Trinayani September 8th Written Update: వల్లభ తిలోత్తమలు పరిగెత్తుకుంటూ అఖండస్వామి దగ్గరకు వస్తారు.


వల్లభ: సుమన పాలు పట్టుకుని, నయని పామును విడిపించడానికి ఇక్కడికే వస్తుంది.


అఖండ స్వామి: ఏ కలుషితం లేకుండా రక్తం పాలుగా మారేది కేవలం తల్లిపాలు మాత్రమే. నాగయ్య బయటికి రావడం ఖాయం. మీ ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖండస్వామి.


వల్లభ: పద మమ్మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. అసలకే గురువుగారు నన్ను శపించేశారు పాము విడుదలయితే అది వచ్చినన్నే కాటేస్తుంది. 


తిలోత్తమ: ఎలాగా మన ప్రాణాలు పోతాయి అన్నప్పుడు సాహసం చేద్దాము. అసలు నయని ఆ పాముని ఎలా విడిపిస్తుందో చూద్దాం అని చెప్పి ఒక మూలకి వెళ్లి దాక్కుంటారు. అదే సమయంలో నయని తన కూతురిని,  పాలని తీసుకుని  అక్కడికి వస్తుంది.


నయని: నిన్ను ఈ కుండలో బంధించారా నాగయ్య? ఎన్ని కష్టాలు పెట్టి ఉంటారు. నిన్ను విడిపించడానికి వచ్చాను పెద్దమ్మ చెప్పినట్టు తల్లిపాలు తీసుకుని వచ్చాను. అని చెప్పి ఆ పాలను ఆ కుండ మీద ఉన్న గరుడ ఆకారం మీద వేస్తుంది. ఆ పాలు పడిన వెంటనే ఆ గరుడ దండనం కాలిపోయి లోపల నుంచి నాగయ్య బయటకి వస్తాడు. ఇదంతా ఒక మూల నుంచి అఖండ స్వామి చూస్తాడు


Also Read: Prema Entha Madhuram September 8th: ద్యావుడా! ముసలోడికి మూడో పెళ్లి ఆఫర్ - అను ఊహల్లో ఆర్య!


అఖండస్వామి:  నాగయ్య దృష్టి తిలోత్తము మీద పడుతుంది. అనేలోగా నాగయ్య వెంటనే తిలోత్తమ వైపు చూస్తాడు నాగయ్య. వెళ్లి కాటు వేద్దాం అనేలోగా నయిని ఆపుతుంది.


నయని: ఆవిడ ప్రాణాలు తీసే హక్కు నీకు లేదు నాగయ్య. ఆవిడ చావు గాయత్రమ్మ గారి చేతిలోనే అని విశాలాక్షి అమ్మవారు ముందే రాసిపెట్టి ఉంచారు. దాన్ని మనం ఆపలేము. అని అనగా నాగయ్య మరో దిక్కు నుంచి బయటకు వెళ్ళిపోతాడు.


వల్లభ: థాంక్స్ నయని లేకపోతే ఆ పాము వచ్చి ముందు నన్నే కాటేసేది.


తిలోత్తమ: నా ప్రాణాలు గాయత్రి అక్క చేతిలో పోతాయి. అప్పటివరకు ఏ పాము మనల్ని ఏమీ చేయలేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు రా. అని వల్లభ ను తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక మూల నుంచి అఖండ స్వామి వింటాడు.


అఖండస్వామి: గాయత్రీ దేవి నయని చేతిలోనే ఉందని తెలియలేని మూర్ఖులకి ఇంకా ఆయుష్షు మిగిలి ఉందని తనలో తానే అనుకుంటాడు.


ఆ తర్వాత సీన్లో తిలోత్తమ, వల్లభలు హాల్లో కూర్చుని ఉంటారు.


వల్లభ: చూసావా మమ్మీ, నా కాళ్లు ఇంకా ఎలా వణుకుతున్నాయో నాకు ఇంకా భయం పోలేదు. అప్పుడే అక్కడికి మిగిలిన కుటుంబ సభ్యులందరూ వస్తారు.


హాసిని: ఒంటిలో పిక్క ఉంటే చాలుదు గుండెల్లో ధైర్యం ఉండాలి. 


Also Read: నిజం తెలుసుకున్న నయని, సుమన దగ్గర నుంచి తెలివిగా పాలు కాజేసిన పెద్ద బొట్టమ్మ


దురంధర: అంత కాలు వణికే విషయం ఏమైంది అల్లుడు?


హాసిని: అంత భయం ఎందుకు నాగయ్య ఏమి కాటేయలేదు కదా ప్రాణ బిక్ష పెట్టి వెళ్లిపోయాడు కదా?


దురంధర: ఏం మాట్లాడుతున్నారు ఇదంతా ఎప్పుడు జరిగింది?


వల్లభ: ఆ పాము నా దగ్గరికి రావడం, నయని చెప్పడం వల్ల ఆగిపోయి తన దారిన తను వెళ్ళిపోవడం, అన్నీ జరిగిపోయాయి.


సుమన: నా పాలు లేకుండా ఆ పాముకి విడుదల లేదు కదా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు?


హాసిని: పాలు ఇవ్వడం జరిగింది, విడుదల చేయడం కూడా జరిగింది. నువ్వు నీ బిడ్డకి పాలిస్తే తను పెద్ద బొట్టు అమ్మకి పాలు ఇచ్చింది అని జరిగిన విషయం అంతా చెప్తుంది. దానికి అందరూ ఒకేసారి ఆశ్చర్యపోతారు.


తిలోత్తమ: పాలు కాజేయడానికి సిగ్గుగా లేదు?


నయని: అది మీరు నాగయ్యని బంధించక ముందు ఉండాలి.


దురంధర: ఏంటి మీరు మాట్లాడేది? వదిన నగయ్య ని బంధించింది మీరా?


వల్లభ: అవును నయని యే మాకు ప్రాణం బిక్ష పెట్టింది.


హాసిని: అనవసరంగా వదిలేసారు. లేకపోతే పంజాగుట్ట స్మశానానికి వెళ్లి చితి పేర్చి మిమ్మల్ని తగలబెట్టి, నా మంగళసూత్రాన్ని కూడా అందులో పడేసే దాన్ని. మీరు భూమికి భారం, ఈ తాడు నా మెడకి భారం.


విక్రాంత్: చూసావా, అమ్మ మాటలు వింటే ఆఖరికి నీ ప్రాణం పోయే స్థితికి వచ్చేది నయని వదినే నిన్ను కాపాడింది.


సుమన: నా పాలే కాపాడాయి.


విక్రాంత్: మధ్యలో ఎద్దులా వచ్చి తలదూర్చకు.


దురంధర: అబ్బా మీ గొడవలన్నీ ఆపండి. ఇంక విశాల్ బాబుకి నయం అయినట్టే కదా?


నయని: అవుతుంది పిన్ని.


హాసిని: రేపు శ్రావణ శుక్రవారం కదా పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటే అంతా మంచే జరుగుతది.


నయని: కిందటి వారం కూడా అవ్వలేదు. ఇదే చివరి శుక్రవారం పూజ చేసి అమ్మవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుందాం.


 ఆ తర్వాత రోజు అందరూ వరలక్ష్మి పూజకి ఏర్పాట్లు చేస్తారు.


వల్లభ: ఆ ప్లేట్ ని చెప్తే నేనే తెస్తాను కదా అని అమ్మవారికి అలంకరించే ఒక డబ్బులు ఉన్న ప్లేట్ గురించి అంటాడు.


హాసిని: మీకు చెప్తే ప్లేట్ వస్తుంది కాని అందులో ఉన్న డబ్బు రాదు. అసలకే ఇలాంటి విషయాల్లో మా ఆయన చాలా తెలివైనోడు.


త్రిలోత్తమ: అసలు మనం ఏం దొంగనుంచేమో వాళ్ళకి తెలీదు కదా అని వల్లభ చెవిలో అంటుంది.


 కొద్దిసేపటి క్రితం ఎవరూ లేనప్పుడు వల్లభ, తులోతమలు వరలక్ష్మి దేవి విగ్రహం ఎదురుగుండా నించోని ఉంటారు.


వల్లభ: ఒక్కొక్కరి మొఖాలు చూడు మమ్మీ ఎలాగ వెలిగిపోతున్నాయో? నాగయ్యని విడిపించిన తర్వాత నయనకి నమ్మకం కూడా పెరిగిపోయింది. ఈరోజు ఈ పూజ జరగకూడదు అంటే ఈ విగ్రహాన్ని దాచేద్దాము. ఎవరూ లేరు ఇదే మంచి సమయం.


తిలోత్తమ: సరే. అని అనగా ఇద్దరు ఆ విగ్రహాన్ని దాచేస్తారు. ఈ విషయాన్ని గుర్తుతెచ్చుకొని నవ్వుకుంటారు తిలోత్తమ, వల్లభలు.


వల్లభ: విశాల్ ఎక్కడ నయిని?


నయని: ఆయన పిల్లలతో ఉంటానన్నారు బావగారు.


హాసిని: పిలవకుండా వస్తున్నారు లలిత అత్తయ్య అని అంటుంది. అదే సమయంలో లలిత కార్ దిగి గుమ్మం ముందు అడుగుపెడుతుంది. ఇంతలో తన చూపు ఇంటి ఎడమవైపు మూలన ఉన్న ఒక వస్తువు వైపుకు వెళ్తుంది. ఆ వస్తువు ఏంటి అని చూడగా అక్కడ వరలక్ష్మి దేవి విగ్రహం ఉంటుంది.


లలిత: పూజలో కొలువై ఉండాల్సిన దానివి ఎవరమ్మా నిన్ను ఇక్కడ పెట్టారు. అని అంటుంది. అప్పుడు తనకి ఒక గొంతు వినిపిస్తుంది. వరలక్ష్మి తానుగా రాలేదమ్మా, అని ఆ గొంతు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.