Trinayani June 28th: మళ్లీ పునర్జన్మ ఎత్తటానికి గాయత్రి అత్తగారు ఇక్కడే ఉన్నారు అని హాసిని అనడంతో.. వెంటనే సుమన గాయత్రి అత్తయ్య ముగ్గురు పాపలలో ఎవరో ఒకరిలోకి దూరిందంటావా అంటు వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. అప్పుడే తిలోత్తమా హాసిని గురించి తెలియందేముంది. తను అన్ని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అని అంటుంది.


ఇక నయని ఈ వర్ధంతి చేయద్దు అని తిలోత్తమా కు చెబుతూ ఉంటుంది. విశాల్ కూడా చెయ్యొద్దు అమ్మా అని చెబుతూ ఉంటాడు. కానీ తిలోత్తమా వినిపించుకోదు. వెంటనే నయని జరగబోయే దాని గురించి గుర్తుకు చేసుకొని వద్దు అని చెబుతుంటుంది. మీరు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని అంటుంది. ఇక తిలోత్తమా వినిపించుకోకుండా గాయత్రి ఫోటో ముందు దీపం పెడుతుంది.


గురువుగారు మీరైనా చెప్పండి అని నయని అనడంతో ఏం జరుగుతుందో జరగనివ్వు అని కానీ ఈ వర్ధంతి సంపూర్ణం కాదు అని అంటాడు. ఇక అదే సమయంలో గాలి రావటంతో దీపాలు పోతాయి. దాంతో ఇదంతా జరగబోయే పరిణామాలను ఆపటానికి సూచిక అని చెబుతుంది. విశాల్ కూడా వద్దని చెబుతూ ఉంటాడు. విక్రాంత్ కూడా వద్దన్న పని ఎందుకు చేస్తున్నావు.. లేదంటే రేపు పేపర్లో తిలోత్తమా మరణం అని వస్తుంది అంటాడు.


దాంతో వల్లభ ఇలా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారా అని చిదరించుకుంటాడు. మళ్లీ దీపం పెడితే పోతుంది అని విశాల్ అనడంతో.. ఈసారి దీపం పెట్టను.. కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి మూడు చుట్లు తిప్పేస్తే వర్ధంతి పూర్తవుతుంది అని అంటుంది. దాంతో అన్నట్లుగానే కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమవుతుండగా నయని వద్దని చెప్పటంతో విశాల్ తనను ఊరుకోమని అంటాడు.


ఇక కొబ్బరికాయ కొట్టాక ఏం జరగలేదు అని.. సంతోష పడుతూ హారతి ఇస్తుండగా వెంటనే గాయత్రి పాప అక్కడున్న బట్టను కిందికి లాగడంతో గాయత్రి ఫోటో కిందపడి ఆ ఫోటోకు ఉన్న గాజు ముక్కలు తిలోత్తమా మెడకు గుచ్చుకుంటాయి. దాంతో తనకు రక్తం కారటంతో అందరూ భయపడుతుంటారు. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేశాక హాసిని.. అప్పటికి నయని చెబుతుంటే కూడా వినలేదు వెటకారం చేస్తూ ఉంటుంది.


మధ్యలో సుమన కాస్త కోపంగా మాట్లాడుతూ.. అసలు అనాల్సింది నయని అక్కను తనకి ఏం జరుగుతుందో నిజం తెలిసినా కూడా చెప్పకపోవడం తన తప్పు అని అనటంతో వెంటనే వల్లభ నీకు ముందే నిజం తెలుసని పాపల మీద ఒట్టేయమని చెబుతాడు. దాంతో నయని వల్లభ పై కోపంగా అరుస్తూ.. అవును ఇలా జరుగుతుందని ముందే తెలుసు అని అనటంతో అందరూ షాక్ అవుతారు.


మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అనటంతో వెంటనే విశాల్ ముందు నుంచి వర్ధంతి చేయద్దు అని చెప్పినా కూడా మీరే వినిపించుకోలేదు అని అంటాడు. ఆ తర్వాత నయని, గురువు మాటలు విని తిలోత్తమా గాయత్రి ఎక్కడో పాప రూపంలో బతికే ఉందని అంటుంది. ఇక వల్లభను పాపల మీద ప్రమాణం చేయమని అన్నందుకు పాపలకు సారీ చెప్పాలి అని అనటంతో సారీ చెబుతాడు వల్లభ. ఆ తర్వాత అందరూ ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సుమన, వల్లభ, తిలోత్తమా ఒకే దగ్గరుండి ఆలోచనలో పడతారు.


Also Read: Rangula Ratnam June 27th: భర్త కోసం మరోసారి పేరు మార్చుకున్న పూర్ణ.. నిజం తెలియటంతో తట్టుకోలేకపోతున్న సూర్యం?