తమ లెటర్ తీసుకొని చదువుతుంది. అందులో రమణమ్మ భర్త చనిపోయాక తను ఏమయ్యిందో ఎవ్వరికీ తెలీయదని.. ఒక్క నీకే తెలుసని. నీ గురించి లోకానికి తెలిసిపోతుందన్న భయంతో రమణమ్మ జోలికి వస్తే మాత్రం అని రాసి ఉంటుంది. దీంతో అందరూ రమణమ్మ ఎవరని నిలదీస్తారు.  తిలోత్తమ మాత్రం రమణమ్మ ఇంకా బతికే ఉందా అని అంటుంది.  


ఇక తిలోత్తమ విక్రాంత్‌ని పిలిచి చెంప చెల్లుమని పిస్తుంది. అందరూ షాక్ అయి విక్రాంత్‌ని ఎందుకు కొట్టావని అడుగుతారు. దాంతో తిలోత్తమ వాయు పేరుతో తనకు ఉత్తరాలు రాస్తుంది తన కొడుకు విక్రాంతే అని చెప్తుంది. ఎలా కనిపెట్టావని అందరూ అడగడంతో విక్రాంత్‌కు ప్రియాతి ప్రియమైన అని రాయడం రాదని లెటర్‌లో ఆ పదం చూసి అది విక్రాంత్ పనే అని గుర్తుపట్టానని చెప్తుంది. 


 విక్రాంత్ కూడా ఆ లెటర్ రాసింది తానే అని ఒప్పుకుంటాడు. గాయత్రీ పెద్దమ్మ అపురూపంగా చూసుకున్న వాయుని తన తల్లి ఎందుకు చంపేసిందో  తెలుసుకోవడానికి ఇలా ఉత్తరం రాశానని అంటాడు.  


ఇక గత ఎపిసోడ్‌లో నయని, కాషాయరంగు చీర కట్టుకున్న ఆవిడతో మాట్లాడటం విక్రాంత్ చూస్తాడు. ఆవిడ ఎవరో తెలుసా అని నయనికి అడిగితే తెలీదు అంటుంది. దీంతో విక్రాంత్ ఆవిడే రమణమ్మ అని చెప్తాడు. నయని షాక్ అయిపోతుంది.   


Also Read: 'త్రినయని' సీరియల్ మే 9: విక్రాంత్‌ చెంప పగలగొట్టిన తిలోత్తమ.. రమణమ్మ బతికే ఉందన్న నిజం తెలుసుకున్న కుటుంబం!