Trinayani August 19th: ఫోటోలో శివుడు కనిపించడంతో అందరూ దేవుని చూసి ఆశ్చర్యపోతారు. ఇక అందరూ శివుడిని తలుచుకుంటూ దండం పెడుతారు. చిత్ర రూపంలో ఉన్న స్వామివారి సాక్ష్యం అని డమ్మక్క నయనితో అంటుంది. ఇక తిలోత్తమా ఆకులతో ఎందుకు కప్పేశారు అనటంతో.. ప్రాణనాధుడిని గుర్తుపట్టడానికి తను నయనికి ఇస్తున్న సూచిక అని అనటంతో ఆ మాటలు నయనికి అర్థం కావు.


ఇక తనకు అర్థం కాలేదు అనడంతో త్వరలో నువ్వు ఆలోచనలు పడతావు, ఆరాటపడతావు. అప్పుడే నీకు ఈ విషయాలన్నీ గుర్తుకు రావాలి అని అనటంతో వెంటనే ఆ మాటలు అర్థం కాని ఇంట్లో వాళ్లంతా విశాలాక్షిపై కౌంటర్లు విసురుతారు. ఇక మేమైతే నమ్మము అన్నట్లుగా తిలోత్తమా అనటంతో.. వెంటనే విశాల్ నేను నమ్ముతాను.. నా జాతక దోషాన్ని విశాలాక్షి ఉదాహరణలతో వివరిస్తుంది అని అంటాడు.


డమ్మక్క గుర్తుపట్టాడు అని అనటంతో ఎద్దులయ్య కూడా.. శివయ్య వారి చిత్రపటాన్ని చూస్తే రేపో మాపో ఏం జరుగుతుందదో తెలుసుకోవచ్చని అంటాడు. అయినా కూడా నయని ఇంకాస్త అర్ధం చేయమని అనటంతో వెంటనే ఎద్దులయ్య శివుడి పటంపై పువ్వులు చల్లుతాడు. అదే సమయంలో విశాల్ పై   కూడా పువ్వులు పడతాయి. అది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.


దానికి అర్థం ఏంటో తెలుసా అని విశాలాక్షి  అడగటంతో.. విశాల్ చచ్చిపోతాడు అని తిలోత్తమా అంటుంది. వెంటనే నయని తనపై కోపంగా అరుస్తుంది. ఇక తిలోత్తమా పువ్వులు ఎప్పుడు చల్లుతారు ఏదైనా మంచి చేసినప్పుడు.. మరొకటి చనిపోయినప్పుడు అని నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో వెంటనే అలా భయపెట్టించే విధంగా ఎందుకు మాట్లాడతారు అంటుంది.


బాధ పెట్టేవారు అలా అన్నా నిజమే చెప్పారు అనుకోవాలి అని అంటుంది విశాలాక్షి. అందరూ షాక్ అవ్వగా.. వెంటనే సుమన తాతయ్య చెప్పినట్లు జరిగింది అని ఏ క్షణమైన తను పోవడం గ్యారెంటీ అని తనకు రావాల్సిన ఆస్తులు ఇవ్వమంటే రోజులు లెక్కపెడుతున్నారు అని అనటంతో విక్రాంత్ తనపై అరుస్తాడు.


ఇక జలంధర ఏ గండం వచ్చినా కాపాడుకోవడానికి నయని ఉందని ధైర్యం ఇస్తుంది. అప్పుడే విశాలాక్షి రెండు ప్రమాదాలు ఒకేసారి వస్తే ఎవరిని కాపాడాలో తెలియని అయోమయానికి నయని గురవుతుందని అంటుంది. ఆ తర్వాత శివయ్య పటం వెనుక ఏముందో చూపించమని విశాలక్షి అనటంతో ఎద్దులయ్య ఫోటో తిప్పగా అక్కడ కూడా శివయ్య ఫోటోనే ఉంటుంది. ఇక ఆ ఫోటోలను గుర్తుకు పెట్టుకోమని నయనికి చెబుతుంది విశాలాక్షి.


రాబోయే పరిణామాలకు జాగ్రత్తగా ఉండమని హింట్ ఇస్తుందని విశాల్ నయనితో అంటాడు. ఇక ఓం ఆకారంలో ఉన్న దీపాల వల్ల నయనికి గుర్తుకు వస్తుంది అని చెప్పి విశాలాక్షి అక్కడి నుంచి వెళ్తుంది. విశాలాక్షి చెప్పింది ఏమీ అర్థం కాలేదు అని దురంధర  అనటంతో.. అది అమ్మవారి లీల అని డమ్మక్క అంటుంది. అందులో అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంటుంది అని ఎద్దులయ్య అంటాడు.


ఆ తర్వాత నయనికి పాము బుసలు కొడుతున్న సౌండ్ రావడంతో నాగయ్యను పిలుస్తుంది. అప్పుడే విశాల్ అక్కడికి వచ్చి పూజ జరిగాక నువ్వు ఆలోచనలో పడతావు అనుకున్నాను అని అనటంతో వెంటనే ఆలోచించాలి కదా నయని అని పెద్దబొట్టమ్మ అనటంతో వెంటనే నయని తన మనసులో వచ్చింది నాగయ్య కాదని పెద్దబొట్టమ్మని చెప్పిన ఉపయోగం లేదని.. తను విశాల్ కి కనిపించదు అని అనుకుంటుంది.


ఇక విశాల్ తన మీద పువ్వులు పడినందుకు, శివుడి చిత్రపటం కనిపించినందుకు ఆలోచించి నన్నేమైన ప్రశ్నలు అడుగుతావేమో అనుకున్నాను అని అంటాడు.  దానితో పనిలో పడి మర్చిపోయాను అని నయని అనటంతో.. అయితే నాకు ఏ ప్రమాదం రాదన్నమాట అని విశాల్ అంటాడు. అప్పుడే పెద్ద బొట్టమ్మ వస్తుంది నయని అనటంతో ఇక నయని అటువైపు చూస్తూ ఉంటుంది.


ఎందుకు అలా దిక్కులు చూస్తున్నావు అన్ని విశాల్  అడగటంతో.. సమస్య ఎలా వస్తుందో అని చూస్తున్నాను అని అంటుంది. వెంటనే పెద్ద బొట్టమ్మ విషం తాగుతున్న నీలకంటేశ్వరుని చూస్తే నీ తాళిబొట్టు కూడా విషంలో అద్దాల్సి రావస్తుందని శంకించలేదా అనటంతో నయని కంగారు పడుతుంది. ఇక ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని విశాల్ అంటాడు.


ఇక పెద్దబొట్టమ్మ పటానికి తిప్పి చూశాక శివయ్య మరోలా కనిపించాడు.. నీకు తారసపడే భవిష్యత్తు అని.. గుర్తుపట్టక తప్పదు కూడా అనటంతో కంగారు పడుతుంది. ఇక నీ గుండెల్లో అలజడి మొదలవుతుంది.. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే.. నీ త్రినేత్రంతో గండాన్నిచూడాలి దాన్నిబట్టి నువ్వు అడుగులు వేస్తే నీ భర్తను కాపాడుకోగలవు అని అంటుంది పెద్దబొట్టమ్మ.


వెంటనే విశాల్ తను కంగారుపడడానికి చూసి తనను అందులోకించి బయటపడడానికి తనకు ఒక పని చెబుతాను అని తీసుకెళ్తాడు. ఆ తర్వాత తిలోత్తమా, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు. దత్తత తీసుకున్న గాయత్రి పాప వల్ల కాలు విరిగేలాగా అయింది అని అంటుంది. దాంతో పాపను దత్తత తీసుకోలేదు అని అఖండస్వామి అంటాడు.


మధ్యలో వల్లభ వెటకారంగా డైలాగులు కొడుతూ ఉంటాడు. ఇక తాము చేస్తున్న ప్లాన్ లు పాడవుతున్నాయని.. ఈసారి ఎలాగైనా తమ ప్లాన్లు గెలవాలి అని అంటుంది. అంతేకాకుండా ప్రతిదానికి నయని అడ్డుపడుతుందని అంటుంది. ఇక సలహా ఇవ్వమని అడుగుతుంది. దాంతో సలహా ఇస్తాను సాహసం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అఖండస్వామి అంటాడు.


సుమనకు ప్రసవం అయ్యేలా చేయాలి అని అనటంతో.. ఇంకో ఐదు ఆరు రోజులు సమయం ఉందని మా చిన్న కోడలు అన్నదని అంటుంది. ఈరోజు ప్రసవం జరిగితే ప్రళయం మొదలవుతుంది అని అంటాడు స్వామి. ఇక ఏం చేయాలి అని అడగటంతో.. వెంటనే స్వామి కొన్ని విషయాలు చెబుతాడు. దానికి తిలోత్తమా అలాగే అంటాడు.


ఆ తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకోగా అక్కడే సుమన ఉంటుంది. ఇక దురంధర అక్కఏవో కూరగాయలు తీసుకొచ్చింది అనడంతో.. దారిలో నాటు కొత్తిమీర కనిపించింది అని.. గర్బిని స్త్రీలు వాసన పీల్చుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువట అనటంతో వెంటనే విక్రాంత్ లాస్ట్ టైం సిజరింగ్ జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటాడు.


దానితో సుమన వినిపించుకోకుండా.. ముందుగా ప్రవర్తించడంతో నయని కూడా ఆపుతుంది. కానీ సుమన వినకుండా కొత్తిమీర వాసన పీల్చుకోవటానికి ప్రయత్నిస్తుండగా విశాలాక్షి వచ్చి చెయ్యి పట్టుకొని అడ్డు ఆపుతుంది. ఇక సుమన చెయ్యి తీయి అంటూ కోపంగా అంటుంది. ఇక కొత్తిమీర వాసన కూడా పీల్చుకోకుండా చేస్తున్నారేంటి అని వల్లభ అనడంతో.. అలా చేయకూడదు అని డమ్మక్క అంటుంది. చేస్తే ఏం జరుగుతుంది అని తిలోత్తమా అనటంతో కాన్పు అవుతుంది అని విశాలాక్షి అంటుంది. దాంతో తిలోత్తమా షాక్ అవుతుంది.


also read it : Prema Entha Madhuram August 18th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఛాయాదేవి చేసిన ప్లాన్ కు కంగారులో అను - ఆర్యని చంపడానికి వచ్చిన క్రిమినల్స్?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial