Trinayani serial november 10th epiosde: ఫోటోలో నుంచి గాయత్రీ దేవి వచ్చి పెట్టె తెరుస్తారా అంటూ జోకులు వేస్తూ.. తిలోత్తమ, సుమన, వల్లభ వెటకారంగా నవ్వుతుంటారు. ఇంతలో గురువుగారు మరికొద్ది సేపట్లో పెట్టె తెరచుకోనుందని చెప్పారు. దీంతో తిలోత్తమ ఏంటీ గాయత్రీ అక్క వచ్చి అని అనగానే గురువుగారు కోపంగా చూస్తారు. సరదా అయిపోయింది పెద్దమాతా అంటూ ఎద్దులయ్య వారిస్తారు. అతి చేస్తే మీ సరదా కూడా తీరిపోతుంది పుత్రా అని డమ్మక్క అంటుంది.
సుమన: స్వామి పెట్టె దానంతట అదే తెరచుకుంటుందా?
గురువుగారు: గాయత్రీ దేవే వచ్చి పెట్టె తెరుస్తుంది. నీ మనోవేదన నాకు అర్ధమైంది విశాలా..
విశాల్: (మనసులో..) గాయత్రీ పాప ఆ పెట్టె దగ్గరకు వస్తే తిలోత్తమ అమ్మ వాళ్లు గుర్తు పట్టేస్తారని నా భయం స్వామి
గురువుగారు: మాయా దేవి కనిపించకుండా చేస్తుంది వల్లభ. గాయత్రి దేవి రాదని మీరు అనుకున్నారు. వస్తుందని విధి చెప్తుంది. అద్భుతం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.
తిలోత్తమ: ఎలా.. అది ఎలా
గురువుగారు: అలా.. అని నాగులాపురం నాగలక్ష్మి అమ్మవారి దగ్గర ఉన్న అఘోరాని చూపిస్తారు. అఘోరా నయని వాళ్ల ఇంట్లోకి వస్తారు దీంతో అందరూ షాక్ అవుతారు. నయని: అఘోరా ఇంటికి వచ్చారు ఏంటి స్వామి.. ఏం జరగబోతోంది
వల్లభ: పెట్టె కోసం వచ్చారా స్వామి
అఘోరా: అమ్మకోసం వచ్చాను.. స్వామి ఆజ్ఞ
గురువుగారు: ఇంటి ఇల్లాలు నయని అనుమతి ఇస్తే నీ పని నీవు చేసుకోవచ్చు
అఘోరా: ఆజ్ఞ తల్లి
నయని: ఏం చేస్తారో చేయండి.. కానీ ఎవరికీ హాని చేయకండి
అఘోరా: పెట్టె తెరవాలి అంటే అమ్మ హస్తం తగలాలి ఆజ్ఞ తల్లి
ఇంతలో పావనామూర్తి సరే అను తల్లి అని అనగానే నయని సరే అంటుంది. అప్పుడు అఘోరా మంత్రాలు చెప్పగానే ఇల్లంతా పెద్ద గాలులు, పొగ అల్లుకుంటాయి. అందరూ పొగతో ఇబ్బంది పడతారు. అప్పుడు అఘోరా అక్కడే ఉన్న ఉలూచి పాప చేయి పట్టుకుని నడిపించుకుంటూ పెట్టె దగ్గరకు తీసుకెళ్లి పాపతో పెట్టె తాకిస్తారు. దీంతో పెట్టె తాడు ఊడిపోతుంది. తర్వాత అఘోరా పాపను మళ్లీ తను ఆడుకునే స్థానంలో కూర్చొపెట్టి వెళ్లిపోతారు. ఇక అందరూ పొగ పోయిందే అని అనుకుంటారు. అఘోరా కూడా వెళ్లిపోయారని సుమన అంటుంది. ఇక తిలోత్తమ అయితే ఏం ఎత్తుకుపోయారో చూసుకోండి అంటుంది.
Also Read: సీరియస్ సింహం కాదు రొమాంటిక్ రిషి - మహేంద్ర మాటలు బాగానే పనిచేశాయ్!
ఎద్దులయ్య: దొంగ బుద్ధి ఆయనకు ఉండదు మాత.. మేలు చేసే వెళ్లారు.
పావనమూర్తి: ఏం చేశారు పొగపెట్టి వెళ్లారు
డమ్మక్క: గాయత్రీ దేవి చేత పెట్టె తాళం తీయించి వెళ్లారు. చూడండి అనగానే అందరూ మరోసారి షాక్ అవుతారు.
నయని: అవును.. బాబుగారు తాడు తీసుంది.
విశాల్: స్వామి అంటే మా అమ్మ వచ్చి తాడు తీసిందా
గురువుగారు: అంతే కదా విశాలా
తిలోత్తమ: ఊరుకోండి గురువుగారు.. చిన్న పిల్లగా ఉండి గాయత్రి అక్క ఇక్కడికి వచ్చి తాడు తీయడం మళ్లీ వెళ్లి పోవడం జరిగిందా
ఎద్దులయ్య: అదే జరిగింది మాతా
ఇక నయని పెట్టె తెరవగా అందులో ఎర్రని వస్త్రంలో 5 గవ్వలు, తాళపత్ర గ్రంధాలు ఉంటాయి. దాన్ని చదవాలిని నయని ప్రయత్నించగా అక్షరాలు కనిపించవు. మానవులు ఎవరూ వాటిని చదవలేరని టైం వస్తే అది జరుగుతుందని ఎద్దులయ్య అంటారు. ఇక నయని వాటిని మళ్లీ పెట్టెలో పెట్టెస్తుంది. ఇక నయని, విశాల్, హాసిని ఆ అద్భుతం గురించి మాట్లాడుకుంటుంటే ఎవరో వీడియో తీసి ఆ వీడియోను హాసినీకి పంపించారు. ఆ వీడియో పంపింది ఎవరూ అని నయని అడగగానే విశాల్ ఆ విషయాలు వదిలేయ్ నేను వాళ్లని పట్టుకుంటా అంటాడు.
Also Read: వీలునామాలో తాతయ్య ఏం రాశారు- రుద్రాణికి ఆస్థి భాగం ఇవ్వొద్దన్న అపర్ణ!
ఇక మరోవైపు సుమన బట్టలు సర్దుతూ నయని తనను అనవసరంగా అడవికి తీసుకెళ్లిందని.. తన బిడ్డకు ఇబ్బంది పెట్టిందని తిట్టుకుంటుంది. విక్రాంత్ ఆ మాటలు వింటాడు. వాళ్ల ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక సుమన బిడ్డను 3 కోట్ల డబ్బు ఖర్చు పెట్టి కన్నాను అని అంటే విక్రాంత్ తిడతాడు. ఆ పసిపాపను నీ వంకర బుద్ధితో పాడు చేయకు అని హెచ్చరిస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయింది....