Guppedanta Manasu  Serial Today Episode: వసుధారను కిడ్నాప్‌ చేయడానికి వెళ్లిన రాజీవ్‌ను.. వసుధార చూడటంతో రాజీవ్‌ అక్కడి నుంచి పారిపోతాడు. వసుధార తనను చూసిందని అందరికి ఈ విషయం చెప్తుందని రాజీవ్‌ ఆలోచిస్తుంటాడు. ఇంతలో శైలేంద్ర ఫోన్‌ చేయడంతో అప్పుడే వీడికి కూడా విషయం తెలిసిందన్నమాట అనుకుంటూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు రాజీవ్‌. మరోవైపు రాజీవ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని శైలేంద్ర ఇరిటేట్‌గా ఫీలవుతాడు. ఇంతలో ఆఫీసు స్టాఫ్‌ వచ్చి శైలేంద్రకు నోటీసులు ఇస్తాడు.


శైలేంద్ర: ఏం నోటీసు?


స్టాఫ్‌: మనుగారి నుంచి నోటీసు వచ్చింది.


శైలేంద్ర: అవునా? వాడు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాడు కదా? వాణ్నించి నోటీసు రావడం ఏంటి? ఇటివ్వు.. వాటీజ్‌ దిస్‌ నాన్‌సెన్స్‌


స్టాఫ్‌: సార్‌ పదిహేను రోజుల్లో ఆయనకు ఇవ్వాల్సిన యాభై కోట్లు ఇవ్వకపోతే కాలేజ్‌ హ్యాండోవర్‌ చేసుకుంటామంటున్నారు సార్‌.


శైలేంద్ర: అది నాకు అర్థం అవుతుంది. నాకు ఇంగ్లీష్‌ వచ్చు అయినా వాడు కాలేజ్‌ హ్యాండోవర్‌ చేసుకోవడం ఏంటి? నేను చూసుకుంటూ ఉంటానా?


అంటూ ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంటే పక్కనుంచి అంతా గమనిస్తున్న వసు, మహేంద్ర నవ్వుకుంటూ శైలేంద్ర దగ్గరకు వచ్చి సీరియస్‌గా ఏమైందని అడుగుతారు. మను పంపించిన నోటీసు చూపిస్తాడు. ఏమీ ఎరగనట్టు మను మనకు నోటీసు పంపించడం ఏంటని నటిస్తారు. శైలేంద్ర సీరియస్‌గా నేను వెళ్లి మనుతో మాట్లాడతానని వెళ్లిపోతాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మనును కలిసి కాలేజీ నీకు బాకి ఉండటమేంటని ప్రశ్నిస్తాడు. ఆ విషయం నీకు, నాకు తెలుసు అందరికీ తెలియదు కదా? అనగానే జరిగిందేదో జరిగిపోయింది అంతా వదిలేసెయ్‌ అనగానే నన్ను లేని పోని కేసులో మీరు ఇరికించారుగా నేను మీ కాలేజీని ఎలా వదిలేస్తాను.. నిజంగా రాజీవ్‌ చనిపోలేదు.. బతికే ఉన్నాడని నాకు తెలుసు అనగానే శైలేంద్ర షాక్‌ అవుతాడు. ఇంతలో మను నన్ను ఈ కేసు నుంచి తప్పిస్తే.. నీకు కాలేజీ మొత్తాన్ని అప్పగిస్తానని ఎండీ పదవి కూడా నీదేనని ఆఫర్‌ చేస్తాడు. అయితే శైలేంద్ర ఇందులో ఏదో తిరకాసు ఉందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర, వసుధార శైలేంద్ర గురించే మాట్లాడుకుంటుంటారు.


మహేంద్ర: మన ప్లాన్ ప్రకారం శైలేంద్ర మను దగ్గరకు వెళ్లాడు కదా? అక్కడ ఏం జరిగిందో ఏంటో? మను వాడితో డీల్‌ మాట్లాడి ఉంటాడు. శైలేంద్ర ఒప్పుకుంటాడో లేదో..


వసు: అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాడు మామయ్య. ఇలాంటి విషయాల్లో దుర్మార్గులు చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. అంత తొందరగా నిర్ణయం తీసుకోరు. మామయ్యా ఆ శైలేంద్ర వస్తున్నాడు.


మహేంద్ర: శైలేంద్ర మనుతో మాట్లాడావా? నోటీసు వెనక్కి తీసుకుంటానన్నాడా?


శైలేంద్ర: లేదు బాబాయ్‌ వాడు నా మాట వినడం లేదు.


మహేంద్ర: అదేంటి శైలేంద్ర గట్టిగా అడగలేకపోయావా?


శైలేంద్ర: అడిగాను బాబాయ్‌.. చాలా గట్టిగా ఎన్ని రకాలుగా అడగాలో అన్ని రకాలుగా అడిగాను బాబాయ్‌. కానీ వాడు అన్నింటికి తెగించి ఈ నోటీసు పంపించాడు బాబాయ్‌.


వసు: అసలు మను గారు ఇలా ఎందుకు చేస్తున్నారు మామయ్య. తను అసలు డబ్బు మనిషి కాదే?


మహేంద్ర: ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఇంత జరుగుతున్నా నువ్వు ఇంకా పాజిటివ్‌గా ఎలా ఆలోచిస్తున్నావు. తనెంత స్వార్థపరుడో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది అమ్మా.


 అంటూ మహేంద్ర, వసుధార ఇద్దరూ  బాధపడినట్లు నటిస్తారు. దీంతో ఇప్పుడు బాధపడి  ఏం లాభం అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. ఇప్పుడు యాభై కోట్లు మనం ఎలా తీసుకొస్తాం అని వసుధార, మహేంద్రను ప్రశ్నిస్తుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: సునీత జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క పాట - హీరోయిన్‌గానూ అవకాశాలు, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?