Trinayani August 24th: ఇంట్లో హాసిని.. తిలోత్తమా గురించి వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నయనికి మూడో కంటి ద్వారా మంగళసూత్రం రాయికి కట్టి ఆ రాయి నీళ్లలో మునిగినట్లు కనిపిస్తుంది. వెంటనే కంగారు పడుతూ.. విశాలాక్షి తల్లి ఏంటి ఇలా చూపించావని అడుగుతుంది. దాంతో హాసిని ఏం చూపించిందని.. ఎందుకలా కంగారు పడుతున్నావు అనటంతో.. విశాల్ కూడా అక్కడికి వస్తాడు. ఇక నయని తనకు కనిపించిన దృశ్యాన్ని చెప్పటంతో విశాల్ అదంతా పాజిటివేమో అన్నట్లుగా చెబుతూ ఉంటాడు.


వెంటనే హాసిని.. నయని చెబుతుంది అంటే అదేదో కంగారు పడాల్సిన విషయమే అని.. అదే తన తాళిబొట్టు అలా అవుతే కంగారు పడనని ఎందుకలా అంటున్నావు అని విశాల్ అంటాడు. తెలుసు కదా ఎప్పుడైనా మీ అన్నయ్య నన్ను సరిగ్గా చూసుకున్నాడా అని అంటుంది. అదే నయని నిన్ను బాగా ఆరాధిస్తుంది.. నువ్వు కూడా అపురూపంగా ప్రేమ చూపిస్తావు అని.. దేనికైనా అదృష్టం ఉండాలని అంటుంది.


వెంటనే నయని అదృష్టమే దురదృష్టంగా మారబోతుందేమో అని భయంగా ఉందని అంటుంది. ఇక విశాల్ రిలాక్స్ అంటూ.. అది నీ తాళిబొట్టే   అనుకుందాం.. అది ఎక్కడ పోతే ఎందుకు అనటంతో అలా మాట్లాడుతున్నారు ఏంటని అంటుంది నయని. దాంతో విశాల్ టెన్షన్ పడకు పొరపాటున పోయినా కూడా ఇంకొకటి చేయించి నీ మెడలో వేస్తాను అని ధైర్యం ఇస్తాడు.


ఆ తర్వాత తిలోత్తమా హాల్లో కాఫీ తాగుతూ అందులో చక్కెర లేదు అని చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడే హాసిని అక్కడికి ఒక చీర తీసుకొని వచ్చి ఇది ఎలా ఉంది అంటూ అడుగుతుంది. దాంతో తిలోత్తమా కాస్త చిరాకుగా మాట్లాడి కాఫీలో చక్కెర లేదు అనటంతో వెంటనే హాసిని ఆ కాఫీ తాగుతుంది. అదేంటి నా ఎంగిలి తాగావు అని తిలోత్తమా అడగటంతో.. ప్రతిరోజు నేను టెస్ట్ చేశాకే నీకు ఇస్తాను కదా అనటంతో తిలోత్తమా షాక్ అవుతుంది.


ఇక ఈ చీర కావాలా.. కావాలంటే తీసుకో.. ఈ చీర నేను ఏమి డబ్బులు పెట్టి తీసుకోలేదు గాయత్రి అత్తయ్యది.. నయని అన్ని ఒకచోట సర్దుతుంటే నేను తీసుకున్నాను అని అంటుంది. దాంతో తిలోత్తమా కాస్త ఆశ్చర్యపోతుంది. ఇక హాసిని ఆ చీర తిలోత్తమా మీద వేస్తుంది. ఇక నువ్వు వెళ్లి కాఫీ తీసుకొని రా అని అనటంతో హాసిని సరే అని అక్కడి నుండి వెళ్తుంది. తిలోత్తమా ఆ చీర మీద వేసుకొని గాయత్రీ దేవి ఫోటో వైపు చూస్తూ పొగరుగా తను చేసిన కుట్రల గురించి మాట్లాడుతూ ఉంటుంది.


(చిన్న పాప ఉరి వేయడం ఏమిటో, అది విడిపించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఏమిటో - ఈ రోజు ఎపిసోడ్‌లో చిత్రవిచిత్ర ఘటన చోటుచేసుకుంటుంది. ఏకంగా చిన్న పాపతో ఉరివేసే సీన్ తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.)


అప్పుడే గదిలో నుండి మెల్లిగా గాయత్రి పాప తిలోత్తమా వెనకాలకు వెళ్లి ఆ చీరను తనకు ఉరితాడుగా బిగిస్తుంది. దాంతో తిలోత్తమా ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ కాళ్ళు కొడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో తన తల్లిని చూసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందేమో అని వల్లభ దురంధరతో అంటాడు. ఇక సుమన వచ్చి తన అత్తను చూసి గట్టిగా అరిచి తనకు ఏదో జరుగుతుంది అని అక్కడికి కంగారుపడి దగ్గరికి వెళ్తారు.


అప్పుడే గాయత్రి పాప లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ తిలోత్తమా దగ్గరికి వచ్చి కంగారుపడుతూ ఏం జరిగిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తనకు ఊపిరి ఆడకపోయేసరికి వెంటనే హాసిని ఇలాంటి సమయంలోనే ప్రాణవాయువు అందించాలని వెంటనే తిలోత్తమా నోరు దగ్గర నోరు పెడుతుంది. ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నా కూడా హాసిని వినదు. తనను బలవంతంగా వెనక్కి తీసుకోగా నన్ను కాపాడనివ్వండి అని అంటుంది.


