Rangula Ratnam June 27th: శంకర్ ప్రసాద్ వారిని బయటికి వెళ్ళమనడంతో.. వెంటనే రఘు భార్యను, తల్లిని బయటికి తీసుకొని వస్తాడు. ఇక తల్లికి ధైర్యం చెబుతాడు. ఈ సమయంలో మనం నాన్నకు దూరంగా ఉంటేనే మంచిది అని.. లేదంటే ఆ ఆలోచనలతో మళ్ళీ పరిస్థితి చేయి జారిపోతుంది అని దైర్యం చెబుతూ ఉంటాడు. కానీ పూర్ణ మాత్రం చాలా బాధపడుతూ కనిపిస్తుంది.


సీత ఫోన్ చేయటం లేదని జానకి సీత కు ఫోన్ చేయడంతో.. హాస్పిటల్లో మామయ్య ఉన్నాడని అంటుంది. ఆఫీసులో రేఖకు, శంకర్ ప్రసాద్ మధ్య జరిగిన గొడవ గురించి చెప్పి.. ఆ తర్వాత యాక్సిడెంట్ విషయం చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. అంతేకాకుండా చూపు కూడా కోల్పోయాడని చెప్పడంతో బాధపడుతుంది.


ఇక ఈ విషయం మీ నాన్నకు చెబితే ఎలా తట్టుకుంటాడో అని ఫోన్ కట్ చేసిన వెంటనే ఆ మాటలు అన్ని విన్న అసలు తట్టుకోలేక పోతాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదని బాధపడతాడు. జానకి కూడా రేఖ విషయంలో నమ్మినందుకు ఇలా అయ్యింది అని చెబుతూ బాధపడుతుంది. ఇక హాస్పిటల్ కి వెళ్దాం అని అనటంతే ఇప్పుడు వెళ్తే అక్కడ గొడవలు జరుగుతాయని.. ఈ సమయంలో తనను బాధ పెట్టడం కరెక్టు కాదు అని అంటాడు సూర్యం.


పూర్ణ ఏమి తినకుండా అలా కూర్చోవడంతో నూకాలమ్మ వచ్చి తినమని చెబుతూ ఉంటుంది. కానీ పూర్ణ అవేవీ వినిపించుకోదు. ఇక్కడ ఉంటే బాధపడటం తప్ప ఏమి చేయలేవని ఇంటికి వెళ్ళమని అంటుంది. రఘు, సీత కూడా అదే మాట అంటారు. దాంతో నేను వెళ్ళను అని పూర్ణ కోపంతో చెబుతూ.. నేను ఇక్కడే ఉంటాను కావాలంటే మీరు వెళ్ళండి అని అంటుంది.


ఇక డాక్టరమ్మ వచ్చి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు శంకర్ కు ఒక నర్స్ అవసరం కాబట్టి నువ్వు ఇక్కడ పావని అనే పేరుతో నర్సుగా ఉండి నీ భర్తకు దగ్గర ఉండి సేవలు చేయు అని అనటంతో పూర్ణ తృప్తి పడుతుంది. ఇక ఇంట్లో వర్ష పనిచేస్తుండగా తన భర్త ఆకాష్ ఎటువంటి పనులు చేయవద్దని చెబుతూ ఉండగా అప్పుడే ఆకాష్ తండ్రి వచ్చి వర్ష కు తన తండ్రి ఆక్సిడెంట్ అయ్యి చూపు కోల్పోయాడని విషయం చెబుతాడు.


అంతేకాకుండా జరిగిన విషయం కూడా చెప్పటంతో వర్ష నాన్న అని గట్టిగా స్పృహ కోల్పోతుంది. దాంతో ఆకాష్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఈ విషయం ఎందుకు చెప్పావు నాన్న అంటూ తండ్రి పై అరుస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుందని తెలియదు కదా అని.. అయిన తనకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా చెబితే ఇలా జరగటానికి అని అనటంతో.. ఇక ఆకాష్ తన మనసులో నిజంగానే తనకు అనారోగ్య సమస్య ఉందని అనుకుంటూ బాధపడతాడు.


ఆ తర్వాత వర్ష కళ్ళు తెరిచి నాన్న దగ్గరికి వెళ్దాము అని అనటంతో తీసుకెళ్తాను అని ఆకాష్ ధైర్యం చెబుతాడు. ఇక శంకర్ ప్రసాద్ బెడ్ దిగి ముందుకు నడుస్తూ ఉండగా కుర్చీ తగిలి కింద పడిపోతుండగా వెంటనే పూర్ణ వచ్చి పట్టుకుంటుంది. జాగ్రత్త అని చెబుతుంది. ఆ గొంతు విని నువ్వు అర్చన కదా అంటూ చీదరించుకుంటాడు. అప్పుడే నూకాలమ్మ తను అర్చన కాదు అన్నట్లుగా చెబుతుంది. డాక్టరమ్మ కూడా వచ్చి వాళ్ళను పంపించేశాను.. ఇప్పుడు నీకు ఒక నర్స్ తోడు అవసరం కాబట్టి పావని అనే ఈ నర్స్ ను నీ దగ్గర ఉంచాను అని అంటుంది.


Also Read: Trinayani June 27th: గాయత్రి వర్ధంతిలో అందంగా రెడీ అయిన సుమన, తిలోత్తమాకు ప్రాణగండం ఉందని తెలుసుకున్న నయని?