వదిన తర్వాత మాట్లాడుకుందాం.. ముందు అమ్మవారి దగ్గర దీపారాధన చేయండని విశాల్‌ అంటాడు. ఇక విక్రాంత్‌ నయనితో వదిన పూలు పెట్టి అగరబత్తీలు వెలిగించండి అని చెప్పాడు. దీంతో వారు దీపం వెలిగించి పూజ మొదలు పెడతారు. అక్కడే ఉన్న పెద్దావిడ నయనితో మంచిగా కోరుకోండి అమ్మా ఆ తల్లి అనుగ్రహం ఉంటే కష్టాలు తీరిపోతాయని చెప్తుంది. 


నయని: అమ్మను నమ్ముకున్న వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. 


పెద్దావిడ: మా కోడలికి ఇక్కడి దర్శనం చేశాకే.. ఇప్పుడు మూడో నెల.


నయని: మంచిదమ్మ శుభవార్త చెప్పారు.


మరోవైపు అఖండ స్వామీ ఉలూచినీ తీసుకురమ్మని వల్లభకు సైగ చేస్తాడు. 


వల్లభ: చిన్న మరదలా పాపను ఇలా ఇవ్వు ఎత్తుకుంటాను.


సుమన: పర్వాలేదు బావగారు.


వల్లభ: అది కాదు చిన్న మరదలా ఇంత దూరం వచ్చారు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది కదా ఇటివ్వు.


హాసిని: ఇవ్వు చిట్టీ పూనాను ఎత్తుకోకపోయినా ఉలూచిని ఎత్తుకుంటా అంటున్నారు. మగవారు పని చేస్తా అన్నప్పుడు ఆలోచించకూడదు


సుమన: సరే.. జాగ్రత్త బావగారు అంటూ పాపను వల్లభకు అందిస్తుంది. 


నాకు తెలుసులే మరదలా ఇటివ్వు అంటూ ఉలూచిని తీసుకుంటాడు. పాపను ఆడిస్తున్నట్లు అలా అక్కడి నుంచి అఖండ స్వామి దగ్గరకు తీసుకెళ్తాడు.


వల్లభ: అఖండ స్వామి ఉలూచి పాపను ఎందుకు ఇక్కడికి తీసుకు రమ్మన్నారు.


అఖండ:  ఉలూచి పాప ఇక్కడికి వచ్చినప్పుడే కాలా ఎక్కడ ఉందో తెలుస్తుంది. 


వల్లభ: కాలానా.. కాలా కాలా అంటూనే ఉన్నారు ఏంటది.


అఖండ: వందడుగుల పాము. కాలా ఎక్కడ ఉంటుందో అక్కడే గాయత్రీ దేవి దాచిపెట్టిన రహస్యం ఉంటుందని నా అంచనా.


వల్లభ: స్వామి.. 6 అడుగుల పామును చూస్తేనే నా అడుగులు ఎటు పడతాయో నాకే తెలీదు. 100 అడుగుల పామును చూస్తే ఇంకేమైనా ఉందా.. అసలు మనం ఉంటామా.. 


అఖండ: ఉలూచిని ఇవ్వు.


వల్లభ: ఎందుకు


అఖండ: రహస్యం చేదిద్ధాం ఉలూచిని ఇవ్వు. 


వల్లభ: (పాపను అఖండకు ఇస్తూ) ఎత్తుకొని పోకండి స్వామి నా తోలు తీస్తారు.


అఖండ: ఉలూచి వచ్చింది కాలా.. ఉలూచి వచ్చింది కాలా అంటూ గట్టిగా అరుస్తాడు. 


వల్లభ: అయ్యో ఏంటింది.. అఖండ స్వామి ప్లీజ్ ప్లీజ్ స్వామీ మెల్లగా.


ఇంతలో మరో స్వామి అఖండ మెడ మీద త్రిశూలం పెట్టి ఎవరికి దక్కాలో వారికే దక్కాలిని చెప్పి ఉలూచినీ తీసుకుపో అని వల్లభకు చెప్పాడు. దీంతో భయపడి వల్లభ ఉలూచిని తీసుకెళ్లిపోతాడు.


సుమన: పాప.. పాప ఎక్కడండి.


నయని: బావగారు ఎత్తుకున్నారు కదా.


విక్రాంత్: బ్రో ఎక్కడున్నాడు..


విశాల్:  అన్నయ్యా.. అన్నయ్యా 


వల్లభ: ఇదిగో ఉన్నా ఉన్నా నేనిక్కడే ఉన్నా.


హాసిని: ఎక్కడికి వెళ్లారండి.


వల్లభ: పాపకు పిట్టల్ని చూపిద్దాం అని అలా తీసుకెళ్లా.


విశాల్: అన్నయ్యా వైల్డ్‌ యానిమల్స్ ఏమైనా వస్తే ప్రమాదం కదా.


వల్లభ: అవును అవును.. పూజ అయిపోయిందా?


విక్రాంత్: దండం పెట్టుకో.


నయని: అమ్మా నాకు కలలో కనిపించిన ఆ పెట్టే ఎక్కడ ఉందో తెలియడం లేదు. నీ విగ్రహం కనిపించింది. ఈ చుట్టు పక్కలే ఉండాలి. కానీ ఎక్కడ అనేది తెలీదు. ఈ అడవిలో ఎక్కడని వెతకను. భజరంగి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ ఆకును పట్టుకొని వెతుకుతాను. ఎక్కడ ఉందో దారి తెలుస్తుంది అన్న నమ్మకం అంతే. 


ఇంతలో విశాల్ నయని నేను వెతుకుతాను అని చెప్పాడు.. విక్రాంత్ కూడా బ్రో పదండి అని చెప్పి తలా ఓ వైపు వెళ్లేందుకు సిద్ధం అవుతారు. అప్పుడే సుమన కాలు జారిపడిపోవడంతో తన చేతిలో ఉన్న పాపను నయని పట్టుకుంటుంది. దీంతో నయని చేతిలో ఉన్న తమలాపాకుకు పాప చేయి తగిలి అది ఎగురుతూ వెళ్లి పక్కనే ఉన్న పెద్ద రాయిపై పడుతుంది. దీంతో ఆ రాయి విరిగి దాని నుంచి 100 అడుగుల పాము దర్శనం ఇస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు.  నయని వాళ్లకు కావాల్సిన పెట్టేను పాము వాళ్ల ఎదురుగా పెడుతుంది.  


స్వామీజీ: కాలా.. కాలా దర్శనం.. ఇక్కడ ఒక్క నిమిషానికి మించి ఉండదు. ఉలూచిని ఎత్తుకెళ్లి ఆ పెట్టెను తీసుకో తల్లి.


సుమన: అక్కా.. అక్కా.. అక్కా పాప జాగ్రత్త.


హాసిని: చిట్టీ నీకు పెట్టే కావాలి అన్నావు కదా వెళ్లి తీసుకో.


సుమన: అయ్యో వద్దు అంత రిస్క్ తీసుకోలేను.


నయని పాపను ఎత్తుకొని ఆ పెట్టేను తీసుకుంటుంది. 


స్వామీజీ: అమ్మా మూడు కళ్లుండి.. ముక్కు పుడక ఉండి.. నీవెవరో తెలిసే ఇస్తుంది. వెళ్లు తల్లి వెళ్లు.


విశాల్: పదండి.. అందరూ పదండి.


వల్లభ: మమ్మీ రా.. త్వరగా రా మమ్మీ ఇదే ఆ పెట్టే.


తిలోత్తమ: గుడ్డ కప్పేసి పెట్టారేంట్రా.. తీ చూద్దాం.


