Trinayani October 18th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో నయని: నన్ను క్షమించండి బాబు గారు కానీ పెద్ద బొట్టమ్మ కూడా ఉలూచి కి తల్లే కదా. ఒక తల్లి వేదన ఏంటో నాకు తెలుసు

విశాల్: అలాగైతే తిలోత్తమ అమ్మ కూడా తల్లే కదా 

నయని: కాదు నేను దానికి ఏకీభవించను. హత్య చేసిన ఆవిడ తల్లిగా గుర్తించబడదు అని నోరు జారుతుంది నయని.

విశాల్: హత్య చేయడం ఏంటి? అని విశాల్ అడుగుతాడు.

నయని: అనవసరంగా నోరు జారానే అని మనసులో అనుకుంటుంది.

విశాల్: గాయత్రి అమ్మను చంపింది తిలోత్తమ అమ్మే అని తెలిసినా కూడా చెప్పట్లేదా అని మనసులో అనుకుంటాడు.

నయని: గంగయ్య ని అత్తయ్య చంపేశారు. విక్రాంత్, వల్లభలకు తండ్రి అని తెలిసిన తర్వాత సమాజంలో మావయ్య గారే తన భర్తగా ఉండాలి అని గంగయ్యని చంపేశారు అని నా నమ్మకం.

విశాల్: లేదు అది కేవలం నీ అపోహ మాత్రమే, దానికి సాక్షాలు లేవు. కనుక అది నిజమై ఉండదు ఇంక చాలు వదిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశాల్.

నయని: ప్రస్తుతానికి బాబు గారి దగ్గర నుంచి తప్పించుకున్నాను అని మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత సీన్ లో సుమన, ఉలూచి తన మీద బుస్సు కొట్టిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్రాంత్ వస్తాడు.

విక్రాంత్: తినకపోతే నీరసం వచ్చి అలాగే కళ్ళు తిరిగి పడిపోతావు. నీకేమైనా అయితే డబ్బు అనుభవించలేక పోతావు కదా జాగ్రత్త

సుమన: ఈ టైంలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండవు కాబట్టి నేను వెళ్లడం లేదు లేకపోతే అక్కడికి వెళ్లి తింటాను. అయినా మీకు ఏమాత్రం బాధగా లేదా అక్కడ మా అక్క నా సొంత కూతుర్నే పెద్ద బొట్టమ్మకి ఇస్తుంది. వాళ్లంత నాటకం ఆడినా సరే మీరు ఏమాత్రం పట్టనట్టున్నారు

Also Read: పోలీసులకి దొరికిపోయిన రాజ్, కావ్య- దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కైన రాహుల్!

విక్రాంత్: ఇప్పుడేం కాలేదు కదా? అయినా నీకు డబ్బులు వచ్చేసాయి ఇంకా నీ పాప ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?

సుమన: ఉలూచి ఉన్నది కాబట్టే 10 కోట్లు అయినా వచ్చాయి లేకపోతే ఉన్నది కూడా తీసుకొని వెళ్ళిపోతారు బావగారు.

విక్రాంత్: నీ భయం ఉలూచి మీద కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ పోతాయి అని. అని చెప్పి అక్కడి నుంచి కోపం గా వెళ్ళిపోతాడు విక్రాంత్.

ఆ తర్వాత సీన్లో నయని వంట గదిలో ఉండగా తిలోత్తమ, వల్లభలు అక్కడికి వస్తారు.

తిలోత్తమ: నీతో కొంచెం సేపు మాట్లాడాలి నయని

నయని: చెప్పండి అత్తయ్య

తిలోత్తమ: నీ పెద్ద కూతురు గాయత్రి జాడ ఎక్కడుందో మాకు తెలిసింది అని అనగా నయని ముఖంలో ఏ మార్పు ఉండదు.

వల్లభ: చూసావా అమ్మ సొంత కూతురు జాడ తెలిసిందని తెలిసినా కూడా చిన్న మరదలి ముఖంలో అసలు ఏ మార్పు లేదు

నయని: గాయత్రమ్మ తిరిగి పునర్జన్మ ఎత్తారంటే అది కేవలం నా బిడ్డ గానే. ఒకవేళ గాయత్రి అమ్మ ఎక్కడున్నారో నాకు తెలియకపోతే మీకు తెలియదు. మీకు తెలియకపోతే నాకు తెలియదు. నిజంగా గాయత్రి అమ్మగారే మీకు దొరికుంటే మీ నుదుటిమీద పౌడర్ ఉండదు చెమటలు ఉంటాయి ఆ భయంతో చీర తడిచిపోతుంది కదా అత్తయ్య. అందుకే మీరు చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు అని నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

వల్లభ: చూసావా అమ్మ ఎంత పొగరో 

ఆ తర్వాత సీన్లో గురువుగారు కంగారుగా ఇంటికి వచ్చి అందరిని హాల్లోకి పిలుస్తారు.

గురువుగారు: అందరూ వినండి దేవి నవరాత్రుల త్వరలోనే వస్తున్నాయి. కనుక విశాలాక్షి చెప్పినట్టు ఒక రోజు పిల్లలకి పాలు దొరకవు జాగ్రత్తగా ఉండాలి.

నయని: అవును గురువుగారు ఒక రోజంతా పిల్లలకు పాలు దొరకవు అంటే వినడానికి చాలా బాధగా ఉన్నది దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే బాగున్ను

గురువుగారు: మీలో ఎవరు సాహసానికి సిద్ధపడుతున్నారు చెప్తే నేను రక్షణ కవచం సిద్ధం చేస్తాను.

హాసిని: ఏ సాహసం గురువుగారు?

Also Read: శైలేంద్ర మాటలు వినేసి రివర్సైన రిషి, వసు సేవలో తరిస్తోన్న ఈగోమాస్టర్!

గురువుగారు: ప్రాణత్యాగం. పిల్లల్ని కన్న ఎవరైనా ఒకరు ప్రాణత్యాగం చేస్తే నేను దానికి రక్షణ కోసం సిద్ధం చేస్తాను అని అనగా ఒకసారి అందరూ హాడలిపోతారు.

దురంధర: జీవితంలో మొదటిసారి పిల్లలు లేనందువల్ల నా ప్రాణాలు కాపాడుకున్నాను అనిపిస్తుంది.

హాసిని: ఇక్కడ నేను, చిట్టి, చెల్లి ముగ్గురం పిల్లల్ని కన్నవాళ్ళమే. కాకపోతే మా అందరికన్నా ముందు మా అత్తయ్య గారే పిల్లల్ని కన్నారు కనుక తనే చస్తే బాగుంటుంది.

తిలోత్తమ: ఎప్పుడైతే నా పిల్లలు వాళ్లు పిల్లలకు జన్మనిచ్చారు అప్పుడే నన్ను లెక్కలో నుంచి తీసేయాలి, నన్ను కలపొద్దు.

నయని: పిల్లల కోసం నేను ప్రాణత్యానికి సిద్ధపడతాను. వీళ్ళందరి భవిష్యత్తుకి నా ప్రాణాన్ని అడ్డు పెడతాను.

హాసిని: వద్దు చెల్లి. అదే పరిస్థితి వస్తే నేనే ప్రాణత్యాగం చేస్తాను. మీ మీద చాలామంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారు. నా మీద ఎవరు ఆధారపడి లేరు కనుక నేనే ప్రాణత్యాగం చేస్తాను

సుమన: ఒకవేళ నువ్వు చస్తే నీకు ఉన్న ఆస్తి కూడా పెదబావ గారికి వెళ్ళిపోతుంది హాసిని అక్క.

విక్రాంత్: అంతేకానీ నువ్వు ప్రాణత్యాగానికి మాత్రం సిద్ధపడవు కదా సుమన?

సుమన: నేను కన్న ఉలూచి ఎప్పుడు మనిషిలా మారుతాదో, ఎప్పుడు పాములా మారుతుందో కూడా తెలీదు. కనీసం ఎన్ని రోజులు నాతో ఉంటాదో కూడా తెలియదు మరి నేను ఎందుకు ప్రాణత్యాగం చేయాలి. అయినా విశాలాక్షి చెప్పినవని జరిగిపోతాయా ఏంటి?

గురువుగారు: కచ్చితంగా జరుగుతాయి. విశాలాక్షి శివ భక్తురాలు. తన నోట్లో నుంచి వచ్చిన ప్రతి వాక్యం నిజమవుతుంది.

తిలోత్తమ: అదే కానీ నిజమైతే నయనికి ఏమైనా జరిగితే విశాల్ తట్టుకోలేడు అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Join Us On Telegram: https://t.me/abpdesamofficial