Trinayani August 29th: తిలోత్తమా, వల్లభ స్పృహ కోల్పోయిన విశాల్ ను చాపలో చుట్టుకొని వచ్చి చెరువు దగ్గరికి తీసుకొస్తారు. ఒక దగ్గర పడుకోబెట్టి వల్లభను రాయి తీసుకొని రమ్మని పంపిస్తుంది. ఇక తిలోత్తమా గతంలో తను విశాల్ ను చంపడానికి ప్రయత్నించిన ప్లాన్ లన్ని గుర్తుకు చేసుకొని అందులో ప్రతిసారి నయని కాపాడటంతో బ్రతికి పోయావు అని.. ఇక ఇప్పుడు నయని అడ్డు లేదు అని అనుకుంటుంది.


ఇక రాయిని చాపకు చుట్టి.. చాపను చెరువులో పడేస్తారు. మరోవైపు నయని తన భర్త కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక తల్లి, కొడుకులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఇంట్లో సుమన నొప్పులతో బాధపడుతూ నయనిపై కోప్పడుతూ కనిపిస్తూ ఉంటుంది. కింద విక్రాంత్ టెన్షన్ పడుతూ కనిపిస్తూ ఉంటాడు. సుమన గట్టిగా బిడ్డ పుడుతుంది. దురంధర, హాసిని పాము రూపంలో ఉన్న పెద్ద బొట్టమ్మను చూసి షాక్ అవుతారు. బిడ్డ ఏడుపు సౌండ్ రావడంతో విక్రాంత్ వెళ్ళటానికి ఇష్టపడడు. కానీ పావని మూర్తి బలవంతంగా తీసుకెళ్తాడు.


ఇక వారిద్దరు పాముని చూస్తూ అలా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి విక్రాంత్ వాళ్లు కూడా వచ్చి పామును చూసి షాక్ అవుతారు. ఇక తను పెద్ద బొట్టమ్మ అని.. తను మనకు పాము రూపంలోనే కనిపిస్తుంది అని హాసిని చెబుతుంది. ఇక తనే కాన్పు చేసింది అని.. బిడ్డ పుట్టాక పాముగా మారింది అని చెబుతుంది. స్పృహ కోల్పోయిన సుమన కళ్ళు తెరిచి పాప పుట్టింది అని సంతోషపడుతుంది


ఇక పెద్ద బొట్టమ్మ సుమనతో పండంటి ఆడపిల్ల పుట్టింది.. బిడ్డను చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ సుమనకు శుభాకాంక్షలు తెలిపుతారు. మరోవైపు నయని రోడ్డుపై కనిపించిన వారందరినీ విశాల్ గురించి అడుగుతూ ఉంటుంది.  ఇక ఎద్దులయ్య ప్రత్యక్షమై.. తనకి ఎంత కష్టమొచ్చిందో అని.. భర్త ఆచూకీ కోసం ఆరేటపడుతుందని తనను సహాయం  చేయనివ్వమంటూ విశాలాక్షి అమ్మవారిని కోరుకుంటాడు.


నయనికి ఎద్దులయ్య ఎదురుపడగా నయని విశాల్ గురించి అడుగుతూ ఉంటుంది. బాబు గారు ఎక్కడైనా కనిపించారా అని అడగటంతో.. ఆయన భూమి మీద ఉంటే కదా అని అనటంతో నయని భయపడుతుంది. మీ మాటలు అర్థం చేసుకోలేకపోతున్నాను అని.. విశాల్ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. దాంతో ఎద్దులయ్య నీకు సూచనంగా ఏదైనా అనిపిస్తే దాని ద్వారా నీ భర్తను కనిపెట్టవచ్చు అని చెప్పటంతో.. తనకు గతంలో మంగళసూత్రం నీళ్లల్లో మునుగుతున్నట్లు వచ్చిన ఘటన గుర్తుకు చేసుకుంటుంది.


దాంతో విశాల్ నీళ్లల్లో పడ్డాడని తెలుసుకొని వెంటనే నయని అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆ తర్వాత ఇంట్లో హాసిని.. నయని దంపతులు, తిలోత్తమా వాళ్లు కనిపించకపోయేసరికి వాళ్ళు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. సుమన ఎక్కడ అని అడగటంతో పాపకు పాలిస్తుంది అని హాసిని అంటుంది. అప్పుడే సుమన చేతులో పేపర్లు పట్టుకొని పాప పాలు తాగటం లేదు అని చెప్పుకుంటూ కిందికి వస్తుంది.


దాంతో విక్రాంత్ తనపై కోప్పడతాడు. ఇక తను ఆస్తి పేపర్లు పట్టుకొని రావటంతో ఇంట్లో వాళ్లంతా తనపై చిరాకు పడుతూ ఉంటారు. ఇక సుమన మాత్రం ఆస్తి గురించి విశాల్, నయని లను అడుగుతూ ఉంటుంది. వాళ్లు లేరని చెప్పటంతో.. కనీసం తన బిడ్డను కూడా చూడటానికి రాలేదు అని కోప్పడుతుంది. ఇంతకు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని  అనుమానం పడుతుంది.


also read it : Krishna Mukunda Murari August 28th: తల్లికి మనసులో మాట చెప్పేసిన మురారి.. నిజం తెలుసుకొని సంతోషపడుతున్న కృష్ణ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial