Prema Entha Madhuram August 18th: అను ఆర్యకు చేయాలనుకున్న మెసేజ్ కట్ చేస్తూ ఉండగా పొరపాటున ఆర్య కు ఫోన్ కలుస్తుంది. వెంటనే ఫోన్ కట్ చేసేలోపు ఆర్య ఫోన్ కు మిస్డ్ కాల్ పడుతుంది. అప్పుడే ఆర్య తన గదిలో ఉండగా ఫోన్ పట్టుకొని చూస్తాడు. వెంటనే మిస్డ్ కాల్ వచ్చిన నెంబర్కు ఫోన్ చేస్తాడు. దాంతో అను సర్ అనటంతో అను అని అంటాడు ఆర్య. దాంతో అను బాధపడుతూ తను భాను అని.. ఈరోజు కొత్త సిమ్ తీసుకున్నాను. మీ నెంబర్ సేవ్ చేస్తుంటే కాల్ వచ్చింది అని అంటుంది.


ఇక ఆర్య సరే అని బాబు గురించి అడిగి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత శారదమ్మ భోజనం ఏర్పాట్లు చేసి అందరి కోసం ఎదురుచూస్తుంది. అప్పుడే అంజలి దంపతులు అక్కడికి రాగా ఆర్య కోసం ఎదురుచూస్తుంది. అదే సమయంలో అక్కడికి ఛాయాదేవి రావటంతో శారదమ్మ డోర్ దగ్గరికి వెళ్లి తనను చూసి మీరెవరు అని అడుగుతుంది. అంజలి దంపతులు కూడా అక్కడికి వచ్చి తనను చూసి షాక్ అవుతారు.


ఇక తను ఛాయాదేవి అనడంతో శారదమ్మ కూడా షాక్ అవుతుంది. ఎందుకు వచ్చావు అని శారదమ్మ అడగడంతో.. అదేంటి వర్ధన్ ఫ్యామిలీ గెస్ట్ లను బాగా రిసీవ్ చేసుకుంటారని విన్నాను. కానీ మీరు మాత్రం ఏమి చేయటం లేదు అనటంతో శారదమ్మ బాబుని కిడ్నాప్ చేయటానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ తనపై కోపంగా అరుస్తుంది. అంజలి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తుంది. ఇక నీరజ్ తనను బయటకి గెంటేయాలని వెళ్తుండగా అప్పుడే అక్కడికి ఆర్య వచ్చి నీరజ్ ను ఆపుతాడు.


వెంటనే ఆర్య ఛాయాదేవితో ఎందుకు వచ్చావు అనటంతో.. టెండర్ గురించి ఫోన్లో చెప్పినందుకు వింటావా వినవా అని ఇంటికి వచ్చి చెప్పడానికి వచ్చాను అని పొగరుగా అంటుంది. ఆ టెండర్ నీకు దక్కకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఆయుధం ఉందని.. అదే అను అని అంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ టెండర్ లో నేను గెలిస్తే ఓకే కానీ నువ్వు మాత్రం గెలిస్తే మరోలా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది.


శారదమ్మతో కూడా నీ కొడుక్కి చెప్పు అని అనటంతో వెంటనే శారదమ్మ కొడుకు ఎదుగుతుంటే ఏ కన్నతల్లి ఆపదు అని అంటుంది. ఇక ఆర్య కూడా తను టెండర్ సొంతం చేసుకుంటాను అన్నట్లుగానే తనతో మాట్లాడుతాడు. దాంతో ఛాయాదేవి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. వెంటనే శారదమ్మ అను ఎక్కడుందో తనకు తెలుసా.. మనకు అను ముఖ్యం కదా అనటంతో ఆర్య ఒకవైపు అను పిల్లలు, మరోవైపు పేద పిల్లల భవిష్యత్తు కావాలి అని.. ఎలాగైనా వీటి గురించి ఆలోచించాలి అని అంటాడు.


తర్వాత అను బాబుని పడుకోబెడుతూ ఉండగా అప్పుడే ఛాయాదేవి నెంబర్ నుండి రౌడీల ఫోటో, వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ లో.. ఈ క్రిమినల్స్ నీ భర్తను చంపడానికి వస్తున్నారు అని ఉంటుంది. దాంతో వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పాలి అని అనుకోగా.. ఆ మెసేజెస్ డిలీట్ చేసేస్తుంది  ఛాయాదేవి. వెంటనే కంగారుపడుతూ ఉండగా రేష్మ, అంజలి అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు.


తను ఇప్పుడే వస్తాను అని చెప్పి బాబుని తీసుకొని ఆర్య ఇంటికి ఆటోలో బయలుదేరుతుంది. మరోవైపు ఆర్య ఇంటికి క్రిమినల్స్ వచ్చి ఆర్య పై కత్తితో దాడి చేస్తుండగా నిద్రలో ఉన్న ఆర్య వెంటనే ఆ క్రిమినల్ చేతి పట్టుకొని కళ్ళు తెరిచి బాగా చితక్కొడతాడు. హాల్ లోకి వచ్చి వారితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ క్రిమినల్స్ అంతా ఆర్యను పట్టుకొని కత్తితో పొడుస్తూ ఉండగా అను వచ్చి ఆపుతుంది.


ఇక అను నీ పక్కకు తోయటంతో తన చేతికి గాయం అవడంతో పాటు గట్టిగా అరుస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూడటంతో వెంటనే ఆ క్రిమినల్స్ అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళని పట్టుకోవడానికి నీరజ్, ఆర్య ప్రయత్నించిన కూడా వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోతారు. ఇక అనుకి అంజలి చేతికి కట్టు కడుతుంది. ఇక ఆర్యను కాపాడినందుకు ఇంట్లో వాళ్లంతా థాంక్స్ చెబుతారు. 


వెంటనే ఈ సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనటంతో.. అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది అని అంజలి మేడం హెల్ప్ తీసుకుందామని వచ్చాను అని అంటుంది. తనను కాపాడినందుకు ఆర్య కూడా అనుకి థాంక్స్ చెబుతాడు. ఇంతకు ఆ క్రిమినల్ ఎవరు పంపించారు అని ఇంట్లో వాళ్ళు అనుమానంలో ఉండటంతో ఆ ఛాయాదేవి అని అంటాడు ఆర్య. ఇక ఆర్య భాను కి డబ్బులు ఇవ్వమని నీరజ్ కి చెప్తాడు. నీరజ్ సరే అని అలాగే తనను హాస్పిటల్ లో చూయించి ఇంట్లో దిగి పెట్టేసి వస్తాను అని అంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరగా ఛాయాదేవి ఆర్య కు ఫోన్ చేస్తుంది.


 


also read it : Janaki Kalaganaledhu August 17th: 'జానకి కలగనలేదు' సీరియల్: జానకి చూపించిన ఆ పచ్చబొట్టును రామ గుర్తుపట్టాడా? జానకికి అడ్డంగా దొరికిపోయిన కిషోర్?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial