Trinayani September 7th Written Update: విక్రాంత్, సుమన గదిలో మాట్లాడుతూ ఉంటారు.


విక్రాంత్: పాలిస్తే అందం పాడైపోతాది అని మహిళా సంఘాలతో ముచ్చట్లు పెట్టడమే తప్ప ఏనాడు గాయిత్రికి పాలిచ్చిన పాపానికి పోలేదు.


సుమన: మీరు ఎప్పుడూ నన్నే తిడుతూ ఉంటారు. నన్ను తిట్టకుండా మీకు రోజు గడవదు. అయినా ఆవు పాలు తెప్పించమని చెప్పాను అవి వస్తే పడతాను.


విక్రాంత్: పాప పుట్టి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే బయట పాలు తెప్పిస్తున్నావు ఇంక నువ్వు మారవు. కనీసం ఆ పాలను నయని వదినకి అయినా ఇవ్వచ్చు కదా.


సుమన: ఆహా అదన్నమాట సంగతి, ఈ గొడవ అంతా అక్కకి పాలు ఇవ్వలేదని. కన్న కూతురికి ఇవ్వలేదు మా అక్క కి ఇస్తానని అనుకోవడం మీ మూర్ఖత్వం. ఆ రోగిస్టులా ఉండే ముసలి వాడి కోసం అనేలోగా విక్రాంత్ సుమన మీద చేయి చేసుకోబోతాడు.


సుమన: చెప్పాను ఇందాకే మీరు కొట్టిన తిట్టినా నేను పాలిచ్చే ప్రసక్తే లేదు .


విక్రాంత్: ఏదో ఒక రోజు నీ పిచ్చికి ఎక్కడ నిన్ను చంపేస్తానేమో అని భయంగా ఉంది. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


ఆ తర్వాత సీన్లో నయని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా పెద్ద బొట్టమ్మ అక్కడికి వస్తుంది.


పెద్ద బొట్టమ్మ: మీ ఆయన్ని మామూలు స్థితికి ఎలా తేవాలి అని ఆలోచిస్తున్నావు కదా?


నయని: అది నాగయ్య వల్లే సాధ్యమవుతుంది కానీ నాగయ్యని ఎవరో బంధించారు కదా మరోవైపు సుమన పాలు అడిగితే ఇవ్వనంటుంది.


పెద్ద బబొట్టమ్మ: అర్థమైంది నయిని తల్లిపాలు పట్టించి నా భర్తని బంధించిన కుండలో వేయాలి. అందులో ఉన్న మాలలో తల్లిపాలు కలవగానే నిచ్చేతనం జరుగుతుంది.


నయని: నాగయ్యని కుండలో బంధించారా?


పెద్ద బొట్టమ్మ: ఆ పని చేసింది ఎవరో కాదు మీ అత్త తిలోత్తమా. ఆరోజు సుమనకి ప్రసవన బాగా జరగాలి అంటే కుండలో పాలు వేయాలి అని నీకు చెప్పింది కదా. ఆ రోజు కుండలో పాలతో పాటు నా భర్తని కూడా తీసుకొని వెళ్ళింది.


నయని: అవునా ఎందుకు అలా చేశారు వెళ్లి ఇప్పుడే తేల్చుకుని వస్తాను.


పెద్ద బొట్టమ్మ: ఇలాంటి సమయంలో కావలసింది వివేకం. నీ చెల్లెలు పాలిస్తే పని సులువు అవుతుంది.


నయని: చెల్లి పాలు ఇవ్వను అని సూటిగా చెప్పేసింది పెద్దమ్మ.


పెద్ద బొట్టమ్మ: నువ్వు సుమనని తన బిడ్డకి పాలిచ్చేలా చూడు. నేను పాము రూపంలో ఆ బిడ్డ పక్కనే దాక్కుంటాను. ఆ సమయంలో కొంత పాలుని ఒడిసి పెడతాను పాములకి ఆ బిడ్డ కూడా సహాయం చేస్తుంది. అది ఎందుకో సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది.


ఆ తర్వాత సీన్లో సుమన హాల్లో పాపని ఉన్న లాలిస్తూ ఉంటుంది. అప్పుడు దురంధర మీ అక్కకి పాలు ఇచ్చే ఆలోచన మీద నీ నిర్ణయం ఏంటి అని అడుగుతుంది. ఇంతలో అక్కడికి తిలోత్తమా వాళ్లు వస్తారు.


తిలోత్తమ: ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇందాక ఇచ్చేది. తనకి ఇచ్చే ఉద్దేశం లేదు బలవంతం చేయొద్దు. 


హాసిని: వచ్చిందండి పెద్ద మహిళ. ఉపన్యాసాలు ఇస్తుంది. అయినా పూర్తి పాలు కాదు కదా కొన్ని పాలు ఇస్తే చాలు చెల్లి కి.


సుమన: ఇప్పుడు తనకోసం నా పాలను వృధా చేసుకోవాలా?


హాసిని: ఎలాగో నీ పాపకి పాలు ఇస్తున్నావ్ కదా దాన్ని వృధా చేయడం అనరా?


ఇంతలో విక్రాంత్ అక్కడికి వచ్చి పాప కి కూడా పాలు ఇవ్వడం లేదు. అందం తగ్గిపోతుందని అని అంటాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా హాసిని ఒక విజిల్ వేస్తుంది. కింద నయని, విశాల్ ఎద్దులయ్య, డమ్మక్క మెట్ల కింద ఉంటారు. ఒక బుట్టలో పెద్ద బొట్టమ్మ పాము రూపంలో ఉంటుంది.


విశాల్: అనుకున్న ప్లాన్లో ఎక్కడ వాళ్లకి సందేహం వచ్చినా సరే ప్లానంతా తిరకాసు అవుతుంది. 


నయని: అందుకే చాకచక్యంగా వెళ్లి పని చేసుకుని వచ్చేద్దాం. అని అందరూ హాల్లోకి వెళ్తారు. నయిని వెళ్లి సుమన పక్కనే కూర్చుని వాళ్ళిద్దరికీ మధ్య బుట్టని పెడుతుంది. బుట్టలో పాము ఉంటుంది. 


ఎద్దులయ్య: విషయం ఏంటంటే డబ్బు ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది అది పెద్ద విషయం కాదు. అందుకనే సుమన వాటా అలాగే నయిని ఆస్తిలో పావలా సుమన పేరు మీద ఇచ్చేద్దాం అని నయని ఇందాక అంటుంది.


తిలోత్తమ: అంత డబ్బు ఇస్తున్నారంటే కచ్చితంగా నీ పాలకోసమే సుమన. నువ్వు మాత్రం తగ్గొద్దు పాలు ఇవ్వొద్దు.


వల్లభ: మంచి అదృష్టమే వచ్చింది. ఆ ఆస్తి 20 కోట్లు వరకైనా ఉంటుంది. పాలు కోసం 20 కోట్లు అంటే మంచి అదృష్టమే.


విక్రాంత్: ఇంకేముంది పాప పుట్టిన రెండు రోజుకు అదృష్టం వచ్చింది అని పాలు ఇచ్చి, ఉన్న ఆస్తి తీసుకో.


సుమన: డబ్బు ఇచ్చి నన్ను కొనేద్దాం అనుకోవద్దు. నేను పాలు మాత్రం అక్కకి చచ్చినా ఇవ్వను కావాలంటే అదేదో నా కూతురికే పడతాను అని తన కూతురికి పాలు పడుతుంది. ఇంతలో పక్కనే ఉన్న బుట్టలో పాము బయటికి వచ్చి ఆ పాలుని చిన్న డబ్బాలో సేకరిస్తుంది. పాలు సేకరించిన తర్వాత నీటిగా వాటిని బుట్టలోకి తీసుకొని వెళ్ళిపోతుంది.ఇది ఎవరు గమనించకూడదు అని అక్కడున్న వాళ్లు తిలోత్తమ వాళ్ళని మాటల్లో పెడతారు. పని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జారుకుంటారు నయని వాళ్ళు.


పెద్ద బొట్టమ్మ: ఈ పాలను తీసుకొని తూర్పు దిక్కున వెళుతూ ఉండు ఎక్కడ ఆగితే అక్కడే నాగయ్య ఉన్నట్టు. ఆలస్యం అవుతుంది ఇంక వెళ్ళు.


పక్కనే తినోత్తమా, వల్లభ ఈ దృశ్యాన్ని చూస్తారు కానీ వాళ్ళకి పెద్ద బొట్టమ్మ కనిపించదు.


నయని: ఈ పాలను తీసుకొని వెళ్లి కుండలో కలిపి నాగయ్యను విడిపిస్తాను.


విక్రాంత్: చచ్చాం మమ్మీ సుమన పాలు నయని దగ్గరికి ఎలా వచ్చాయి?


తిలోత్తము: ఏదో శక్తిని నయనికి సహాయం చేసింది. నయిని అఖండ స్వామి దగ్గర ఉన్న కుండా దగ్గరికి వెళ్లే లోపు మనం అక్కడికి వెళ్లాలి అని చెప్పి ఇద్దరూ అటువైపు పరిగెడతారు.


అఖండస్వామి: ఏంటి పరిగెత్తుకుంటూ ఇటువైపు వచ్చారు?


తిలోత్తము: నయని, సుమన పాలు పట్టుకొని ఇటువైపే వస్తుంది నాగయ్యను విడిపించడానికి. అని అంటుంది ఆ మాటలకి అఖండస్వామి ఒకేసారి తన స్థానం నుంచి 


పైకి లేస్తాడు. మరోవైపు నయిని తూర్పు దిక్కున నడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: Krishna Mukunda Murari September 7th: మురారీ తన భర్తని చెప్పకనే చెప్పిన ముకుంద- భవానీ మాటలకు షాకైన శ్రీనివాసరావు