వల్లభ గుడ్డ తీయగా అక్కడ హాసిని ఉంటుంది. పెద్దగా నవ్వుతూ.. వల్లభను భయపెడుతుంది. 


తిలోత్తమ: రేయ్.. మెంటల్ భూతం కాదురా నీ పెళ్లాం.


 మీ ఆవిడ మీ అమ్మకు పెట్టెను పరిచయం చేస్తాను అంటే ఏమో అనుకున్నా అల్లుడు ఇలా ఆటపట్టించింది అన్నమాట అని వాళ్ల అత్త అంటుంది. 


హాసిని: మా ఆయన జడుసుకు చచ్చాడు.


వల్లభ: ఏయ్.. తమాషాగా ఉందా నీకు భయంతో గుండె ఆగిపోతే.


హాసిని: హా.. ఉంటేగా.


తిలోత్తమ: జోకులకు ఏం కానీ.. మీరు తీసుకొచ్చిన నాగులపురం పెట్టే ఎక్కడ ఉంది.


విక్రాంత్: వదిన కప్పుకున్నట్లే పెట్టే కూడా క్లాత్ కప్పేసి పెట్టారు మమ్మీ అని చెప్పగానే తిలోత్తమ చూస్తుంది. ఏముంది ఇందులో అని అడుగుతుంది.  


విశాల్: ఇంకా తెరచి చూడలేదు అమ్మా.


సుమన: రాహుకాలం ఉందని అక్కడ ఓపెన్ చేయనివ్వలేదు. ఇంటికి వచ్చి చూద్దాం అంటే అందరూ స్నానం చేసి రండి అంది మా అక్క. 


నయని: చెల్లీ నాగలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చాం కదా.. హారతిఇచ్చి చూద్దాం అని అనుకున్నాను. 


హాసిని: చెల్లి మూడు సార్లు తిప్పి హారతి ఇవ్వు నేను గంట కొడతా


సుమన: ఇంక చాల్లే ఆపు అక్క. భక్తి పారవశం లోకి వెళ్లి పోయావంటే టైం చూసుకోవు.


వల్లభ: క్లాత్ తీయండి.. క్లాత్ తీయండి.


హాసిని: మీరు తీయండి.. 


వల్లభ: వద్దు ఇంకెవరు భూ అని అంటారో ఎవరికి తెలుసు.


విశాల్ నువ్వు తీయ్ అని తిలోత్తమ చెప్పగానే విశాల్ క్లాత్ తీస్తాడు. ఆ పెట్టేకు తాళం వేయకుండా తాడు కట్టి ఉంటుంది. దీంతో అందరూ తాళం లేకుండా తాడు ఉందేంటో అని సందేహం వ్యక్తం చేస్తారు. రాయితో రెండు ముక్కలు వేస్తే చెక్క ముక్కలవుతుందని అంటే నయని బాబాయ్ అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. అందులో ఏం ఉందో తెలియదు కదా అని అంటుంది.


మరోవైపు  తిలోత్తమ ఏ పురుగో పాము ఉన్నా ఈ పాటికి చచ్చి ఊరుకొని ఉంటుంది. ముందు ఆ తాడు తీయండి అని అంటుంది. విశాల్ పెట్టెకు ఉన్న తాడు తీయడానికి వెళ్తాడు. ఎంత ట్రై చేసిన తాడు ముడి వీడదు. దీంతో అందరూ షాక్ అవుతారు. అక్కడున్న వారంతా నయనిని ఆ తాడు తీయమని చెప్పారు. దీంతో నయని తాడు తీయడానికి వెళ్తుంది. అయినా తాడు రాకపోవడంతో అందరూ వృథా ప్రయాస వదిలేయమని చెప్తారు. దీంతో తిలోత్తమ అంత కష్టపడి తెచ్చి ఎలా వదిలేస్తారు అని చెప్పడంతో నేటి ఏపిసోడ్ పూర్తవుతుంది.