ఇక తిలోత్తమా స్పృహ కోల్పోయి సోఫాలో పడుతుంది. వెంటనే వల్లభ కంగారుపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నయని నీరు చల్లటంతో స్పృహలో నుండి బయటికి వచ్చి నా ప్రాణం ఎవరు తీయాలనుకున్నారు అని కోపంగా అడుగుతుంది. వెంటనే హాసిని నేనే నీకు ఊపిరి ఇచ్చాను అనటంతో నువ్వు ఇచ్చిన చీరతోనే గొంతు బిగిసుకునేలా లాగిపెట్టారు అనటంతో అందరూ షాక్ అవుతారు.


ఆ పని ఎవరు చేశారని అడుగుతుంది. ఇక హాసిని జరిగిన విషయం మొత్తం చెబుతుంది. తను అత్తయ్యకు గాయత్రి అత్తయ్య చీర ఇచ్చి కాఫీ తేవడానికి వెళ్లాను అని చెబుతుంది. అప్పుడే సుమన తనకు అర్థమయింది అంటూ.. అత్తయ్య పరధ్యానంలో ఉండగా ఎవరో వచ్చి ఆ చీరతోనే అత్తయ్యకు గొంతు నులిమేలా చేశారని అంటుంది. ఇక ఆ సమయంలో ఇక్కడ ఎవరూ లేరు అని వల్లభ అంటాడు.


ఇక నయని ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుస్తుంది కదా.. అటువంటి సూచనలను కనిపించలేదు అంటే అత్తయ్యకు ఏమైనట్లు అని కంగారుపడుతుంది. వెంటనే హాసిని.. ఈ పని చేసింది గాయత్రి అత్తయ్యనే అని.. నా మొగుడిని వలలో వేసుకుంది కాకుండా నా చీర కూడా వేసుకుందని గొంతు నులిమేసింది అని తన అత్త గొంతు పట్టుకోడానికి వెళుతుండగా వెంటనే అందరూ ఆపుతారు.


వెంటనే విశాల్ నయనితో హాసినిని లోపలికి తీసుకెళ్లమని అనడంతో నయని హాసినిని లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత సుమన పెద్ద అత్తయ్య వస్తువుల జోలికి వెళ్లొద్దు అని అనటంతో అది నీకు కూడా వర్తిస్తుంది అని విక్రాంత్ అంటాడు. ఆ తర్వాత గదిలో వల్లభ తల్లి మెడపై ఆయిల్ తో మర్దన చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పావన మూర్తి ఒక ఔషధం తీసుకొని వచ్చి గొంతు నొప్పి పోవడానికి తిలోత్తమాకు ఇస్తాడు.


వెంటనే తిలోత్తమా ఔషధం తాగుతూ ఉండగా తనకు పొలమార్తే వెంటనే పాపను మూర్తి, వల్లభ తలపై గట్టిగా కొడుతూ ఉంటారు. వదలమని తిలోత్తమా తిరిగి వారిని గట్టిగా కొడుతుంది. ఔషధమని కారం వేసుకొని తీసుకొచ్చాడు అని అంటుంది. దాంతో పావన మూర్తి హాసనమ్మని అడుగుతే ఈ ఔషధం చేసి ఇచ్చింది అని అంటాడు. ఇక తిలోత్తమా వారిద్దరిపై బాగా ఫైర్ అవుతుంది.


అక్కడ సీన్ మొత్తం కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే పావని మూర్తి అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత.. ఇంతకు నా గొంతుకు ఆ చీర ఎవరో బిగించి ఉంటారు అని అడగటంతో ఇంకెవరు గాయత్రి పెద్దమ్మ అని.. హాసిని చెప్పింది కదా అని అంటాడు వల్లభ. ఇక నిజమే గాయత్రి అక్క అలా చేసింది అని నేను కూడా నమ్ముతున్నాను అని అంటుంది. ఎందుకంటే అఖండ స్వామి చెప్పినట్టు తన అంశ ఇక్కడే ఉంది అని అంటుంది. ఎలా కనుక్కోవాలి మమ్మీ అని వల్లభ అడుగుతాడు.


నాగయ్యను బంధించినట్లు గాయత్రి దేవిని కూడా బంధించాలి అని అంటుంది తిలోత్తమా. ఆ తర్వాత సుమన గదిలో సుమన పక్కన పెద్ద బొట్టమ్మ పడుకొని సుమన కడుపుపై చేతితో రాస్తూ ఉంటుంది. వెంటనే సుమన లేచి పెద్దబొట్టమని చూసి షాక్ అవుతుంది. పెద్దబొట్టమ్మ నువ్వా.. పడుకుని ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది.


also read : Prema Entha Madhuram August 23rd: పరాయి మొగుడితో రోడ్డుపై సరసం ఆడటానికి కాస్తైన సిగ్గు ఉండాలి - అంజలి వ్యాఖ్యలపై నీరజ్ ఎలా స్పందించాడు?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial