ఈ వారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో సరికొత్త స్కిట్లతో నవ్వించేందుకు టీమ్‌లు సిద్ధమయ్యాయి. ఈ వారం స్పెషల్ ఏమిటో చూసేద్దామా.


కేరళ, జపాన్ జంటలకు మధ్య పోటీ
ఎక్కడో ఉన్న చైనాను, మరెక్కడో ఉన్న జపాన్‌ను కలిపేశాడు ఇమాన్యుయెల్. కేరళ జంటగా ఇమ్మాన్యుయేల్, వర్ష కనిపించగా.. జపాన్‌కు చెందిన జంటగా.. బాబుతో పాటు మరో అమ్మాయి కనిపించింది. ఈ ఇద్దరి జంటల మధ్య కేరళ, జపాన్ స్లాంగ్స్‌లో జరిగిన సంభాషణలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈ స్కిట్‌లో బాత్రూమ్‌లో ఉన్న వర్షను బలవంతం చేయాలనుకున్నా బాబు.. పొరపాటున ఇమ్మాన్యుయేల్‌ను బలవంతం చేయడంతో ఘోరంగా జరిగిపోయింది అంటూ కేరళ స్టైల్‌లో ఇమ్మాన్యుయేల్ చెప్పిన డైలాగ్ అందరినీ పడి పడి నవ్వేలా చేసింది.


‘బ్రో’గా ఆటో రామ్‌ప్రసాద్
ఇక వచ్చే ఎపిసోడ్‌లో ‘ఛత్రపతి’ స్ఫూఫ్‌తో పాటు ‘బ్రో’ స్ఫూఫ్‌ను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నారు ఎక్స్‌ట్రా జబర్దస్త్ కంటెస్టెంట్స్. ఇక ఈ స్ఫూఫ్‌లో పవన్ కళ్యాణ్‌గా ఆటో రామ్‌ప్రసాద్ కనిపిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్‌గా రంగస్థలం మహేశ్ కనిపించాడు. ఈ ఇద్దరు డైలాగ్ డెలివరీ విషయంలో ఎప్పుడూ పోటాపోటీగానే ఉంటారు. అలాంటి వారు ‘బ్రో’ స్ఫూఫ్ చేయడంతో పంచులకు కొదవలేకుండా పోయింది. ఇక ఈ టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్ చేసిన సందడి చూసి జడ్జిలు ఖుష్భూ, కృష్ణభగవాన్‌తో పాటు యాంకర్ రష్మీ కూడా పడీ పడీ నవ్వుకున్నారు.



మరోసారి డైరెక్టర్‌గా బుల్లెట్ భాస్కర్
జబర్దస్త్‌లో కానీ, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కానీ డైరెక్టర్‌గా బుల్లెట్ భాస్కర్ చేసిన ప్రతీ స్కిట్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే విధంగా మరోసారి బుల్లెట్ భాస్కర్.. డైరెక్టర్‌గా నవ్వులు పూయించడానికి వచ్చేశాడు. ఇక ఈ డైరెక్టర్ ఆడుకోవడానికి ఒక హీరో కావాలి కదా.. ఆ హీరో పాత్రలో నాటీ నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.‘పోకిరి’లో మహేశ్ బాబు ఇమిటేట్ చేస్తున్నట్టుగా నరేశ్ చెప్పిన డైలాగులు అందరూ నవ్వుకునేలా ఉన్నాయి. ఇలా మరోసారి బుల్లెట్ భాస్కర్, నాటీ నరేశ్.. డైరెక్టర్, హీరో కాంబినేషన్ స్కిట్ బ్లాక్‌బస్టర్ కొట్టింది.


మొగుడు, పెళ్లాల గొడవలు ఎప్పుడూ బోర్ కొట్టవు
టీమ్ లీడర్‌గా మారిన తర్వాత చాలాకాలం వరకు రాకింగ్ రాకేశ్.. పిల్లలతోనే స్కిట్స్ చేశాడు. ఆ స్కిట్సే తనను మంచి టీమ్ లీడర్‌గా నిలబెట్టాయి. ఎన్నో ఎపిసోడ్స్‌కు విన్నర్‌ను కూడా చేశాయి. కానీ గత కొంతకాలంగా తన రియల్ లైఫ్ పార్ట్‌నర్.. సుజాతతో కలిసి స్కిట్స్ చేయడం మొదలుపెట్టాడు రాకేశ్. స్క్రీన్‌పై కూడా వీరు మొగుడు, పెళ్లాలుగా కనిపించి అలరించడం మొదలుపెట్టారు. ఇలా వీరు గొడవపడిన ప్రతీసారి.. జడ్జిలు వీరికి పదికి పది మార్కులు ఇచ్చేస్తున్నారు.


 


 


‘ఛత్రపతి’ నాటకంలో హీరోహీరోయిన్‌గా నవీన్, శాంతికుమార్


‘ఛత్రపతి’ లాంటి ఒక మాస్ ఎంటర్‌టైనర్ సినిమాను నాటకంగా మారిస్తే ఎలా ఉంటుంది..? ఈ ఆలోచన రావడం కూడా చాలా డిఫరెంట కదా.. కానీ ఇలాంటి ఆలోచన జబర్దస్త్‌లో నవీన్‌కు వచ్చింది. అందుకే ఈ నాటకంలో తానే హీరో అయ్యి.. శాంతికుమార్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. రాజమౌళిని కాట్రాజు చేశాడు. ఈ స్పూఫ్ మొత్తం ఆడియన్స్‌ను నవ్వుల్లో ముంచేశారు. అంత పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను నాటకంగా మారిస్తే ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఈ స్కిట్‌తో చూడవచ్చు.


Also Read: నన్ను అర్థం చేసుకునేవారు దొరికారు అంటున్న సమంత - ఇంతకీ ఎవరా వ్యక్తి?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial